Srikakulam

News December 30, 2024

SKLM: దళారీల మాట నమ్మి మోసపోవద్దు: ఎస్పీ

image

కానిస్టేబుల్ శారీరక దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించబడతాయని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. రిక్రూట్మెంట్‌కు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారీలు మాటలు నమ్మవద్దని చెప్పారు. అట్టి వివరాలు 6309990800, 6309990911 ఫోన్ నంబర్లకు తెలపాలని జిల్లా ఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వెల్లడించారు.

News December 29, 2024

SKLM: కానిస్టేబుల్ అభ్యర్థులు .. ఇవి తప్పనిసరి

image

రేపటి నుంచి కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు తమతో పాటుగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆటాచ్డ్ జిరాక్స్ ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలన్నారు. కాల్ లెటర్ తెలిపిన స్కోరు కార్డ్ (ఒరిజినల్ రిసల్ట్), స్టేజ్-1 అప్లికేషన్, స్టేజ్-II అప్లికేషన్‌లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకురాని వారి అభ్యర్థిత్వం తిరస్కరిస్తారు.

News December 29, 2024

ఆడంబరాలు వద్దు.. సేవా కార్యక్రమాలు చేద్దాం: ఎమ్మెల్యే శిరీష

image

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని తాను నిశ్చయించుకున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సేవా కార్యక్రమాలకే తాను ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పూలబొకేలు, మిఠాయిలు, శాలువలతో సత్కారాలు చేయవద్దని కోరారు. ఆ నగదును పేద విద్యార్థులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని ఆమె పేర్కొన్నారు.

News December 29, 2024

SKLM: కోనేరు హంపికి మంత్రి అచ్చెన్న అభినందనలు

image

ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఘన విజయం సాధించిన కోనేరు హంపిని మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కార్యలయం ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. కోనేరు హంపి గెలుపు దేశానికి గర్వకారణమన్నారు. రెండోసారి ప్రపంచ టైటిల్‌ను సాధించిన ఆమె ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. మహిళలు హంపిను ఆదర్శంగా తీసుకోని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

News December 29, 2024

దక్షిణ భారతదేశంలోనే శ్రీకాకుళం జిల్లా భామిని టాప్

image

భామిని మండలం ఆస్పిరేషనల్ బ్లాక్ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని శనివారం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. నీతి ఆయోగ్ ప్రతి త్రైమాసికంలో సూచికల సాధనను విశ్లేషిస్తుంది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన బ్లాకులను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలోనే భామిని ఆస్పిరేషనల్ బ్లాక్ అగ్రస్థానంలో నిలవడంతో ప్రోత్సాహకంగా రూ.1.50 కోట్లు పొందిందని కలెక్టర్  తెలిపారు. 

News December 28, 2024

శ్రీకాకుళం: నితీష్‌ను అభినందించిన మంత్రి అచ్చెన్న

image

భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అరుదైన రికార్డును అతి చిన్న వయసులో కైవసం చేసుకున్న విశాఖ‌కు చెందిన నితీష్ నేటి యువ క్రీడాకారులకు ఆదర్శమని మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు కొనియాడారు. నితీష్ కుమార్ ప్రతిభకు, ఒత్తిడిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మనో ధైర్యానికి నిదర్శనమన్నారు. సోషల్ మీడియా వేదికగా ద్వారా శనివారం నితిష్‌ను అభినందించారు.

News December 28, 2024

SKLM: జనవరి 1 వేడుకలు .. ఎస్పీ కీలక సూచనలు

image

ఈ నెల 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి జిల్లా ప్రజలకు ఎస్పీ మహేశ్వర రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి బహిరంగ ప్రదేశాలలో రహదారులపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించరాదన్నారు. 31వ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ప్రజలు ఎవరూ రహదారులపై తిరగరాదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ బృందాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News December 28, 2024

SKLM: జనవరి 3న జడ్పీ స్థాయి సంఘ సమావేశం

image

జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు జనవరి 3న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి. శ్రీధర్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు కార్యలయం నుంచి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు 6వ స్థాయి, 11.30 గంటలకు 3వ స్థాయి, మధ్యాహ్నం 12.30 గంటలకు 5వ స్థాయి సంఘం సమావేశం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 2, 4, 1, 7 స్థాయి సంఘాల సమావేశాలు జరగనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.

News December 28, 2024

రైతు కుటుంబం ఆత్మహత్యపై అచ్చెన్న ఆరా

image

కడప జిల్లాలో ఒక రైతు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం ఆరా తీశారు. రైతు కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. రైతు కుటుంబం మృతికి గల కారణాలు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News December 28, 2024

శ్రీకాకుళం: విద్యుత్ ధర్నాకు గైర్హాజరైన వైసీపీ ముఖ్య నేతలు

image

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ చేపట్టిన పోరుబాటకు ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌ల నాయకత్వంలో ధర్నాలు చేపట్టారు. కాగా.. జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమానికి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ ముఖం చాటేశారు. పలువురు నేతలు కూడా గైర్హాజరయ్యారు.

error: Content is protected !!