Srikakulam

News July 26, 2024

శ్రీకాకుళం కలెక్టర్‌ను కలిసిన నూతన జేసీ

image

సిక్కోలు జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం బదిలీపై జిల్లాకు చేరుకున్నారు. అన్నమయ్య జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై వచ్చారు. ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలెక్టర్ బంగ్లాలో గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆయన శుక్రవారం ఉదయం 10.00 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

News July 25, 2024

శ్రీకాకుళం: మత్స్యకారులకు సీఆర్ జెడ్ అమలు చేయాలి

image

మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా సీఆర్ జెడ్ అమలు చేయాలని జిల్లాలోని తీరప్రాంత ప్రజలు కోరారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శ్రీకాకుళం జిల్లా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఖరారు నిమిత్తం గురువారం సమావేశం నిర్వహించారు. సీఆర్ జెడ్ నోటిఫికేషన్ విడుదలపై తీర ప్రాంత ప్రజలు, అధికారులతో ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు.

News July 25, 2024

శ్రీకాకుళం: మంత్రి అచ్చెన్నాయుడిపై 12 కేసులు

image

గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గురువారం శ్వేతపత్రం విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత ఎమ్మెల్యేలపై వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద 15 కేసులు పెట్టి 1సారి అరెస్టు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మీద 12 కేసులు పెట్టి 2 సార్లు అరెస్టు చేశారు.

News July 25, 2024

నరసన్నపేట: లైంగిక వేధింపుల ఫిర్యాదుపై విచారణ

image

నరసన్నపేట మండలం ఉర్లాం ఉన్నత పాఠశాలలో ప్లస్-2 చదువుతున్న విద్యార్థినులు తమపై ఓ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆ ఉపాధ్యాయుడికి మరో ఇద్దరు ఉపాధ్యాయులు సహకరిస్తున్నారని తెలిపారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు టెక్కలి ఉప విద్యాశాఖ అధికారి విలియమ్స్, జీసీడీఓ నీరజ పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు.

News July 25, 2024

శ్రీకాకుళం: యథేచ్ఛగా పశువుల రవాణా.. చేతులు మారుతున్న కోట్లు

image

ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మూగ జీవాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు వారాంతపు సంతలో మాత్రమే పశువుల క్రయ విక్రయాలు జరిగేవి. నేడు ప్రతి రోజూ దళారులు జీవాలను కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పశు రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

News July 25, 2024

శ్రీకాకుళం: నెమ్మదిగా సాగుతున్న డిగ్రీ అడ్మిషన్లు

image

శ్రీకాకుళం జిల్లాలో డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ గడువు ముగిసినా ఆశించిన మేర అడ్మిషన్లు రాకపోవడంతో అధికారులు 25 వరకు గడవు పెంచారు. అంబేడ్కర్ యునివర్సిటీ పరిధిలో 74 ప్రైవేట్, 15 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 50 వేలకు పైగా సీట్లు ఉండగా ప్రస్తుతం 21 వేల మంది మాత్రమే చేరారు. ప్రభుత్వం 70 శాతం సీట్లకు మాత్రమే ఉపకార వేతనాలు చెల్లిస్తుండటడం ఇందుకు కారణమని పలువురు వాపోతున్నారు.

News July 24, 2024

శ్రీకాకుళంలో ఈ నెల 26న జాబ్ మేళా

image

జిల్లాలో బలగ జంక్షన్‌లోని ప్రభుత్వ DLTC ఐటీఐ కళాశాలలో ఈ నెల 26వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ pvt ltd, 2050 హెల్త్ కేర్ కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ (డీజిల్, మోటర్ మెకానిక్), జిడిఏ, MPHW, ANM & GNM గల 18 నుంచి 40 సంవత్సరాల వారు అర్హులన్నారు.

News July 24, 2024

MLAకు అయ్యన్న సూచన.. నవ్విన పవన్ కళ్యాణ్

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ అయ్యన్న నవ్వులు పూయించారు. రోడ్ల గురించి ప్రశ్నించేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌కు స్పీకర్ అయ్యన్న అవకాశం ఇచ్చారు. ఆయన పార్టీ పెద్దలకు, మంత్రులకు, నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెబుతుండగా.. స్పీకర్ అయ్యన్న కలగజేసుకొని రోడ్ల గురించి మాట్లాడాలని సూచించారు. దీంతో ముందు వరుసులో కూర్చున్న పవన్ కళ్యాణ్‌తోపాటు సభ్యులు ఒక్కసారిగా నవ్వారు.

News July 24, 2024

‘శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న పాముకాట్లు’

image

శ్రీకాకుళం జిల్లాలో పాము కాటు కేసులు రోజురోజుకీ అధికం అవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు పరిశీలిస్తే జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,023 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో గత మూడు నెలల్లో 100 పైగా పాముకాటు కేసులు నమోదు కాగా శరీరంపై ఉన్న కాట్లను బట్టి పాము కరిచినట్లు నిర్దారించిన కేసులు 62 నమోదు అయినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.

News July 24, 2024

శ్రీకాకుళం: హెడ్ కానిస్టేబుల్ మృతి

image

జలుమూరు మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఉమామహేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవల స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై మధుసూదనరావు తెలియజేశారు. ఉమామహేశ్వరరావుకు నరసన్నపేట సీఐ ప్రసాదరావు, ఎస్సై అశోక్ బాబు సంతాపం తెలిపారు.