India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల డివిజన్ స్థాయి గుర్తింపు శిబిరాలు ఈ నెల 28 నుండి 30 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కవిత తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న శ్రీకాకుళం జిల్లా పరిషత్ లోను, 29న టెక్కలి తహశీల్దార్ కార్యాలయంలోను, 30న పలాస ఎంపీడీఓ కార్యాలయంలో ఉంటుందని వివరించారు. అర్హులను గుర్తించి ఉపకరణాల పంపిణీ చేస్తామన్నారు.
టెక్కలి మండలం శ్రీరంగం గ్రామానికి చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సీహెచ్. పూర్ణారావు ఈజిప్ట్ దేశంలో తన ప్రతిభను కనబరిచారు. ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు ఈజిప్టులో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో రెండు GOLD MEDALS తో పాటు ఒక BRONZE మెడల్ సాధించి సిక్కోలు కీర్తిని చాటారు. పూర్ణారావు ప్రతిభ పట్ల పలువురు అభినందించారు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. వారికి టికెట్లు రూపేనా రూ.49,500, పూజలు, విరాళాల రూపంలో రూ.50,074, ప్రసాదాల రూపంలో రూ.96,565 స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఈవో చెప్పారు.
మందస మండలం లోహరి బంద గ్రామంలోని జీడీ తోటల్లో తాళ్ల జానకిరావు(52) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మందస ఎస్సై కె.కృష్ణప్రసాద్ ఆదివారం తెలిపారు. భార్య కమల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మద్యానికి బానిసైన జానకిరావు రోజూ తాగి వస్తుండడంతో కుటుంబ సభ్యులు అడిగారు. వారితో గొడవపడి జీడీ తోటలకు వెళ్లి ఉరివేసుకున్నట్లు ఎస్సై తెలిజేశారు.
శ్రీకాకుళంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ప్రజలనుద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఏ.వో. సూర్యనారాయణ, సెక్షన్ సూపరింటెండ్‌లు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన గురుగుబెల్లి చంద్రయ్య (47)ను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ పొలిమేరలో వద్ద హత్య చేశారు. హత్యకు గురైన చంద్రయ్య వైసీపీ కార్యకర్తగా గ్రామంలో కొనసాగుతున్నారు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడుపు నొప్పి తట్టుకోలేక కుమ్మరిపేట గ్రామానికి చెందిన కె.శ్రావణ్ కుమార్ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఎచ్చెర్ల IIITలో ఔట్సోర్సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. శనివారం పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు చేసినట్లు ఎస్ఐ జనార్దన్ తెలిపారు.
బూర్జ మండలంలోని ఓవి పేట గ్రామానికి చెందిన పేడాడ దశరథరావు (59)బ్రెయిన్ డెడ్‌తో రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో మరణించారు. అవయవదానానికి కుటుంబసభ్యులు ముందుకు రావడంతో కేసు నమోదు చేసినట్లు బూర్జ ఎస్ఐ ప్రవల్లిక తెలిపారు. మృతుడు పొలానికి వెళ్లి వస్తుండగా కోనేరు సమీపంలో కింద పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి,అధిక రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై తెలిపారు.
జలుమూరు మండలం శ్రీముఖలింగానికి చెందిన మహిళ మాధవి (25) తన ఇద్దరు కుమార్తెలతో పాటు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల వివరాల మేరకు.. విశాఖపట్నంలోని తగరపువలస ఆదర్శ నగర్‌లో నివాసముంటున్న రామకృష్ణ, మాధవి దంపతుల మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన మాధవి శనివారం కుమార్తెలకు పురుగుమందు తాగించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో మాధవి, చిన్న కుమార్తె రతిక్ష మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.