Srikakulam

News February 13, 2025

వాసుదేవు పెరుమాళ్ బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

image

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసలో ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీ వాసుదేవుని పెరుమాళ్ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆలయ ప్రధాన అర్చకులతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో మందస గ్రామ పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు.

News February 12, 2025

శ్రీకాకుళం: మరణంలోనూ వీడని బంధం..!

image

యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో కానీ ఒకే రోజు వీరి వివాహం జరిగింది. మరణం కూడా ఒకేరోజు గంటల వ్యవధిలో సంభవించింది. ఒకేరోజు అనారోగ్యంతో బావ, బామ్మర్ది మృతి చెందిన విషాదకర సంఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. సార సోమేశ్వరరావు (58) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా, మరోవైపు కొర్రాయి నారాయణరావు (58) కూడా సోమేశ్వరరావు మృతి చెందిన కొన్ని గంటల్లోనే అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు.

News February 12, 2025

నందిగాం: హత్యకు గురైన తహశీల్దార్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

image

నందిగాం గ్రామానికి చెందిన రమణయ్య విశాఖపట్నంలో తహశీల్దారు విధులు నిర్వహిస్తూ గతేడాది ఫిబ్రవరి 2న హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్‌గా నియామక పత్రం అందించారు.

News February 12, 2025

దళ్లవలస వీఆర్‌ఓ సస్పెన్షన్

image

పొందూరు మండలం దళ్లవలస సచివాలయంలో వీఆర్‌ఓ జె.తవిటయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆయన మీద ఆరోపణలు రావడంతో తహశీల్దార్ విచారించి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. గ్రామ సభలను నిర్లక్ష్యం, మ్యూటేషన్‌కు డబ్బులు అడగడం తదితర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడ్రోజులు క్రమశిక్షణ చర్యల కింద ఆర్టీవో కార్యాలయానికి సరెండర్ చేశారు. ఆరోపణలు రుజువు కావడంతో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News February 12, 2025

సారవకోట: బాలికపై అత్యాచారం 

image

సారవకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం పదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక సోమవారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా తినుబండారాలు ఇచ్చి లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తూ విషయం తల్లికి చెప్పింది. తల్లి ఫిర్యాదుతో ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. డిఎస్పీ డి.ప్రసాదరావు విచారణ చేపట్టారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News February 12, 2025

శ్రీకాకుళం: రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య

image

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసి, సేవలు మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతులకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడి) ఆధార్ కార్డు తరహాలో అందించనున్నదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సొంత భూమి కలిగిన ప్రతి రైతుతోనూ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయించాలన్నారు.

News February 11, 2025

శ్రీకాకుళం: క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం

image

రాష్ట్ర పీఈటి సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన సెమినార్, క్రీడా పోటీలలో శ్రీకాకుళం జిల్లా హ్యాండ్ బాల్ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు మంగళవారం జిల్లా కేంద్రంలో డీఈవో, తిరుమల చైతన్య, డిప్యూటీ డిఈవో విజయ కుమారి అభినందించారు. క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం రావడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.

News February 11, 2025

శ్రీకాకుళం: టెన్త్ అర్హతతో 34 ఉద్యోగాలు

image

శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 34 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. >Share it

News February 11, 2025

అరసవల్లి ఆదిత్యుని హుండీ లెక్కింపు

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు అధికారులు తెలిపారు. నగదు రూపంలో రూ.64,39,016 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ పేర్కొన్నారు. అలాగే 17.4గ్రాముల బంగారం, 1.212కేజీ వెండి వచ్చిందని వెల్లడించారు.

News February 11, 2025

శ్రీకాకుళం జిల్లాలో 75 కేంద్రాల్లో పరీక్షలు

image

ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో 75 కేంద్రాల్లో జరుగుతాయని జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి ప్రగడ దుర్గారావు మంగళవారం తెలిపారు. ఈ పరీక్షలకు 40,346 మంది హాజరు అవుతారని, పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో జరుగుతాయన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల పదవ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయని అన్నారు.

error: Content is protected !!