India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖలో ఈనెల 28న మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు మధురవాడలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా విశాఖకు టీ20 మ్యాచ్ రావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

న్యూఇయర్ వేళ విశాఖలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ నగర్‌కి చెందిన షణ్ముఖరావు (33) తన పిన్ని వద్ద ఉంటూ గోపాలపట్నంలో పనిచేస్తున్నాడు. ఇటీవల తన మిత్రులు జానీ, గోపాల్‌తో కలిసి బయటకు వెళ్లాడు. అక్కడ గొడవ జరగడంతో జానీని కొట్టాగా.. అతడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భయపడిన షణ్ముఖరావు మామిడి తోటలో గురువారం ఉరివేసుకున్నట్లు గోపాలపట్నం పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.

సామాజిక న్యాయం అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సత్యారెడ్డి ఆకాంక్షించారు. సిఐటియు జాతీయ మహాసభ సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ 6వ రోజు సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం థీమ్‌తో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునితీరాలని చెప్పారు.

సామాజిక న్యాయం అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సత్యారెడ్డి ఆకాంక్షించారు. సిఐటియు జాతీయ మహాసభ సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ 6వ రోజు సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం థీమ్‌తో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునితీరాలని చెప్పారు.

నూతన సంవత్సరం సందర్భంగా “సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి”కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చేసిన విజ్ఞప్తికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. వివిధ ప్రభుత్వ శాఖలు,ఉ ద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనేక విభాగాలు, అధికారులు, ఉద్యోగులు, సంఘాలు, వ్యక్తుల స్వచ్ఛందంగా మొత్తం మీద రూ.8,22,292 విరాళాలుగా అందినట్లు కలెక్టర్ వెల్లడించారు.

నగరంలోని బుధవారం సాయంత్రం నుంచి 83 చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 2,721 వాహనాలు తనిఖీ చేయగా బహిరంగ మద్యం కేసులు 99, మోటార్ వెహికల్ కేసులు 644, హెల్మెట్ ధరించని కేసుు 506, త్రిబుల్ రైడింగ్ 34, డ్రంక్ అండ్ డ్రైవ్ 257, ఇతర మోటర్ వెహికల్ కేసులు 103 నమోదు చేసినట్లు నగర పోలీసులు తెలిపారు. గురువారం కూడా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న గోపినాథ్ జట్టి పదోన్నతిపై గురువారం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP)గా బాధ్యతలు స్వీకరించారు. రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన పోలీసు అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. పూల మొక్కలు (Saplings) అందజేసి నూతన సంవత్సర, పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రంలోనే మొట్ట మొదటగా విశాఖ నగరంలో మొబైల్ వాటర్ టెస్టింగ్ లేబొరేటరీను గురువారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రారంభించారు. నగరంలోని అన్ని వార్డుల పరిధిలో ఉన్న నివాస ప్రాంతాల వద్దకే ఈ వాహనం నేరుగా వెళ్తుందన్నారు. ప్రజలు తాము తాగే నీరు ఎంతవరకు సురక్షితమో అక్కడికక్కడే తెలుసుకోవచ్చన్నారు. నగర ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విశాఖలో పోలీసులు కొత్త సంవత్సరం వేళ మందుబాబులపై గురిపెట్టి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు 50చోట్ల ట్రాఫిక్ పోలీసులు బృందాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 240 మంది మద్యం సేవించినట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. వెంటనే వాహనాలు స్వాధీనం చేసుకొని స్టేషన్లకు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇవాళ కూడా తనిఖీలు జరుగుతాయన్నారు.

న్యూఇయర్ సందర్భంగా విశాఖలో మద్యం అమ్మకాలు ఊహించిన దానికంటే భారీగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులోనే మద్యం అమ్మకాల ద్వారా రూ.9.90 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణంగా విశాఖలో రోజుకు రూ.5-6 కోట్ల వరకు ఆదాయం వస్తుంటే.. నిన్న అదనంగా రూ.3 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. నిన్న, ఈరోజు వైన్స్ షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు, పబ్‌లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది.
Sorry, no posts matched your criteria.