India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చలితీవ్రత అధికమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతాల్లో అలజడి మొదలవగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
నేటి నుంచి నాలుగు రోజుల వరకు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపిందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో వర్షంతో ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు ప్రతి మండలంలో 100 టార్పాలిన్లు మండల తహసీల్దార్ స్వాధీనంలో ఉంచామన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా పోలీసులపై ఈ నెల 12వ తేదీ రాత్రి రాజమండ్రిలో కొంత మంది వ్యక్తులు దాడి చేసి ఒక కేసులో ముద్దాయి రాపాక ప్రభాకర్(ప్రతాప్ రెడ్డి)ని తీసుకువెళ్లిన ఘటన తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై దాడికి పాల్పడిన భీమవరం, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన 12 మందిని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు.
రాజాం మండలం <<14900613>>గెడ్డవలస<<>>లోని గ్రామస్థులు విషజ్వరాల బారిన పడ్డారని Way2News లో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎంపీడీఓ శ్రీనివాసరావు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం వైద్యులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలువురిని పరీక్షించారు. ఎంపీడీఓ గ్రామంలో పర్యటించి జ్వర పీడితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇవి అదుపులోకి వచ్చేంత వరకు శిబిరం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
టెక్కలి మండలం స్థానిక ఎన్టీఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న పైల గణేశ్ ఇటీవల విడుదలైన CRPF, SSC GD, INDIAN NAVY SSR ఫలితాల్లో విజేతగా నిలిచి మూడు ఉద్యోగాలు సాధించాడు. తండ్రి పైల రాము ఒక సాధారణ తాపీ మేస్త్రి. చిన్నప్పటి నుంచి కష్టాలు తెలిసిన గణేశ్ సరైన ప్రణాళికతో ప్రభుత్వ ఉద్యోగం పొంది పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు, బందువులు గణేశ్‌ను అభినందించారు.
పలాస TDP నేత హత్యకు బిహార్ గ్యాంగ్ స్కెచ్ వేసిందనే వార్త శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. టెక్కలిలో అనుమానాస్పదంగా కనిపించిన బిహార్‌కు చెందిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరు పలాస టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజుని చంపేందుకు స్కెచ్ వేసినట్లు పలు పత్రికలు పేర్కొన్నాయి. దీనిపై మంత్రి అచ్చెన్న, MLA గౌతు శిరీష సీరియస్ అయ్యారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు.
పలాసలో టీడీపీ నేతను హత్య చేసేందుకు బీహర్ ముఠా వేసిన పన్నాగంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా హత్య రాజకీయాలకు ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. దీని వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా శిక్షించాలన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉప-వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ సోమవారం జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఈనెల16 నుంచి 19 వరకు వరుసగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సోమవారం జరిగిన సమావేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో పాల్గొన్నారు.
టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు దువ్వాడకు 41ఏ నోటీసులు జారీచేసిన విషయం విదితమే. నోటీసులపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని దువ్వాడ అన్నారు. రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని అన్నారు. అధికారంలో ఉన్నపుడు తాను అవినీతి చేయలేదన్నారు.
టీబీ ముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో లోక్‌సభ XI- రాజ్యసభ XI టీమ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనడం గర్వంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. టీబీ వ్యాధిని 2025 నాటికి నిర్మూలించాలని ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమాన్ని చేపట్టామని టీబీపై అవగాహన ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.