Srikakulam

News July 20, 2024

పలాస: మేడ పైనుంచి జారిపడి ఆర్ఎంపీ వైద్యుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి సాయి కాలనీ నివాసముంటున్న ఆర్ఎంపీ డాక్టర్ కుందు శ్రీను(47) శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మేడ పైనుంచి కాలుజారి కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేశారు. కుందు శ్రీనుకు భార్యతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

News July 20, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించినట్లు డీఈవో వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. మరో సెలవు రోజున పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

News July 19, 2024

SKLM: మత్స్యకార వేటనిషేధ పరిహార భృతికి 12,952 మంది ఎంపిక

image

వేటనిషేధ కాలంలో పరిహార భృతి అందించే ప్రక్రియలో అర్హులను సర్వే ద్వారా గుర్తించి, ఆ జాబితాను నవశకం పోర్టల్లో పొందుపరిచామని జిల్లా మత్స్యకార అధికారి పి.వి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది మేలో 15,375 మందిని గుర్తించి అందులో 12,952 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. రీవెరిఫికేషన్‌లో ఇంకా అర్హులుంటే వారిని కూడా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయన్నారు.

News July 19, 2024

శ్రీకాకుళం: B.Tech 4, 6 సెమిస్టర్ల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Tech కోర్సులకు సంబంధించి 4, 6 సెమిస్టర్ల పరీక్షల నోటిఫికేషన్ విడుదలయింది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కార్యాలయం నుంచి అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోగా పరీక్ష ఫీజు రూ.800, ప్రాక్టికల్ ఫీజు రూ.250 యూనివర్సిటీకి చెల్లించాలి. 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 31న, 6వ సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానున్నాయి.

News July 19, 2024

శ్రీకాకుళంలో జాబ్ మేళా.. 53 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూ నిర్వహించగా.. నిరుద్యోగ యువత 290 మంది హాజరయ్యారు. ఇందులో 53 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధా తెలిపారు.

News July 19, 2024

పొందూరు ఖద్దరు పై వీడియో పోటీలు

image

గాంధీని ప్రభావితం చేసిన పొందూరు ఖద్దరు తయారీ పై ప్రభుత్వం వీడియో చిత్రీకరణ పోటీలను నిర్వహిస్తుందని రాష్ట్ర చేనేత, జౌలి శాఖ తెలిపింది. భారతీయ చరిత్రలో చేనేత ప్రాధాన్యతను గుర్తించి ఆగస్టు7వ తేదీన నిర్వహిస్తున్న జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పోటీల్లో పాల్గొనేవారు తాము రూపొందించిన వీడియోను రాష్ట్ర చేనేత కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీ లోపు సమర్పించాలన్నారు.

News July 19, 2024

సెంచరీలతో అదరగొడుతున్న సిక్కోలు క్రికెటర్

image

సిక్కోలుకు చెందిన యువ క్రికెటర్ సుశాంత్ అద్భుతంగా రాణిస్తున్నారు. కడప జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న పోటీల్లో రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో 121, రెండో మ్యాచ్‌లో 107 పరుగులతో వరుసగా సెంచరీలు కొట్టారు. మూడో రోజు కృష్ణా జిల్లాపై 68 పరుగులతో సత్తా చాటారు. పరుగుల వరద పారిస్తున్న సుశాంత్‌ భవిష్యత్తులో ఇండియా టీమ్‌కు ఎంపిక కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

News July 19, 2024

శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్(08942-240557 నంబరు) ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

News July 19, 2024

శ్రీకాకుళంలో నేడు జాబ్ మేళా

image

శ్రీకాకుళం నగరంలోని బలగ జంక్షన్ వద్ద స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలకు 18-35 ఏళ్లలోపు యువతీయువకులు అర్హులన్నారు. అలాగే పదోతరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 19, 2024

శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ ఏర్పాటు

image

3 రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం వెల్లడించారు. వాతావరణ శాఖ (ఐఎండీ) జిల్లాలో మరింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిందన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 08942-240557 (డిజాస్టర్ మేనేజ్ మెంట్) డీపీఎం ఫోన్ నంబర్ 7794082017ఏర్పాటు చేసినట్లు తెలిపారు.