India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రైతులు 365 రోజులు సాగుకు ప్రాధాన్యత నివ్వాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనజర్ పూజారి సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం, రణస్థలం, నరసన్నపేట పరిధిలో ఉన్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎఫ్ఎంటీఎస్‌కు శ్రీకాకుళంలోని నైరాలో శనివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కూరగాయలు, ఆకుకూరలు, ఉద్యాన వన పంటల సాగుతో ఏడాది పాటు రైతులకు ఆదాయం వస్తుందని చెప్పారు.

మహిళా సాధికారితలో ఏపీలో శ్రీకాకుళం ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో గత 25 ఏళ్లుగా సుమారు 5.36 లక్షల మంది మహిళలు సంఘటితమై ఆర్థిక సామాజిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించారన్నారు. వెలుగు ద్వారా 10,458 మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగారన్నారు.

మహిళా సాధికారితలో ఏపీలో శ్రీకాకుళం ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో గత 25 ఏళ్లుగా సుమారు 5.36 లక్షల మంది మహిళలు సంఘటితమై ఆర్థిక సామాజిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించారన్నారు. వెలుగు ద్వారా 10,458 మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగారన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధమ కర్తవ్యం: ఎమ్మెల్యే శిరీష
లావేరు: ఇసుక రవాణాలో కానరాని నిబంధనలు
శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల పోలీసులు కార్డెన్ సెర్చ్
శ్రీకాకుళం: ఏయూ స్టడీ సెంటర్ కొనసాగిస్తారా ?
ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టండి: ఇచ్ఛాపురం వైసీపీ సమన్వయకర్త
జిల్లాలో పలు చోట్ల పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేత

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 463వ ర్యాంకు సాధించడం పట్ల వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాము కష్టపడి చదివి ఈరోజు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కృషి ఉంటే ఎలాంటి పరిస్థితులులోనైనా ఉన్నత స్థాయిలో రాణించవచ్చన్నారు.

పేద విద్యార్థులకు ప్రమాణాలతో విద్య అందిస్తున్న కేజీబీవీలో 6 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. డ్రాప్ అవుట్, అనాధ, సింగిల్ పేరెంట్ బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ చాటుతూ ఆల్ ఇండియా స్థాయిలో 463వ ర్యాంకు సాధించారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రామును తల్లి లక్ష్మి వ్యవసాయ పనులు చేస్తూ చదివించారు. జి.సిగడాం ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివిన ఆయన, వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం 11 నెలలు ఉద్యోగం చేసి, సివిల్స్ లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి సిద్ధమయ్యారు.

పలాస(M) గోపాలపురం సమీపంలోని పెద్ద చెరువులో అస్థిపంజరం గూడును స్థానికులు శుక్రవారం గుర్తించారు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ఎముకుల గూడును స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగి చాలా రోజులవడంతో..మృతుడి వివరాలకు ఆరా తీస్తున్నారు. ఈ దుస్తుల ఆధారంగా ఎవరైనా గుర్తిస్తే కాశీబుగ్గ పోలీసులను సంప్రదించాలని సీఐ రామకృష్ణ చెప్పారు.

హిరమండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును చూశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహారం రుచిగా ఉందా అని చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. పదార్థాలన్ని నాణ్యతగా ఉండడం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మరువాడ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి సూరాడ దాసురాజు మంత్రి అచ్చెన్న నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయనకు కలిసి వినతి పత్రం అందజేశారు. సాగర్ మాల ప్రాజెక్టు కింద మత్స్యకార గ్రామాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం, శాశ్వత తుఫాన్ రక్షిత భవనం నిర్మాణ చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.