India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ ఉక్కు నగరం పరిధిలో ఉన్న ఏపీ మెడ్ టెక్ జోన్‌ను రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. అక్కడ వివిధ కంపెనీల ఆపరేషన్స్ ప్రక్రియలను పరిశీలించారు. వైద్య పరికరాల తయారీకి సంబంధించిన వివిధ కంపెనీలను సందర్శించి కంపెనీల సీఈవోలతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. అక్కడున్న వసతులు, కంపెనీలు, ఉద్యోగులు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
హోం మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టి నేటితో నెల రోజులైంది. ఉమ్మడి విశాఖ నుంచి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ ఈమె.100 రోజుల ప్రణాళికతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని.. అత్యాచారాలు, హత్యలు పెరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. మరి మంత్రి నెలరోజుల పనితీరుకు 10కి మీరిచ్చే మార్కులెన్ని?
సింహాచలం ఆలయంలో ఈనెల 20, 21 తేదీల్లో సిఫార్సు లేఖలు అనుమతించబడవని ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. 20న గిరి ప్రదక్షిణ 21న ఆషాడ పౌర్ణమి మరియు చందన సమర్పణ సందర్భంగా లక్షలాది సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అన్నారు. ఈ కారణంగా సిఫార్సులకు అనుమతించమని స్పష్టం చేశారు. అలాగే కొండపైకి ఏ విధమైన వాహనాలకు అనుమతి లేదన్నారు.
జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ విభాగంలో తుఫాను కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కలక్టర్ హరేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0891 – 2590102, 0891 – 2590100 ఫోన్ నంబర్‌లతో పని చేస్తుందని తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్‌ల ద్వారా వర్షాభావ పరిస్థితుల ప్రజలు తెలుసుకోవచ్చు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం పూరీకి తూర్పుఆగ్నేయంగా 70 కిలోమీటర్ల, కళింగపట్నానికి తూర్పుఈశాన్యంగా 240కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. తీరం దాటిన తర్వాత బలహీనపడి ఒడిశా, ఛత్తీస్‌గడ్ మీదుగా కొనసాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడతాయని తెలిపారు.
సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో గిరి ప్రదక్షిణ విజయవంత అయ్యేందుకు కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్‌ను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) 2024 విద్యాసంవత్సరానికి గాను వివిధ దూరవిద్య కోర్సులతోపాటు ఆన్‌లైన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన గడువు పొడిగించినట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ జి.ధర్మారావు తెలిపారు. డిప్లమా, పీజీ డిప్లమా, డిగ్రీ, పీజీ కోర్సులలో చేరడానికి జూలై 31 వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రస్తుతం తుఫాను వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ, హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శుక్రవారం ఉదయం అనకాపల్లి, ఏలూరు సహా కోస్తాంధ్రలోని పలు జిల్లాల కలెక్టర్‌లతో ఆమె మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఈ నెల 20వ తేదీన జరుగుతున్న గిరి ప్రదక్షిణలో 2,3,4 వీలర్స్‌కు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నడిచి వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికగా వివిధ ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చేవారికి పార్కింగ్ ప్లేస్‌లో ఏర్పాటు చేశారు. విజయనగరం మార్గంలో వచ్చే భక్తులు అడవివరం వద్ద, హనుమంతవాక వైపు నుంచి వచ్చేవారు సెంట్రల్ జైలు వద్ద, రూరల్ ప్రాంతం నుంచి వచ్చేవారు సింహపురి కాలనిలో పార్కింగ్ చేసుకోవాలి.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొచ్చువేలి భరోని మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ఈనెల 25న ఉదయం 8 గంటలకు కొచ్చువాలీలో బయలుదేరి, 21న ఉదయం 11:45 గంటలకు దువ్వాడ చేరుకుని, 22న మధ్యాహ్నం బరోని చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 23న బయలుదేరి, మూడో రోజు తెల్లవారుజామున 5:25 కు దువ్వాడ చేరుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 1:30కు కొచ్చివేలి చేరుతుంది.
Sorry, no posts matched your criteria.