Visakhapatnam

News September 15, 2024

20 నుంచి దుర్గ్-విశాఖ వందే భారత్

image

దుర్గ్-విశాఖ దుర్గ్ మధ్య వందే భారత్ ఈనెల 20 నుంచి నడుస్తుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే పేర్కొంది. విశాఖలో ఈనెల 16 సాయంత్రం 4.15 గంటలకు దీనిని అధికారులు ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవ రోజు రాయగడ వరకు మాత్రమే నడుస్తుంది. 20 నుంచి రెగ్యులర్ రాకపోకలు కొనసాగుతాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం మినహా ప్రతిరోజూ నడుస్తుంది.

News September 15, 2024

చింతపల్లి: రోడ్డుప్రమాదంలో యువతి మృతి

image

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పట్టణ ప్రాంతంలో స్కూటీ బోల్తా పడి యువతి మృతి చెందింది. సెయింట్ ఆన్స్ స్కూల్ స్కూల్ ఎదురుగా జాతీయ రహదారిపై శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో యువతి ధన (25) స్కూటీ అదుపుతప్పడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. గుంతల కారణంగా స్కూటీ అదుపుతప్పిందని, ఈ క్రమంలోనే ధన మృతి చెందినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు.

News September 14, 2024

సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు

image

దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ శివారు అనంతగిరి మండలానికి చెందిన సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు. SI టి.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రాకారం విజయనగరం జిల్లా పైడి భీమవరానికి చెందిన లంక సాయికుమార్, ఇండియన్ నేవీ ఉద్యోగి దిలీప్ కుమార్ జలపాతంలో గల్లంతయినట్లు తోటి స్నేహితులు తెలిపినట్లు చెప్పారు. ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై SI విచారణ చేపడుతున్నారు.

News September 14, 2024

BREAKING: విశాఖలో భారీ అగ్నిప్రమాదం

image

విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఓ కంటైనర్‌లోని లిథియం బ్యాటరీలు పేలడంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

విశాఖ: 24 నుంచి ఇంటర్ రైల్వే బాక్సింగ్ పోటీలు

image

ఇంటర్ రైల్వే బాక్సింగ్ పోటీలను ఈనెల 24 నుంచి 27 వరకు విశాఖలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు వాల్తేరు డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 78వ పురుషులు, మహిళల 17వ ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో ప్రముఖ బాక్సర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.

News September 14, 2024

సీఎం నివాసం వద్ద విశాఖ జిల్లా మహిళ ఆవేదన

image

విశాఖ జిల్లాలోని భీమిలికి చెందిన వైసీపీ నేత నుంచి తనకు ప్రాణహాని ఉందని భీమిలికి చెందిన వెంకటలక్ష్మి శుక్రవారం మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. అతని వద్ద 2021నుంచి చిట్టీలు కడుతున్నానని, ఇటీవల చిట్టీ డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తమకు సీఎం చంద్రబాబు, లోకేశ్‌లే న్యాయం చేయాలని ఉండవల్లిలోని సీఎం ఇంటి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

News September 14, 2024

విశాఖ: ఓటరు జాబితా సవరణ.. నిధులు విడుదల

image

విశాఖ జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ-2025 కార్యక్రమానికి సంబంధించి ఖర్చుల కోసం రూ.17,85,820 నిధులు విడుదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం ఈ మేరకు నిధులు విడుదల చేశారు. మెటీరియల్ కొనుగోలు చేయడంతో పాటు ఇతర అవసరాల కోసం వీటిని వాడాలని ఉత్తర్వులు పేర్కొన్నట్లు అధికారులు వివరించారు.

News September 14, 2024

విశాఖ: ఆస్ట్రేలియాలో కాకడు-2024 విన్యాసాలకు ఈ.ఎన్.సీ

image

కాకడు-2024 విన్యాసాల్లో భాగంగా ప్లీట్ కమాండర్స్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు బ్లాక్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ప్లీట్ రియర్ అడ్మిరల్ సునీల్ మీనన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని డార్విన్‌కు నేవీ అధికారులు వెళ్లారు. అక్కడ 28 విదేశీ నౌకాదళాల ఉన్నతాధికారులతో తూర్పు నావికాదళం అధికారులు సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు.

News September 14, 2024

విశాఖ: నాలుగు రైతు బజార్లకు వారాంతపు సెలవుల రద్దు

image

నగరంలో ప్రధానమైన నాలుగు రైతుబజార్లకు వారాంతపు సెలవులను రద్దు చేస్తూ జాయింట్‌ కలెక్టర్ మయూర్‌ అశోక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సీతమ్మధార, కంచరపాలెం బజార్లకు ప్రతి మంగళవారం, ఎంవీపీ కాలనీ, నరసింహనగర్‌ బజార్లకు ప్రతి బుధవారం సెలవు. కొందరు రైతులు వారం వారం సెలవు తీసేయాలని కోరడంతో ఆ మేరకు మొదట నాలుగు రైతు బజార్లకు సెలవులు రద్దు చేస్తూ, 24/7 నడపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

News September 14, 2024

గాజువాక బెల్లం వినాయకుడు @1,29,000 వ్యూస్

image

గాజువాక మండలం నక్కవానిపాలెం వద్ద లంబోదర ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 75అడుగుల బెల్లం వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది ట్విటర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో ట్రెండ్ అవుతున్న వినాయక విగ్రహాల్లో బెల్లం వినాయకుడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఈ గణేశుడు 1,29,000 వ్యూస్ సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.