Srikakulam

News July 13, 2024

REWIND: సిక్కోలు మణిరత్నం చౌదరి సత్యనారాయణ (నేడు జయంతి)

image

ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురంలో 1908 జులై 13న జన్మించిన చౌదరి సత్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు. 13 ఏళ్ల వయసులోనే ఉప్పు సత్యాగ్రహం, కల్లు వేలం పాటలకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో దూసి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహాత్మా గాంధీని పొందూరు ఖాదీతో సత్కరించారు. 1955, 1967లో కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు.

News July 13, 2024

శ్రీకాకుళం: ‘రెండో శనివారం సెలవు లేదా? అయితే ఫిర్యాదు చేయండి’

image

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు రెండో శనివారం సెలవు దినం పాటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం తెలిపారు. సెలవు ప్రకటించని పక్షంలో ఆయా పాఠశాల, కళాశాలలపై apscpcr2018@gmail.com మెయిల్ ఐడీ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

News July 13, 2024

నేటితో పాలిసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ముగింపు

image

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న రెండో విడత కౌన్సెలింగ్‌‌లో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. కాగా శుక్రవారం 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం రెండు రోజుల్లో 70 మంది హాజరయ్యారు. ఈ కౌన్సెలింగ్ గురువారం ప్రారంభం కాగా శనివారంతో ముగియనుంది. మొదటి విడత సీట్లు లభించిన విద్యార్థులు బ్రాంచ్‌లు మార్చుకునే వెసులుబాటు ఉంది.

News July 13, 2024

రేపు శ్రీకాకుళం జిల్లా హాకీ సంఘం ఎన్నికలు

image

జిల్లా హాకీ సంఘం ఎన్నికలు ఆదివారం నిర్వహించనున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి షైనీ మధు తెలిపారు. శ్రీకాకుళంలోని తిలక్ నగర్ వద్ద యూటీఎఫ్ భవనంలో ఉదయం 10 గంటలకు జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సంఘ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

News July 13, 2024

నేడు, రేపు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు

image

జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలో శని, ఆదివారం శ్రీకాకుళంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2024 పేరిట నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలో మొత్తం ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించానున్నారు. అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17, అండర్-19 బాలికలకు, పురుషులు పోటీలు జరుగుతాయి.

News July 13, 2024

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే అధికారులు

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12704/12703 సికింద్రాబాద్- హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లకు మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12704 ట్రైన్‌ను నవంబర్ 10 నుంచి, 12703 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News July 12, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✦ మూలపేట పోర్టు నిర్వాసితుల ఆందోళన ✦ ఆమదాలవలసలో ఇద్దరు బైక్ దొంగల అరెస్టు ✦ కారు ఆపి ఆమదాలవలస కార్యకర్తను పలకరించిన సీఎం ✦ జలుమూరులో బైక్‌ను ఢీకొన్న వ్యాన్ ✦ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పనులు అడ్డగింత ✦ మంత్రి అచ్చెన్నతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే భేటీ ✦ వసుంధర లేఅవుట్లను సందర్శించిన సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ ✦ పూండి రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

News July 12, 2024

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే అధికారులు

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12704/12703 సికింద్రాబాద్- హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లకు మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12704 ట్రైన్‌ను నవంబర్ 10 నుంచి, 12703 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News July 12, 2024

ఎల్.ఎన్.పేట: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

image

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వెలుగు ఏపీఎం ఎస్ రవిరాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం ఆవరణంలో బంగారు సంతోషి సంస్థలు ఉచితంగా అందించిన మొక్కలను సిబ్బందితో కలిసి ఆయన నాటారు. మొక్కలు నాటడం వలన పర్యావరణానికి మేలు చేకూరుతుందని తెలియజేశారు. వాతావరణంలో కాలుష్యం తగ్గాలంటే మొక్కలు ప్రాధాన్యత ఎంతో ఉందని ఏపీఎం చెప్పారు. ఈయనతో పాటు విజయలక్ష్మి, శంకర్, పాండురంగనాథరాజు పాల్గొన్నారు.

News July 12, 2024

శ్రీకాకుళంలో జాబ్ మేళా.. 31 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూ నిర్వహించగా.. నిరుద్యోగ యువత 170 మంది హాజరయ్యారు. ఇందులో 31 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు సుధా తెలిపారు.