India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో న్యూఇయర్ రోజున రూ.5.46 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కాగా మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 6,984 కేసులు ఐఎంఎల్(వైన్) విక్రయాలు జరిగాయి. 2621 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే విక్రయాలు పెరిగాయి. నాడు 5,597 కేసుల ఐఎంఎల్ మద్యం, 2,329 కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా రూ.5,12,21,367 ఆదాయం వచ్చింది.
సోంపేట మండల కేంద్రంలోని స్థానిక బీఎస్ కాలనీ వద్ద మంగళవారం రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఉమా బెహరా మందు గుండు సామగ్రి కాలుస్తుండగా ప్రమాదం జరిగింది. చేతిలో బాంబు పేలిపోవడంతో అతని కుడి అరచేయి నుజ్జు నుజ్జు అయింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికత్స కోసం అతణ్ని బుధవారం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
పొందూరు మండలం కనిమెట్టలోని శివాలయం ముఖద్వారం వద్ద ఉన్న రెండు సింహం విగ్రహాలను మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బుధవారం ఆలయానికి వచ్చిన పూజారి దీనిని గుర్తించారు. మండలంలోనే ఈ ఆలయం పురాతనమైంది. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా? లేదా అర్ధరాత్రి మందుబాబులు మద్యం మత్తులో చేసిన పనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అరసవల్లి రథసప్తమి మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భక్తుల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 10 గంటలకు భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షత వహించనున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. జిల్లాలో ఒక్క రోజు సుమారు రూ.5.5 కోట్ల అమ్మకాలు చేపట్టినట్లు Excise అధికారులు బుధవారం తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా మందుబాబులు మద్యం కోట్లలో కొనుగోలు చేశారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రావడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగినట్లు పలువురు అంచనా వేస్తున్నారు.
స్టైపెండరీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్‌లో భాగంగా అభ్యర్థులు ఎవరూ దళారులు, పోలీసు ఉద్యోగులు ఇప్పిస్తామంటూ చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నోటిఫికేషన్ నిబంధనలు అనుసరించి జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ద్వారా శారీరక దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామన్నారు.
అరసవల్లి రథసప్తమి మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భక్తుల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 10 గంటలకు భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షత వహించనున్నారు.
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును ఈనెల 7 వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. డిసెంబర్ 31తో గడువు ముగియడంతో ప్రభుత్వం మరొక వారం రోజులు పొడిగించింది. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి స్వీకరించిన వివరాలను 11 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారన్నారు.
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఖాళీగా ఉన్న 106 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం నుంచి బుధవారం వివరాలు వెల్లడించారు. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ, బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా రీజనల్ డైరెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, బియ్యం గింజ సైజులో ‘వెల్కమ్ 2025 బంగారపు లోగో’ను తయారుచేశారు. పలాస-కాశీబుగ్గ గాంధీనగర్‌కు చెందిన ప్రముఖ సూక్ష్మశిల్పి, స్వర్ణరత్న బ్రహ్మర్షి కొత్తపల్లి రమేష్ ఆచారి. కేవలం 0.30 మిల్లీ గ్రాముల బంగారాన్ని ఉపయోగించి, కేవలం అర సెంటీమీటర్ ఎత్తు, అర సెంటీమీటర్ వెడల్పు ఈ లోగో తయారు చేశారు. సుమారు ఐదు గంటల సమయం పట్టినట్లుగా రమేష్ మంగళవారం తెలిపారు.
Sorry, no posts matched your criteria.