India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ నంబర్లతో తిరుగుతున్న వాహనాల యజమానులు వెంటనే పన్ను చెల్లించాలని విశాఖ ఉప రవాణా కమిషనర్ తెలిపారు. బీహెచ్ సిరీస్ వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. తనిఖీలు చేసి పన్ను చెల్లించకుండా తిరుగుతున్న 56 వాహనాలపై కేసులు నమోదు చేసి, రూ.1.19 కోట్లు పన్ను, రూ.10 లక్షల అపరాధ రుసుము వసూలు చేశామని చెప్పారు. తనిఖీలు కొనసాగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు.
ఏయూ పరిధిలోని బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ 2వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 29 నుంచి 31 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపారు. 29న బీఎఫ్ఏ విద్యార్థులకు ఆర్ట్స్ హిస్టరీ, 30న ఇంగ్లీష్, 31న ఫండమెంటల్స్ ఆఫ్ డిజైన్, ఎం.ఎఫ్.ఏ విద్యార్థులకు 30న మోడ్రన్ ఇండియన్ ఆర్ట్, 31న మోడర్న్ వెస్టర్న్ ఆర్ట్ పరీక్షలు జరుగుతాయి.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఎస్సీ అప్లైడ్ కెమిస్ట్రీ 4వ సెమిస్టర్ పరీక్షలు జూలై 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జె.రత్నం తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 8న ఇండస్ట్రీస్ బేస్డ్ ఆర్గానిక్ రా మెటీరియల్స్, 9న ఫైన్ కెమికల్స్, 10న పాలిమర్స్ అండ్ ప్లాస్టిక్స్, 11న ఎలెక్టివ్స్, 12న ఇంటలెక్చువల్ ఐ.పీ.ఆర్ పరీక్షలు జరుగుతాయి.
ఏయూ పరిధిలో జులై 9 నుంచి జరగనున్న బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలను జంబ్లింగ్ విధానంలో కేటాయించినట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) జె.రత్నం తెలిపారు. ఏయూ పరిధిలో ఉన్న 58 బీఈడీ కళాశాలలకు పరీక్ష కేంద్రాలను మార్పు చేశామన్నారు. ప్రిన్సిపాల్స్ తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు కేటాయించిన పరీక్షా కేంద్రంలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.
ఐటీ రంగ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు విశాఖ ఐటి పార్క్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఓ.నరేష్ కుమార్ లేఖ రాశారు. మిలీనియం టవర్లను 10 ప్రముఖ ఐటి కంపెనీలకు 3 సంవత్సరాలకు ఉచితంగా కేటాయించాలని, తద్వారా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు. హిల్ నెంబర్ 2,3లో ఉన్న పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని నూతన కంపెనీలకు 50 శాతం సబ్సిడీపై అందించాలని, నూతన ఐటీ పాలసీ అమలు చేయాలన్నారు.
విశాఖ ఎండాడ న్యాయ కళాశాల రోడ్డులో వైసీపీ జిల్లా కార్యాలయానికి సంబంధించిన కరెంట్ బిల్లు పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పేరు మీద కొనసాగుతోంది. పంచకర్ల వైసీపీని వీడి జనసేనలో చేరి ఏడాది అవుతోంది. 2021-23 కాలంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పంచకర్ల పనిచేశారు. విద్యుత్ మీటర్‌ను ఆయన పేరుతో దరఖాస్తు చేయడంతో ఆయన పేరు మీదనే నేటికి విద్యుత్ బిల్లులు వస్తున్నాయి.
పదవీ విరమణ చేసి, పదవుల్లో కొనసాగుతున్న ఉద్యోగులు తక్షణం వైదొలగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మార్పు మొదలైంది. సైన్స్, మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌ను శనివారం నియమించారు. ఫార్మసీ, న్యాయ కళాశాల, ఐఏఎస్ఈ, ఏయు దూరవిద్యా కేంద్రం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఓఎస్డీలను సైతం మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులు ఆచరణలో పెట్టారు.
అల్లూరి జిల్లాలో ఇద్దరి మరణాలు మిస్టరీగా మారాయి. పెదబయలు మండలం చుట్టుమెట్టలో కాఫీతోటలకు వెళ్లిన ఓ మహిళ అపస్మారకస్థితిలోకి చేరుకుంది. దీంతో ఆమె సోదరుడు భూత వైద్యుడు సహదేవ్ వద్దకు తీసుకెళ్లాడు. వైద్యం చేస్తుండుగా.. మహిళ చెయ్యి పట్టుకున్న ఆమె తమ్ముడు త్రినాథ్, భూత వైద్యుడు సహదేవ్ ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. ఆ మహిళ కొంతసేపటికి తేరుకుంది. ఈనెల 19న జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.
హోంమినిస్టర్ వంగలపూడి అనితను కలవడానికి వచ్చిన బీజేపీ నాయకుడు గాయపడినట్లు సమాచారం. శనివారం తిరుమల దర్శనార్థం హోం మినిస్టర్ వెళ్తుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద తిరుపతి పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు ప్రభాకర్ నాయుడు వంగలపూడి అనితను సన్మానించడానికి వచ్చారు. కాన్వాయ్‌లోని ఓ వాహనం దూసుకెళ్లి ఢీకొట్టడంతో ఆయన గాయపడగా.. రుయా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని మూడు ప్రభుత్వ, 29 ప్రైవేట్ ఐటిఐల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటిఐలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్ తెలిపారు. మిగులు సీట్లను ఈ నెల 24 నుంచి భర్తీ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పూర్తి చేసుకుని కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.