India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భవిష్యత్తు ప్రపంచాన్ని ముందుకు నడిపేది క్వాంటం సాంకేతికతేనని కలెక్టర్ దినకర్ పుండ్కర్ అన్నారు. విద్యార్థులు ఈ రంగంలో చేస్తున్న ఆవిష్కరణలు రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్–2025లో భాగంగా ఆర్జీయూకేటీ (త్రిబుల్ ఐటీ ఎచ్చెర్ల), శ్రీకాకుళంలో అంతర్గత హ్యాకథాన్ నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న ఆవిష్కరణలను చూసి ప్రశంసించారు.
▶ శ్రీకాకుళంలో కార్డెన్ సెర్చ్.. ఐదు బైక్ లు సీజ్
▶10 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి: అచ్చెన్నాయుడు
▶కొత్తూరు: రోడ్డుపై ప్రవహిస్తున్న గెడ్డ నీరు
▶శ్రీకాకుళం, టెక్కలిలో ఈనెల 30న జాబ్ మేళా
▶ కొత్తమ్మతల్లి ఉత్సవాలపై మంత్రి అచ్చెన్న సమీక్ష
▶ రోగులకు సక్రమంగా వైద్యసేవలు అందించాలి: ఎమ్మెల్యే బగ్గు
▶ కొత్తూరులో నీట మునిగిన పంట పొలాలు
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.టీ.గోవిందమ్మ గురువారం తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీలు నిర్వహించే ఈ జాబ్ మేళాలో 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన వారు జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు దేవాదయ శాఖ అధికారులను ఆదేశించారు. రానున్న నెల 23 నుంచి 25 వరకు జరగనున్న పండగ మహోత్సవం నేపథ్యంలో గురువారం నిమ్మాడ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
శ్రీకాకుళంలోని చిత్రంజన్ వీధికి చెందిన భారటం సావిత్రమ్మ (85) గురువారం ఉదయం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావు విషయాన్ని తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.
శ్రీకాకుళం, పలాస మీదుగా సంత్రాగచ్చి(SRC)- యశ్వంత్‌పూర్(YPR) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02863 SRC- YPR రైలును Sept 4 నుంచి Sept 18 వరకు ప్రతి గురువారం, నం.02864 YPR- SRC మధ్య నడిచే రైలును Sept 6 నుంచి Sept 20 వరకు ప్రతి శనివారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం సూచించారు. ఉత్సవాలలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు, అపసృతులకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ వేడుకల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవలసిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు.
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయనశాస్త్రం, కంప్యూటర్ అప్లికేషన్స్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టి. గోవిందమ్మ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీజీలో కనీసం 55 శాతం మార్కులు, ఏపీ సెట్, యూజీసీ నెట్ అర్హత, పీహెచ్డీ అర్హత కలిగిన వారు ఆగష్టు 30న కళాశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావలన్నారు.
కత్తిపోట్లకు గురైన ఓ యవకుడు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఎస్సై మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు జీసిగాడం(M) గెడ్డకంచారానికి చెందిన రాజశేఖర్, గొబ్బూరు గ్రామస్థుడు శంకర్ల మధ్య ఆదివారం ఓ విషయంపై వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శంకర్ క్షణికావేశంలో కత్తితో రాజశేఖర్‌పై దాడి చేశారు. క్షతగాత్రుడుని స్థానికులు రిమ్స్‌లో చేర్చగా అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదైంది.
డీఎస్సీ ఫలితాల్లో పలు విభాగాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 28న జరగనుంది. ఈ మేరకు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీతో మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్‌లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువ పత్రాలను గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో 3 సెట్ల జిరాక్స్, 5 ఫొటోలతో కేటాయించిన తేదీ, వేదికకు సమయానికి హాజరవ్వాలన్నారు.
Sorry, no posts matched your criteria.