Srikakulam

News February 28, 2026

‘తాగునీటిలో ‘ఈ-కోలి’.. అందుకే డయేరియా’

image

శ్రీకాకుళం నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇదే అతిసార వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండియన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

News February 27, 2026

విశాఖ-పలాస మార్గంలో పలు రైళ్లు రద్దు

image

విశాఖ-పలాస-బరంపురం మార్గంలో మార్చి 2వ తేదీన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. విశాఖ-బరంపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-పలాస మెమూ ప్యాసింజర్ (67289/67290) రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ వెల్లడించారు. సిగడాం, పొందూరు, దూసి పరిధిలో భద్రత పరమైన పనుల నిమిత్తం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 27, 2026

డయేరియా ప్రాంతంలో రాష్ట్ర వైద్యఆరోగ్య కమిషనర్ పర్యటన

image

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ శుక్రవారం పర్యటించారు. దమ్మలవీధిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వ్యాధికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తగిన సమయంలో వైద్యం అందించారా లేదా అని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనితను ప్రశ్నించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫార్మాన్ ఖాన్ ఉన్నారు.

News February 27, 2026

SKLM: ‘డయేరియా బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం’

image

డయేరియా వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైనా ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవను పొందవచ్చని శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యశ్రీ డైరెక్టర్ డాక్టర్ పీస అవని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్ క్లినిక్‌లకు వెళ్లిన వారు తమను సంప్రదిస్తే ఉచితంగా వైద్యం అందించటం జరుగుతుందన్నారు. రిమ్స్, జేమ్స్, మెడికవర్, కిమ్స్, సింధూర ఏవన్ ఆసుపత్రులకు పంపించి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

News February 27, 2026

SKLM: ఇంటర్ పరీక్షలకు 289 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు శుక్రవారం 289 మంది గైర్హాజరయ్యారు. హిస్టరీ బాటనీ ఒకేషనల్ కోర్సుల్లో 60 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. రెగ్యులర్ కోర్సులకు 1,538 మంది హాజరు కావాల్సి ఉండగా, 1,372 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,500 మంది రాయాల్సి ఉండగా, 1,377 మంది విద్యార్థులు రాశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదు.

News February 27, 2026

ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారి కళ్యాణం జరిగింది. పాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

News February 27, 2026

శ్రీకాకుళంలో అదుపులోకి వస్తున్న డయేరియా

image

శ్రీకాకుళం నగరంలోని ఐదు సచివాలయాల పరిధిలో ఈనెల 23న మొదలైన డయేరియా అదుపులోకి వస్తోంది. గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 102కు చేరగా, ప్రస్తుతం 67 మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

News February 27, 2026

శ్రీకాకుళం: డయేరియాపై కేంద్ర మంత్రి సీరియస్

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తాగునీరు, మురికి కాలువల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News February 27, 2026

SKLM: డయేరియా ప్రాంతంలో కఠిన నిబంధనలు

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ గురువారం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. మంగువారితోట దమ్మలవీధి కాకివీధి మేదరివీధి ప్రాంతాల్లో డయేరియా అదుపులోకి వచ్చినంత వరకు మాంసం విక్రయాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 27, 2026

శ్రీకాకుళం: డయేరియాపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తాగునీరు, మురికి కాలువల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

↑