India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఇంద్రపుష్కరిణి అభివృద్ధి పనులకు రూ.4 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కింజరాపు అచ్చెన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 21న ఇంద్ర పుష్కరణి ఆధునీకరణ పనులకు మంత్రితో శంకుస్థాపన చేయించేందుకు ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంపుకార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఇంద్రపుష్కరిణి అభివృద్ధి పనులకు రూ.4 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కింజరాపు అచ్చెన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 21న ఇంద్ర పుష్కరణి ఆధునీకరణ పనులకు మంత్రితో శంకుస్థాపన చేయించేందుకు ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంపుకార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

➤అరసవల్లి ఇంద్రపుష్కరిణి అభివృద్ధికి రూ.4కోట్లు మంజూరు
➤శ్రీకాకుళం జిల్లాలో సుర్రుమన్న ఎండలు
➤కవిటి: కళారత్న అవార్డును అందజేసిన సీఎం చంద్రబాబు.
➤శ్రీకాకుళం: BRAU లో ఫ్యాకల్టీ సమస్య పరిష్కారం అవుతుందా ?
➤ఎచ్చెర్ల: రోడ్డుపై గోతులు.. వాహనదారులు ఇబ్బందులు
➤ఎల్.ఎన్.పేటలో ఘనంగా ఉగాది ఉత్సవాలు
➤ఉగాది వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు

రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం సంబంధించిన అధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్‌లో సమావేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వలన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులకు నష్టం జరగరాదన్నారు.

శ్రీకాకుళం రోడ్డు-ఉర్లాం రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాల పక్కన గురువారం ఓ డెడ్‌బాడీ కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు..శ్రీకాకుళం జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు పరిశీలించారు. మృతుడి వయస్సు 70 ఏళ్లు ఉంటాయని, గడుల షర్టు, పచ్చని లుంగీ ధరించి ఉన్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. వివరాలు తెలిసినవారు 94944 74582, 91103 05494 సంప్రదించాలన్నారు.

పరీక్షలు సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతానని మనస్థాపం చెంది ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలో జరిగింది. స్థానిక వెంకటేశ్వర కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు(17) ఇంటర్ పరీక్షలు రాశాడు. అయితే ఫెయిల్ అవుతానని భయపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిన్న సాయంత్రం ఏడు గంటలకు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సైబర్ మోసం ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అరసవల్లిలో నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కె.జయశంకర్, భార్య పుష్పలత ఖాతా నుంచి రూ.2.49 లక్షలు మాయమయ్యాయి. బాధితులు వివరాలు మేరకు ఈనెల 11వ తేదీ రాత్రి బ్యాంకు లావాదేవీల యాప్‌కు సంబంధించి తమ మొబైల్‌కు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్ చేయడంతో నగదు డెబిట్ అయినట్లు సందేశాలు రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

కవిటి మండలం నెలవంక పంచాయతీ పరిధిలోని ఒక గ్రామంలో ఉంటున్న ఒక మానసిక వికలాంగురాలిపై నెలవంక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు వారం రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్లిన వ్యక్తి మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు కవిటి పోలీసులు కేసు నమోదు చేశారు.

కాశీబుగ్గ రైల్వేస్టేషన్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మార్గంలో వెళ్తున్న ఓ పాసెంజర్‌ను దుండగుడు అడ్డగించి దాడి చేశాడు. అతని బ్యాగ్‌లోని తీసుకొని పారిపోయాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ప్రయాణికుడు గాయాలపాలై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. స్థానికులు 108లో సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా జరిగిన హిందీ ఎగ్జామ్‌కు 87 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రవిబాబు తెలిపారు. 28,538 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 28,452 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో ఎక్కడ ఎటువంటి కాపీ జరగలేదని ఆయన తెలియజేశారు. విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించామన్నారు.
Sorry, no posts matched your criteria.