India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1,2 డిపో మేనేజర్లు అమర సింహుడు, శర్మ పాల్గొన్నారు. అనంతరం ప్రయాణీకులతో పాటు ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతి బక్కరూ పాటించాలని, నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
టెక్కలి ఆధి ఆంధ్రావీధి జాతీయ రహదారిపై ఉన్న ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ప్రాజెక్టు సిబ్బంది చూసి RWS అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం కోర్టు భవన్‌లో శుక్రవారం న్యాయవాదులు, పోలీసులతో మాట్లాడారు. రాజీ మార్గం ద్వారా పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ అవకాశాన్ని ముద్దాయిలు వినియోగించుకోవాలని కోరారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతి గడించారన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ వెంకటేశ్వరరావు, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మూడవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ డీన్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలను విద్యార్థులు జ్ఞానభూమి వెబ్సైట్లో తెలుసుకోవచ్చని సూచించారు. రీవాల్యుయేషన్‌కు రేపటి నుంచి విద్యార్థులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
గుండెపోటు వచ్చే సమయాల్లో మొదటి గంట కీలకమని జిల్లా DCHS డాక్టర్ కళ్యాణ్ బాబు తెలిపారు. గోల్డెన్ అవర్‌లో రోగికి ఇచ్చే టెనెక్టివ్ ప్లస్ ఇంజెక్షన్ జిల్లాలో 15 చోట్ల అందుబాటులో ఉందన్నారు. రూ.45వేల విలువైన ఈ ఇంజెక్షన్ ఫ్రీగా అందించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రితో పాటు టెక్కలి, నరసన్నపేట, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, బారువ, మందస, కవిటి, హరిపురం, కోటబొమ్మాళి, పాతపట్నం, బుడితి, రణస్థలం, ఆమదాలవలసలలో ఉంది.
నేటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.కె.రాజగోపాలరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధి లక్షణాలతో కోళ్లు మృతి చెందలేదని అన్నారు. జిల్లాలోని ప్రతి కోళ్ల ఫారంలు తనిఖీ చేయడానికి 68 రాపిడ్ యాక్షన్ టీమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. కోళ్ల పెంపకందారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
లారీ ఢీకొని బాలిక మృతి చెందిన ఘటన HYDలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పాతపట్నంకు చెందిన శ్రీనివాస్ HYDకు వలస వచ్చి చైతన్య బస్తీలో ఉంటున్నారు. వారి కుమార్తె మమత(17). ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండేది. మంగళవారం రాత్రి స్నేహితుడితో కలిసి మూసాపేట్ Y జంక్షన్ వద్దకు రాగానే స్కూటీని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసలో ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీ వాసుదేవుని పెరుమాళ్ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆలయ ప్రధాన అర్చకులతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో మందస గ్రామ పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు.
యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో కానీ ఒకే రోజు వీరి వివాహం జరిగింది. మరణం కూడా ఒకేరోజు గంటల వ్యవధిలో సంభవించింది. ఒకేరోజు అనారోగ్యంతో బావ, బామ్మర్ది మృతి చెందిన విషాదకర సంఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. సార సోమేశ్వరరావు (58) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా, మరోవైపు కొర్రాయి నారాయణరావు (58) కూడా సోమేశ్వరరావు మృతి చెందిన కొన్ని గంటల్లోనే అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు.
Sorry, no posts matched your criteria.