India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో రెండు రోజుల క్రితం మహిళ మెడలో బంగారం గొలుసులు దొంగతనం చేసిన విషయం విదితమే. కాగా గురువారం చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తి ఫొటో సోషల్ మీడియాలో వైరలైంది. మహిళల మెడలో బంగారు గొలుసులు చోరీ చేసే క్రమంలో ఒక మహిళా ఉపాధ్యాయురాలిపై కూడా దాడి చేసిన ఘటన సిక్కోలులో కలకలం రేపింది. దుండగులు మహిళను మాటల్లో పెట్టి ఈ చోరీకి పాల్పడ్డాడు.
శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది 3,59,495 ఎకరాల్లో వరి పంట సాగైంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా జిల్లావ్యాప్తంగా 403 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 2.15 మెట్రిక్ టన్నులను సేకరించారు. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షం ప్రభావంతో ధాన్యం కొనుగోలు మందగించినట్లు తెలుస్తోంది.
ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తిస్తూ గురువారం జీవో విడుదల చేసింది. ఈ మేరకు MLA గొండు శంకర్ విశాఖ-ఎ కాలనీలోని తన కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతీ ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యదేవుని పుట్టినరోజు సందర్భంగా రథసప్తమి వేడుకలు నిర్వహిస్తుంటామని తెలిపారు.
ఈ నెల 20వ తేదీన శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ డైరెక్టర్ కె.కవిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె వెల్లడించారు.
ఆమదాలవలసలో గాజులకొల్లివలస RR కాలనీకి చెందిన దామోదర పద్మ(35) ఆదివారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు బుధవారం సాయంత్రం ఆమదాలవలస సీఐ కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద మీడియా సమావేశంలో తెలిపారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
రాజాం పరిధిలోని పాలకొండ రోడ్డులో పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా గురువారం నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొనుగుట్టువలస, అంబేద్కర్ కాలనీ, విద్యానగర్, వరలక్ష్మి నగర్, మారుతి నగర్ ప్రాంతాలలో నీటిసరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
అరసవిల్లికి చెందిన ప్రసాదరావు అనే వ్యక్తి తన బ్యాంకు అకౌంట్లో దాచుకున్న సుమారు రూ.15 లక్షలను పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయించారు. అయితే ఆ నగదు సాంకేతిక లోపంవల్ల ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలోకి జమ అయ్యాయి. కాగా పోస్టల్ సిబ్బంది అంబుడ్సమన్ ద్వారా ఆ నగదును తిరిగి కస్టమర్ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యేలా చేశారు. దీంతో పోస్ట్ మాస్టర్ రంగారావుకి కస్టమర్ సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
రామ్మోహన్ నాయుడు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందారు. బుల్లెట్ లాంటి మాటలు, సబ్జెక్ట్‌పై పట్టు, క్రమ శిక్షణతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 26ఏళ్లకే పార్లమెంట్‌కు ఎన్నికై అనతి కాలంలోనే తన మార్క్ చూపించారు. పార్లమెంట్లో అనర్గళంగా మాట్లాడుతూ ఎంతో మంది ప్రశంసలు పొందారు. గత ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం అందుకున్న ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. చిన్న వయసులో ఆ పదవి పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కోటబొమ్మాలి నుంచి టెక్కలి వైపు స్కూటీపై మహిళ వెళ్తుండగా పాకివలస వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కలి వైపు నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, పక్క రోడ్డులో వెళ్తున్న మహిళను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి 23 వరకు నిర్వహించనున్న డిపార్ట్మెంట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇన్ఛార్జ్ DRO అప్పారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలు రాసేందుకు 1831 మంది అర్హత పొంది ఉన్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాల, వెంకటేశ్వర ఇంజినీరింగ్, నరసన్నపేటలో కోర్ టెక్నాలజీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.