Srikakulam

News August 5, 2024

వజ్రపుకొత్తూరు: అర్ధరాత్రి పిడుగులు

image

వజ్రపుకొత్తూరు మండలంలోని వంకులూరు, మెట్టూరు, తదితర గ్రామాల్లో పిడుగుపాటుతో పాటు భారీ వర్షాలు కురిశాయి. అర్ధరాత్రి అనుకోకుండా వర్షం మొదలైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సోమవారం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News August 5, 2024

శ్రీకాకుళం: జీతాలు అందక ఒప్పంద అధ్యాపకుల అవస్థలు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 45 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వాటిల్లో 370 మంది ఒప్పంద అధ్యాపకులు సేవలందిస్తున్నారు. వీరి సేవలను పునరుద్ధరించని కారణంగా మే నెల నుంచి జీతాలు చెల్లింపులు జరగలేదు. సకాలంలో జీతాలు అందక ఇబ్బందిగా ఉంటోందని, కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. మే నెలలో వేసవి సెలవులు అయినప్పటికీ ఎన్నికల విధులు, పరీక్షలు తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించామన్నారు.

News August 5, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేడు వర్షాలకు ఛాన్స్

image

శ్రీకాకుళం జిల్లా పరిధిలో సోమవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ‘X’ ఖాతాలో పోస్ట్ చేశారు. జిల్లాకు పొరుగున ఉన్న మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాలలో సైతం అక్కడక్కడ వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.

News August 4, 2024

శ్రీకాకుళం జిల్లాకు రానున్న కొత్త CIలు వీరే

image

శ్రీకాకుళం జిల్లాకు పలువురు సీఐలు బదిలీపై వచ్చారు. ఇంటెలిజెన్స్ సీఐ కె.శ్రీనివాసరావు టెక్కలి రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. జేఆర్ పురం(రణస్థలం) సీఐగా శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ అవతారం, సోంపేట సీఐగా బీ.మంగరాజు, ఇచ్ఛాపురం సీఐగా ఎం.చిన్నంనాయుడు, శ్రీకాకుళం రూరల్ సీఐగా కె.పైడపునాయుడు, డీఎస్బీ శ్రీకాకులం సీఐగా అవతారం, నరసన్నపేట సీఐగా జే.శ్రీనివాసరావు, కొత్తూరు సీఐగా సీహెచ్ ప్రసాద్ నియమితులయ్యారు.

News August 4, 2024

శ్రీకాకుళం జిల్లాలో పలువురు CIల బదిలీ

image

శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పలువురు సీఐలను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టెక్కలి రూరల్ సీఐ సూర్యచంద్ర మౌళిని విశాఖ వీఆర్‌కు పంపించారు. శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ అవతారం, టాస్క్‌ఫోర్స్ సెల్ సీఐ సూరినాయుడు, సోంపేట, నరసన్నపేట, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం రూరల్ సీఐలు హెచ్.మల్లేశ్వరరావు, బీ.ప్రసాదరావు, టీ.ఇమ్మన్యుయల్ రాజు, ఎల్.సన్యాసి నాయుడు బదిలీ అయ్యారు.

News August 4, 2024

కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన IIIT డైరెక్టర్

image

నూజివీడులో ఉన్న విద్యార్థులను శ్రీకాకుళం IIIT క్యాంపస్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని IIIT డైరెక్టర్ ఆచార్య బాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం క్యాంపస్‌లోని పలు సమస్యలను కేంద్ర మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు.

News August 4, 2024

కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన IIIT డైరెక్టర్

image

నూజివీడులో ఉన్న విద్యార్థులను శ్రీకాకుళం IIIT క్యాంపస్ తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని IIIT డైరెక్టర్ ఆచార్య బాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం క్యాంపస్‌లోని పలు సమస్యలను కేంద్ర మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు.

News August 4, 2024

శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే రైళ్లు దారి మళ్లింపు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లే ఈస్ట్కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు 18046 రైలును ఆగస్టు 3 నుంచి 11 వరకు, 18045 ట్రైను ఆగస్టు 2 నుంచి 10 వరకు గుణదల, రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆయా రోజుల్లో ఈ రైళ్లు విజయవాడ మీదుగా వెళ్లవని, సమీపంలోని రాయనపాడులో ఈ రైళ్లకు స్టాప్ ఇచ్చామని అధికారులు తెలిపారు.

News August 4, 2024

నేటి నుంచి జీడి పరిశ్రమలు ఓపెన్‌

image

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ, పరిసర ప్రాంతాల్లో ఉన్న జీడి పరిశ్రమలను ఆదివారం నుంచి తెరుస్తున్నామని పలాస పారిశ్రామికవాడ జీడి పరిశ్రమల సంఘ అధ్యక్షుడు మల్లా రామేశ్వరం వెల్లడించారు. జులై 19వ తేదీ నుంచి జీడి ఉత్పత్తులు పేరుకుపోవడంతో పరిశ్రమలు తాత్కాలికంగా బంద్‌ చేశామని చెప్పారు. ఆదివారం నుంచి బాయిలింగ్, కటింగ్‌ కొనసాగుతాయని స్పష్టం చేశారు.

News August 4, 2024

సీతంపేట: గిరిజన విద్యార్థులు టెట్, డీఎస్సీకి ఉచిత శిక్షణ

image

ఐటీడీఏ ఆధ్వర్యంలో టెట్, డీఎస్సీకి అందిస్తున్న ఉచిత శిక్షణను పొందేందుకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గిరిజన విద్యార్థులు ఈ నెల 3 నుంచి 10వ తేదీ లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పరీక్ష ద్వారా ఉచిత శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు.