Srikakulam

News August 29, 2025

ఎచ్చెర్ల: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

ఎచ్చెర్ల హైవేపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకపాలెం నుంచి అల్లినగరం జిల్లా పరిషత్ హై స్కూలుకి వెళ్తున్న ఆటో డివైడర్ ని ఢీ కొని బోల్తా పడింది. ఘటనలో ఏడో తరగతి విద్యార్థి కొప్పిలి మనోజ్(13) మృతి చెందాడు. ఆటోలో మొత్తం ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. మిగిలిన వారికి చిన్న గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News August 29, 2025

ఆదిత్యుని ఆలయం మూసివేత

image

వచ్చే నెల 7న సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని మూసివేస్తామని ఆలయ ఈవో ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజున స్వామి వారికి నిత్యార్చనాలు, నివేదన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు దేవాలయాన్ని మూసివేసి, 8న ఉదయం తెరిచి సంప్రోక్షణం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 8న ఉ. 7:30 నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.

News August 29, 2025

ప్రయాణికులకు అలర్ట్..ఖుర్దా రోడ్ వరకే ఆ రైలు

image

శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ల మీదుగా ప్రయాణించే గుణుపూర్(GNPR)- కటక్(CTC) రైలు ఈ నెల 31న ఖుర్దా రోడ్ వరకే నడపనున్నట్లు రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రాక్ పనులు జరుగుతున్నందున..ఈ నెల 31న నెం.68434 GNPR- CTC మెము ఖుర్దా రోడ్ వరకు, అదే విధంగా నెం.68433 CTC- GNPR మెమో కటక్‌కు బదులుగా ఖుర్దా రోడ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు.

News August 29, 2025

SKLM: 30న ఉద్యోగ మేళాకు ఇంటర్వ్యూలు

image

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా జరగనుంది. ఆగస్టు 30న ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు జిల్లాఉపాధి కల్పనా అధికారి సుధ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ ఇండియా, గోడ్రెజ్ ఇండియా, డివిస్ లాబ్స్, సీల్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రైవేట్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

News August 29, 2025

టెక్కలి: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!

image

టెక్కలి పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం రాత్రి పలు దళిత సంఘాల ప్రతినిధుల సమక్షంలో ప్రేమ జంట ఒక్కటయ్యింది. స్థానికుల వివరాల మేరకు టెక్కలికి చెందిన కిరణ్మయి, విశాఖకు చెందిన శివ శంకర వరప్రసాద్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇరువురు విషయాన్ని వారి ఇంటిలో చెప్పిన నిరాకరించారు. దీంతో వీరిద్దరూ దళిత సంఘాల ప్రతినిధులు బోకర నారాయణరావు, యడ్ల గోపీ తదితరులు సమక్షంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యింది.

News August 29, 2025

శ్రీకాకుళం: ‘ప్రపంచాన్ని నడిపేది క్వాంటం సాంకేతికతే’

image

భవిష్యత్తు ప్రపంచాన్ని ముందుకు నడిపేది క్వాంటం సాంకేతికతేనని కలెక్టర్ దినకర్ పుండ్కర్ అన్నారు. విద్యార్థులు ఈ రంగంలో చేస్తున్న ఆవిష్కరణలు రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్–2025లో భాగంగా ఆర్జీయూకేటీ (త్రిబుల్ ఐటీ ఎచ్చెర్ల), శ్రీకాకుళంలో అంతర్గత హ్యాకథాన్ నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న ఆవిష్కరణలను చూసి ప్రశంసించారు.

News August 29, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

▶ శ్రీకాకుళంలో కార్డెన్ సెర్చ్.. ఐదు బైక్ లు సీజ్
▶10 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి: అచ్చెన్నాయుడు
▶కొత్తూరు: రోడ్డుపై ప్రవహిస్తున్న గెడ్డ నీరు
▶శ్రీకాకుళం, టెక్కలిలో ఈనెల 30న జాబ్ మేళా
▶ కొత్తమ్మతల్లి ఉత్సవాలపై మంత్రి అచ్చెన్న సమీక్ష
▶ రోగులకు సక్రమంగా వైద్యసేవలు అందించాలి: ఎమ్మెల్యే బగ్గు
▶ కొత్తూరులో నీట మునిగిన పంట పొలాలు

News August 28, 2025

టెక్కలి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30 న జాబ్ మేళా

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.టీ.గోవిందమ్మ గురువారం తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీలు నిర్వహించే ఈ జాబ్ మేళాలో 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన వారు జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.

News August 28, 2025

కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి: మంత్రి అచ్చెన్న

image

కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్ర‌తిష్ఠాత్మకంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని మంత్రి అచ్చెన్నాయుడు దేవాద‌య శాఖ అధికారుల‌ను ఆదేశించారు. రానున్న నెల 23 నుంచి 25 వ‌ర‌కు జ‌ర‌గనున్న పండ‌గ మహోత్సవం నేప‌థ్యంలో గురువారం నిమ్మాడ కార్యాల‌యంలో జాత‌ర ఏర్పాట్ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

News August 28, 2025

శ్రీకాకుళం: సావిత్రమ్మ నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళంలోని చిత్రంజన్ వీధికి చెందిన భారటం సావిత్రమ్మ (85) గురువారం ఉదయం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావు విషయాన్ని తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.