India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌పై విచారణకు గురువారం ఏపీ సీఐడీ అధికారులు ఆదేశించారు. ‘ఆడుదాం-ఆంధ్రా’, సీఎం కప్ కార్యక్రమం పేరిట అవినీతికి పాల్పడ్డారు అనే ఫిర్యాదు మేరకు విజయవాడ సీపీకి సీఐడీ ఏడీపీ సూచించారు. మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆర్‌కె రోజాలను విచారణ చేయాలని ఆదేశించారు. ధర్మాన కృష్ణదాస్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.
స్వాతంత్ర్య సమరయోధుడు డా.సర్దార్ గౌతు లచ్చన్న ఆగస్టు 16, 1909లో సోంపేట మండలం బారువ గ్రామంలో జన్మించారు. 21 ఏళ్ల వయసులో పలాసలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యారు. పలుమార్లు జైలుకు వెళ్లారు. బ్రిటీష్ రాజులపై పోరాటాలు చేసినందుకు ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చింది. 1948-83 కాలంలో 35 ఏళ్లు సోంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. 2001లో “నా జీవితం” అనే ఆటోబయోగ్రఫీ రచించారు.
ఆమదాలవలస మండలం దివాంజీపేట వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన పేడాడ రాము(37) కొత్తూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్టీల్ పాంట్‌లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస ప్రభుత్వ ఆసుపత్రి సమీపం రాధాకృష్ణ పురం వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన పేడాడ రాము (37) కొత్తూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.స్టీల్ పాంట్‌లో విధులు నిర్వహిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఈ నెల 17 వ తేదీ శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కె.ఎల్ గ్రూప్ (అమెజాన్ వేర్ హౌస్) కంపెని పాల్గొంటుందని వెల్లడించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తయ్యి 18 నుంచి 35 సంవత్సరాల అర్హత కలిగిన స్త్రీ/పురుషులు అర్హులని తెలిపారు. 200 పోస్టులను భర్తీ చేయనున్నారని వివరించారు.
సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామానికి చెందిన ఆర్మీ మేజర్ మల్లా రాంగోపాల్ ప్రతిష్ఠాత్మకమైన ఆర్మీ కీర్తిచక్ర అవార్డుకు ఎంపికయ్యారు. మరాఠా లైట్ ఇన్ ఫ్రాంటరీ 56వ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్ మేజర్ గా ఉన్న రాంగోపాల్ గత ఏడాది జమ్మూకాశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించి తన సైన్యంతో దాడి చేసి ఉగ్రవాదులను హతమార్చడంలో ప్రత్యేక పాత్ర పోషించినందుకు గాను కీర్తిచక్ర అవార్డుకు ఆర్మీ అధికారులు ఎంపిక చేశారు.
టెక్కలి మండలం స్థానిక మెట్ట వీధికి చెందిన సింహాద్రి రాజు అనే యువకుడు స్వాతంత్‌ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహాన్ని సుద్ధ మొక్క పై చెక్కి తన దేశభక్తిని చాటుకున్నాడు. సుద్ధ ముక్కపై గాంధీజీ విగ్రహం చెక్కటానికి 6 గంటల సమయం పట్టిందని యువకుడు తెలిపాడు. రాజు కార్పెంటర్ పని చేస్తూ జీవనోపాధి సాగిస్తూ ఇలా సుద్ద ముక్క పై విగ్రహాలు చెక్కుతూ తన ప్రతిభను కనబరుస్తుంటాడు. దీంతో పలువురు అభినందిస్తున్నారు.
స్వాతంత్ర్య సమరంలో సిక్కోలు జిల్లా యోధుల కృషి మరువలేనిది. వారిలో పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన అన్నెపు అప్పయ్య ఒకరు. క్విట్ ఇండియా ఉద్యమం సహా ఎన్నో స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొన్నందుకు ఆయన కృషి చేశారు. బొడ్డేపల్లి నారాయణ, నంద ఆదినారాయణ, గురుగుబెల్లి సత్యనారాయణ, నంద కృష్ణమూర్తి, బొడ్డేపల్లి రాములు, కూన యర్రయ్య, కూన బుచ్చి తదితరులున్నారు.
శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్లో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎంతోమంది మహనీయులు త్యాగాలు ఫలితమే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నల్ దినకర్, ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగాయి. ముందుగా పోలీసు గౌరవ వందనాన్ని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచి పెట్టారు.
Sorry, no posts matched your criteria.