Srikakulam

News April 14, 2024

చంద్రబాబుని నమ్మి మోసపోవద్దు: మంత్రి ధర్మాన

image

అధికారం కోసం చంద్రబాబు అనేక తప్పుడు ప్రచారాలు చేస్తూ, మాయమాటలు చెబుతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చిన జగనన్నకు ఓటు వేయాలన్నారు.

News April 14, 2024

శ్రీకాకుళం జిల్లాలో వ్యక్తి వ్యక్తి అనుమానాస్పద మృతి

image

బూర్జ మండలం పెద్దపేట పంచాయతీ బొమ్మిక గ్రామంలో సవర చంద్రయ్య(48) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానిక ఎస్సై జీవీ ప్రసాద్ ఆదివారం తెలిపారు. చంద్రయ్య భార్య ఎస్.పున్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చంద్రయ్య మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

News April 14, 2024

మరో కోడి కత్తి డ్రామాకు తెర లేపిన జగన్: అచ్చెన్న

image

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీఎం జగన్ మరో కోడి కత్తి డ్రామాకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు అన్నాడు. ఆదివారం పలాసలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతోందని తెలిసే జగన్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 160 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

News April 14, 2024

అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయం:డీఆర్‌ఓ

image

శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా డీఆర్ఓ గణపతి రావు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నవీన్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2024

శ్రీకాకుళంలో తీవ్ర వడగాల్పులు

image

రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ 151 మండలాల్లో మోస్తరుగా.. 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. రేపు 135 మండలాల్లో స్వల్పంగా.. 33 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. శ్రీకాకుళంలో వడగాల్పులు ఉండనున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని సూచించింది.

News April 14, 2024

శ్రీకాకుళం: చెరువులో చేపల వేటకు పోటీపడ్డ గ్రామస్థులు

image

నందిగాం మండలం పాత్రునివలస గ్రామానికి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చెరువులో ఆదివారం చేపలు పట్టేందుకు గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. గ్రామ పెద్దల ఆదేశాల మేరకు ఉదయం గ్రామంలో ఉన్న వారంతా చెరువులో చేపలు పట్టేందుకు ఒక్కసారిగా వందలాది మంది చెరువులో దిగి పోటీపడ్డారు. ఇలా ఒక్కసారిగా చేపలవేట సాగిస్తున్న గ్రామస్థులను అటుగా వెళుతున్న ప్రయాణికులు ఆశ్చర్యంగా చూశారు. ఈ రోజు గ్రామమంతా చేపల కూరే మరీ.

News April 14, 2024

కొత్తూరు: మామిడి చెట్టు ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

image

కొత్తూరు మండలం గూనభద్ర ఆపోజిట్ కాలనీలో అదే కాలనీకి చెందిన మీసాల మిన్నారావు(33) మామిడి చెట్టు ఎక్కుతూ జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం కాలనీలో రోడ్డు పక్కన ఉన్న మామిడి చెట్టు నుంచి కాయలు తీసేందుకు చెట్టు ఎక్కాడు. పట్టు తప్పి చెట్టు మీద నుంచి జారిపడి బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టానికి తరలించారు.

News April 14, 2024

సోంపేట: లారీ చక్రాల కింద పడి వ్యక్తి మృతి

image

సోంపేట మండలం బారువా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం గ్రామం నుంచి బెంకిలి గ్రామానికి టీవీఎస్ మోటార్ సైకిల్‌పై డొక్కరి నరేష్ తన మిత్రులతో కలిసి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో డొక్కరి నరేష్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గాయాలతో బయటపడడంతో.. హైవే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

News April 14, 2024

సర్‌బుజ్జిలి యువకుడి కిడ్నాప్ కలకలం

image

వ్యక్తి కిడ్నాప్‌కు యత్నించిన ఘటన విశాఖ ఎంవీపీ స్టేషన్ పరిధిలో జరిగింది. సరుబుజ్జిలి మండలానికి చెందిన యుగంధర్ శనివారం విశాఖలో క్యాబ్‌ బుక్ చేసుకొని బీజేపీ కార్యాలయం వద్ద ఉండగా అప్పుడే కారులో ఐదుగురు అతడిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. గమనించిన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విశాఖకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉంటటంతో ఆమె భర్త కిడ్నాప్‌నకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

News April 14, 2024

శ్రీకాకుళం: కంట్రోల్ రూంను సందర్శించిన జిల్లా కలెక్టర్

image

కొత్త కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ శనివారం సందర్శించారు. కంట్రోల్ రూంలో ఎంసీఎంసీ, సోషల్ మీడియా, డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ సెంటర్ 1950, కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, పోలీసు కంట్రోల్ రూం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, సీ-విజిల్ విభాగాల్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు.