India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 10 బార్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ రోజు సాయంత్రం వరకే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ తిరుపతిరావు ఇటీవల ఓ ప్రకటనలో తెలియజేశారు. శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మండలాల్లో బార్‌లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

శ్రీకాకుళంలోని బలగ మెట్టు వద్ద మంగళవారం గుర్తుతెలియని యాచకుడు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. స్థానికంగా చిత్తుకాగితాలు ఏరుకుని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ఈ మేరకు బలగ మెత్తులోని ఒక ఆలయం వద్ద అస్వస్థతకు గురై మృతిచెందాడు. ఈ మేరకు మృతదేహాన్ని శ్రీకాకుళం 2టౌన్ పోలీసులు పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీకాకుళం పోలీస్ అధికారులకు సంబంధించి వార్షిక జిల్లాస్థాయి స్పోర్ట్స్ గేమ్స్ కార్యక్రమం ఈనెల 4న శ్రీకాకుళం మండలం తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రం గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు ఎస్పీ కేవీ.మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వాన్ని క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి పాల్గొంటారన్నారు.

జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వరుని క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా అధికారులతో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమీక్షించారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో పాటు దేవాదాయ శాఖ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు. దీనివలన నిలిచిపోయిన కొత్త ఆర్డర్లకు మంచి అవకాశం ఉంటుందన్నారు.

ఆమదాలవలస మండలం చీమలవలసకి చెందిన బొడ్డేపల్లి వెంకటలక్ష్మి(47) అనే మహిళని భోగాపురం వద్ద కారు ఢీకొని మృతి చెందింది. గత కొన్నేళ్లుగా క్రితం భర్త రమణమూర్తితో కలిసి భోగాపురంలో నివాసం ఉంటొంది. తన పెద్దకుమార్తె గాయత్రీకి మరో రెండు నెలల్లో వివాహం, పెళ్లి పనుల్లో కుటుంబసభ్యులు ఉండగా వెంకటలక్ష్మి ఈనెల 1వ తేదీ రాత్రి సర్వీసు రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది.

గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగుస్తుండడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గ్రామస్థాయిలో చర్చ మొదలైంది. ఇప్పటికే గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు ఫ్రీజింగ్‌లో ఉన్నాయి. జిల్లాలోని 912 గ్రామ పంచాయతీలు ఉండగా 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పది, ఇంటర్ పరీక్షలు, జన, కులగణన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా లేదా ప్రత్యేక అధికారులు వస్తారా అనే సందిగ్ధం నెలకొంది.

రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట ఆటవిక దాడులు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైయస్సార్సీపీ శ్రేణులతో కలిసి సోమవారం కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా అదుపు తప్పిందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటి పైనా జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం అన్నారు.

Sorry, no posts matched your criteria.