Srikakulam

News March 10, 2026

SKLM: ‘ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి’

image

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కెవి రమణ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసలో ఉన్న పోలీస్ శిక్షణకేంద్రంలో ఆర్మడు రిజర్వుడ్ పోలీసులకు 14 రోజులుపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.

News March 10, 2026

శ్రీకాకుళం: సామాన్యులపైన యుద్ధం ప్రభావం!

image

ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ప్రభావం శ్రీకాకుళం జిల్లా ప్రజలపైన పడుతుంది. ప్రభుత్వం ఒకేసారి వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.100 పెంచారు. జిల్లాలో 6,95,278 కనెక్షన్లు ఉన్నాయని జిల్లా పౌరసరపరా శాఖ జి.సూర్యప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం వంట గ్యాస్ ధర జిల్లాలో రూ.879.50, వాణిజ్య గ్యాస్ ధర రూ.939.50 ఉంది. మరోపక్క గ్యాస్ డెలివరీ సమయం 25 రోజులకు పెంచారు.

News March 10, 2026

SKLM: పశువుల అక్రమ రవాణ.. ఇద్దరిపై కేసు నమోదు

image

లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని అడ్డుకున్నామని ఎస్సై అప్పలసూరి తెలిపారు. సోమవారం పశువుల వాహనం వెళుతున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్నామని ఆయన వివరించారు. బుడుమూరు వద్ద తనిఖీ చేయగా కోటబొమ్మాళి మండలం నారాయణ వలస సంత నుంచి ఆలమండకు వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. కరగాన రాజు, కె.వెంకట్‌లపై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.

News March 10, 2026

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్తీక్ మృతి

image

ఎచ్చెర్ల ప్రధాన రహదారిలోని సర్వీస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనం <<19333513>>బోల్తా<<>> ఘటనలో అరసవిల్లి కార్తీక్ (18) గాయపడిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు మధు చరణ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా రహదారిపై మొక్కజొన్న పంట టార్పాలిన్ కప్పి ఉండడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. అతడిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.

News March 10, 2026

SKLM: ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 53 వినతులు

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదికకు 53 వినతులు వచ్చాయి. ప్రజలు సమర్పించిన అర్జీలపై చట్ట, న్యాయపరమైన అంశాలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఏఎస్‌పీ రమణ పోలీస్ అధికారులను ఆదేశించారు. భూతగాధలు, కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు.

News March 9, 2026

శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్‌కు..రైతుకు రీలిఫ్ అందెనా?

image

ఖరీఫ్ సీజన్ నాటికి సాగునీరు అందేనా? అన్న అనుమానం రైతుల్లో వ్యక్తం అవుతుంది. వంశధార కాలువలలో పూడిక, గుర్రపు డెక్క నిండిపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు పారడం లేదు. జిల్లాలో వంశధార ఎడమ కాలువ ద్వారా సుమారు 2,11,030 ఎకరాలు సాగవుతుంది. ఉపాధి హామీ నిధులతోనైనా పిల్ల కాలువలు కాలువలలోని పూడిక తీత పనులు నిర్వహించి కాలువలను ఆధునీకరిస్తే శివారు ప్రాంత రైతుల ఆశలు నెరవేర్చవచ్చు.

News March 9, 2026

జలుమూరులో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

image

జలుమూరు మండలం లింగాలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..లింగాలపాడుకు చెందిన సూర్యనారాయణ (79) సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తుండగా నరసన్నపేట వైపు వెళ్తున్న టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం వృద్ధుడు అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలను వదిలాడు. ఎస్సై అశోక్ బాబు కేసు నమోదు చేశారు.

News March 9, 2026

శ్రీకాకుళం: వైరల్.. సర్పంచ్‌గా గెలిపిస్తే ఫ్రీ WiFi అంట!

image

త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మందసకి చెందిన మోహన్ బాబు అనే వ్యక్తి ప్రకటించి హామీలు వైరల్ అవుతున్నాయి. గ్రామంలో వైఫై, సోలార్ లైటింగ్, ఆధునిక పార్కుల ఏర్పాటు వంటి ‘స్మార్ట్’ హామీలు ఇచ్చారు. అవినీతి లేని పాలన నుంచి యువతకు ఉపాధి వరకు గ్రామ బడ్జెట్‌కు మించి ఆయన ప్రకటించిన విజన్ చూసి, ఇది పల్లెటూరా లేక పారిస్ నగరా అని స్థానికులు సరదాగా చర్చించుకుంటున్నారు. ఈ మ్యానిఫెస్టోపై మీ కామెంట్?

↑