India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తనను కించపరిచే విధంగా ఆర్టికల్ వేశారని ఆరోజు తను విశాఖలోనే లేనట్లు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 6 సంవత్సరాలుగా ఈ కేసుపై పోరాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తను విశాఖ వచ్చినప్పుడు ప్రభుత్వ వాహనాలు వాడటం లేదని, పార్టీ కార్యాలయంలోనే బస చేస్తున్నట్లు చెప్పారు. వార్తలు రాసే ముందు క్లారిటీ తీసుకోవాలని.. తప్పుడు రాతలపై తాను ఎప్పుడూ పోరాడుతునే ఉంటానని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT)కి చెందిన బిరాక్ (BIRAC) సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బయో నెస్ట్ (Bio NEST) బయో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు అమోదం లభించింది. 3 సంవత్సరాల కాలానికి మొత్తం రూ.5 కోట్లతో చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ శతాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం కిరీటంలో మరొక కలికితురాయిగా నిలవనుందని రిజిస్ట్రార్ తెలిపారు.

తనపై ఓ పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా కేసులో భాగంగా మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఉదయం 11 గంటలకు కోర్టుకు రాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. చివరకు న్యాయమూర్తి ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటులో కేంద్రం ముందడుగు వేసింది. రైల్వే జోన్ కార్యాలయ ఉద్యోగుల కేటాయింపు కోసం ముమ్మరంగా చర్యలు జరుగుతున్నాయి. 959 ఉద్యోగులను సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌లో పని చేసేందుకు బదలాయింపు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్సవ, సౌత్ కోస్టల్ రైల్వే జీఎం సందీప్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ట్రయల్ రన్ తర్వాత ఉత్తరాంధ్రకు మరో గుడ్ న్యూస్‌గా చెప్పొచ్చు.

తెన్నేటి నగర్‌కు చెందిన సిమ్మ శ్రీను బాబు (48) వృత్తి రీత్యా బెంగళూరులో పని చేస్తున్నారు. డిసెంబర్ 16న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఎక్కి విశాఖకు బయలుదేరారు. అయితే మరుసటి రోజు అతను విశాఖ చేరుకోలేదు. తెలిసిన వారందరికీ అడిగినప్పటికీ ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు కంచరపాలెం పోలీసులు, బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

విశాఖలో పెండింగ్ సమస్యల పరిష్కారంపై జిల్లా MLAలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని జీవీఎంసీ అధికారుల వద్ద అసహనం వ్యక్తం చేశారు. నిన్న మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ఇందులో ఎంపీ గొల్లబాబూరావు, పలు నియోజకవర్గాల MLAలు పాల్గొని టిడ్కో హౌసింగ్ ఇళ్ల కేటాయింపుల్లో జాప్యంపై అధికారులను గట్టిగా నిలదీశారు.

మంత్రి నారా లోకేష్ నేడు విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు.ఓ దినపత్రికలో తనపై వచ్చిన ‘చినబాబు చిరుతిళ్లకు లక్షల ఖర్చు’ అనే కథనానికి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణ ఇవాళ జరగనుంది. 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్షన్ కు ఆయన హాజరుకానున్నారు ఇప్పటికీ రెండుసార్లు ఆయన హాజరయ్యారు.

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో నగరంలో నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఊరు వెళ్లేటప్పుడు LHMS సేవలు వాడాలని, ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వాకింగ్‌కు వెళ్లే మహిళలు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పనివారి వివరాలు సేకరించాలని, వాహనాలకు విధిగా తాళాలు వేయాలని స్పష్టం చేశారు.

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పి. నల్లనయ్యను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పి. నల్లనయ్యను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.