India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎచ్చెర్లలోని బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీలోని 2025లో పిలాసఫీ, జియాలజీ, జియో ఫిజిక్స్ కోర్సులను ప్రారంభించగా జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల నిర్వహణకు పీజీ సెట్ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఫిబ్రవరి 6 నుంచి రిజిస్ట్రేషన్లు, మే 5, 8,9,10, 11 తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. అయితే ఉపాధి, డిమాండ్ కోర్సులకు జిల్లాలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

మందసలో వాసుదేవుడి 17వ బ్రహ్మోత్సవాలు ఈ నెల 7-13వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలకు వెళ్లాలనుకున్న భక్తుల ప్రయాణ మార్గాలు చూస్తే.. శ్రీకాకుళం-ఇచ్ఛాపురానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి హరిపురంలో దిగాలి. అక్కడి నుంచి ఐదు కి.మీటర్ల దూరంలోని వాసుదేవ ఆలయానికి బస్సు, ఆటోల్లో నేరుగా చేరుకోవచ్చు. రైళ్లలో వచ్చే వారు పలాస రైల్వే స్టేషన్‌లో దిగి బస్సుల్లో, పాసింజర్ ట్రైన్స్‌లో మందసకు వెళ్లాలి.

మందస శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ ఆలయంలో శనివారం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాలలో భాగంగా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. 7న ఆంజనేయస్వామి అభిషేకం, 8న వాసుదేవుని అభిషేకం, 9న శేషవహనసేవ, 10న కల్పవృక్ష వాహనం, ఎదుర్కోలు ఉత్సవం, 11న స్వామివారి కళ్యాణం, 12న తెప్పోత్సవం, అస్వవాహనసేవ, 13న చక్రస్నానం, రథోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు 358 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయగా, 327 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో టాటా ఎలక్ట్రానిక్స్‌కు 151, హ్యుందాయ్ మోబిస్‌కు 49, ఇసుజు మోటార్స్‌కు 40, డెక్కన్ కెమికల్స్‌కు 58, అపోలో టైర్స్‌కు 17, ఇండోమిన్‌కు 12 మంది ఉన్నారని ప్రిన్సిపల్ తెలిపారు.

ప్రజలకు పోలీసు సేవలను మరింత వేగంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ మనమిత్ర సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సాంకేతికతను జోడించి పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.

మండలాలలో ఉన్న భూ వివాద కేసులను తక్షణమే పరిష్కరించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ వివాద కేసులపై ఉన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి వాటి పరిష్కారానికి పోలీస్ సహకారం తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా పంపిణీ జరిగిన 8 ఎలక్ట్రానిక్ వాహనాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆయన కార్యాలయం ఆవరణలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ..పరిశుభ్రతను పాటించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధానమైన పరిశుభ్రతపై అధికారులు, సిబ్బంది బాధ్యత వహించి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సౌజన్య, తదితరులున్నారు.

రాష్ట్ర పండుగైన రథసప్తమిని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులు పకడ్బంధిగా ఏర్పాట్లు చేశారు. అంబారాన్ని తాకేలా ఉత్సవాలు జరిపేందుకు మీడియా ఫ్లాట్ ఫామ్‌లు విస్తృత ప్రచారం చేశాయి. కార్యక్రమాలన్ని సజావుగా జరిగినా..ఊహించని విధంగా వచ్చిన భక్త జనసంద్రానికి ఎటువంటి ఘటనలు జరకుండా దర్శనాలు చేయించడంలో యంత్రాంగం, పోలీసులు పైచేయి సాధించారు. కలకలం రేపిన నకిలీ పాసుల్లో నిజాలు ఖాకీల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

గడ్డి మందును తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పొందూరు మండలంలో జరిగింది. మండలంలోని తానే గ్రామానికి చెందిన పాపినాయుడు(65) ఈ నెల 22న రాత్రి మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి చేరుకోగా కుటుంబీకులు రిమ్స్‌లో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అరసవల్లి రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వీటి ముద్రణపై SM ఇన్‌ఫ్లుయోన్సర్ల పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలను వారు ఖండించారు. తాజాగా ఆలయానికి సమీప జిరాక్స్ షాపుల్లోనే ఈ ముద్రణ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. వేడుకల్లోని కార్యక్రమాలకు వేల సంఖ్యలో పుట్టుకొచ్చిన పాసులకు బాధ్యులెవరో(SM ఇన్‌ఫ్లుయోన్సర్ల? జిరాక్స్ షాపుల? ఇతరుల?) బయటపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.