India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తుఫాను కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లిన పంటనష్టం జరిగినా వెంటనే నివేధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై ఆర్డీఓలు, తహశీల్దార్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు.
సంతబొమ్మాళి మండలం గొల్లసీతాపురానికి చెందిన బొమ్మాళి బాలరాజు(30)అనే యువకుడు బ్రెయిన్‌డెడ్ కావడంతో మంగళవారం కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. టెక్కలి పంచాయతీ కార్యాలయం పరిధిలో కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న అతడు గత నెల 31వ తేదీన విద్యుత్ స్తంభం నుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
శ్రీకాకుళం జి ఆర్ పి పరిధి రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందినట్లు శ్రీకాకుళం జీఆర్పీ ఎస్ఐ మధు తెలిపారు. ఈ ఘటన విజయనగరం రైల్వే స్టేషన్‌కు దగ్గర్లో జరిగిందన్నారు. మృతుని వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందన్నారు. సదరు మృతి చెందిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఎస్సై నంబర్ 94934 74582కు సంప్రదించాలని కోరారు.
గార మండలం జొన్నలపాడు గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ పండా జాతీయ నంది పురస్కారానికి ఎంపికయ్యారు. కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ నంది పురస్కారానికి ఎంపికైనట్లు ఆ సంస్థ ఛైర్మన్ పాలోజు రాజ్ కుమార్ మంగళవారం తెలిపారు. డివోషనల్ సినీ జానపద గాయకుడిగా విశిష్ట సేవలందించిన దుర్గాప్రసాద్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లో జరిగిన జాబ్ మేళాలో 63 మంది వివిధ కంపెనీలలో ఎంపిక అయ్యారని ప్రిన్సిపల్ కె సూర్యచంద్రరావు తెలిపారు. మంగళవారం స్థానిక కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో భాగంగా 167 మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు. విద్యార్థినులు కూడా ఉద్యోగమేళాలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. విద్యార్థినులు 65 మంది పాల్గొనగా 32 మంది ఎంపిక అయ్యారని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడలో వరద బాధితులకు చేస్తున్న సహాయక చర్యలపై శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేశ్ NDEF, వైమానికదళాలతో కలిసి చర్చించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయడంపై పలు సూచనలు చేశారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందజేయాలని సూచించారు.
విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన కొనసాగుతోంది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో జేసీబీ సహాయంతో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడారు. తాగునీరు, ఆహారం అందుతుందా అనే వివరాలు తెలుసుకున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజలకు ధైర్యం చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన మజ్జి శివ పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ఇటీవల మృతిచెందాడు. అతని మృతదేహం కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. పోలీసు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దుబాయ్ కోర్టు తగిన నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో ఇక్కడ శివ బంధువులు చివరి చూపు కోసం ఎదురుచూస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సిలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. గత నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా 29న సీట్లను కేటాయించారు. సీటు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు మంగళవారంతో గడువు ముగుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 149 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
దుబ్బు దశలో ఉన్న వరి పైరు ఇటీవలే కురిసిన వర్షాలకు నీట మునిగింది. ఈక్రమంలో పంటకు రైతులు బూస్టర్ ఎరువులు వేయాలని శ్రీకాకుళం మండలం రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి.ఉదయ బాబు ఒక ప్రకటనలో సూచించారు. ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలని శాస్త్రవేత్త భాగ్యలక్ష్మి చెప్పారు. ఎటువంటి సందేహాలు ఉన్నా రైతులు తమను సంప్రదించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.