India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 200 అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
➤ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా ఉంది: మంత్రి అచ్చెన్న➤ బడ్జెట్‌పై భయమెందుకు బాబు: ధర్మాన కృష్ణ దాస్➤ 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్➤ ఆగస్టు 3న రెండో విడత IIIT మెరిట్ జాబితా➤ APSRTCలో అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తు➤ ఎస్పీ ప్రజా ఫిర్యాదుకు 58 ఫిర్యాదులు➤ సోంపేట టీడీపీ సీనియర్ నాయకుడు మృతి➤ గారలో సాగునీటి కోసం తోపులాట.. వృద్ధుడు మృతి
APSRTCలో అప్రెంటిషిప్ కోసం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ప్రజా రవాణా అధికారి సోమవారం తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రికల్, డ్రాఫ్ట్ మెన్ , సివిల్ ట్రేడుల్లో దరఖాస్తుకు అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. వివరాలకు www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌ను చూడాలన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 16.
మోసపూరిత హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. ఈ మేరకు సోమవారం ఆయన పోలాకిలో ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా మరో 3 నెలలు ఓటాన్ అకౌంట్‌కు వెళ్లిందన్నారు. సూపర్ సిక్స్‌ను అమలు చేయకుండా ఉండేందుకు ఆయన కొత్త ఎత్తుగడ వేశారన్నారు.
ఆర్జీయూకేటి పరిధిలో శ్రీకాకుళంలో 863 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండో విడత మెరిట్ జాబితా వివరాలను ఆగస్టు 3వ తేదీన ప్రకటించనున్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు క్యాంపస్ మార్పు కావాలంటే rgukt.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వెబ్‌సైట్ లింక్ ఈనెల 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ తెలిపారు.
గతంలో ఎదురైన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ 1వ తేదీ నాడే శతశాతం జరగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు 1వ తేదీ ఉదయం 5.30కి పంపిణీ ప్రారంభించి మొదటి రోజునే శత శాతం పంపిణీ జరగాలన్నారు.
కళింగపట్నం ఓడరేవు శ్రీకాకుళం గార మండలంలో ఉంది. బంగాళాఖాతం బడ్డున ఉన్న ప్రాచీన ఓడరేవుగా ప్రసిద్ధి. రాష్ట్రమంతటా పేరుగాంచిన శ్రీకళాంజలి సాంస్కృతిక సంస్థ ఇక్కడిదే. ఇక్కడే వంశధార నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ మదీనా సాహేబ్ సమాధి ఉంది. బ్రిటిష్ వారు లైట్ హౌస్‌ను 1876 నిర్మించారు. దీనిని మళ్లీ ప్రభుత్వం 1982లో పునర్నిర్మించింది. కళింగపట్నం బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
గార మండలం కోళ్లపేట గ్రామంలో సాగునీటి కోసం జరిగిన తోపులాటలో వృద్ధుడు మృతి చెందిన ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తట్ట తౌడు(70) తన పొలానికి వెళ్తున్న సాగునీరు వంజల సునీత పొలం మీదుగా వెళుతుండడంతో నీటిని తౌడు తన పొలానికి మళ్లించాడు. ఇది తెలుసుకున్న సునీత పొలం వద్దకు వచ్చి ఘర్షణకు దిగి ఒకరికొకరు తోసుకోగా తౌడు కిందపడి గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
పాతపట్నంకు చెందిన శోభనాపురపు రాజేశ్వరరావు గత కొంతకాలంగా కుటుంబంతో పాటు విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు శోభనాపురపు యువరాజు (23) పెదవాల్తేరుకు చెందిన మైనర్ బాలికను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు. అతని మాయమాటలతో ప్రేమలో పడిన అమ్మాయిని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు యువకుడు పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
సారవకోట మండలంలోని అంగూరు, అన్నుపురం, గొర్రిబంద క్షేత్ర సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీలోగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు ఉపాధిహామీ పథకం ఏపీవో నారాయణరావు తెలిపారు. అంగూరు క్షేత్ర సహాయకుడు మృతి చెందగా ఆ పోస్టు ఖాళీ అయ్యిందని, అన్నుపురం, గొర్రిబంద క్షేత్ర సహాయకులు ఇటీవల రాజీనామా చేసినట్లు చెప్పారు. కిడిమి పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ న్యాయస్థానంలో విచారణలో ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.