Visakhapatnam

News June 23, 2024

విశాఖ: 24, 25 తేదీల్లో రద్దయిన రైళ్ల జాబితా ఇదే..

image

పలాస-విజయనగరం లైన్‌లో వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. 24న పలాస-విశాఖ-పలాస, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైలు 24న విశాఖ-బ్రహ్మపూర్, 25న బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా 24న విశాఖ-భువనేశ్వర్, 25న భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశామన్నారు.

News June 22, 2024

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ బదిలీ

image

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆమె స్థానంలో దినేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన ఇది వరకు ప్రకాశం జిల్లాకు కలెక్టర్‌గా పని చేశారు.

News June 22, 2024

విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బదిలీ

image

విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ మల్లికార్జునను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖ జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌కు కలెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ జిల్లా కలెక్టర్ బదిలీ అవుతారని వెలువడిన ఊహాగానాలు నిజమయ్యాయి.

News June 22, 2024

విశాఖ: ఘాట్ రోడ్‌లో బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్

image

గూడెం కొత్తవీధి మండలం దారాలమ్మ తల్లి ఘాట్ రోడ్ సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద శనివారం ఓ ఆయిల్ ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపుతప్పి లోయలో పడింది. ఈ సంఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి సీలేరు పెట్రోల్ బంకుకు ఆయిల్ తీసుకొచ్చిన ట్యాంకర్ తిరిగి బయలుదేంది. ఈ క్రమంలో మలుపు వద్ద ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయి 100 అడుగుల లోయలోకి ట్యాంకర్ జారిపోయింది.

News June 22, 2024

విశాఖ: 24, 25 తేదీల్లో రద్దయిన రైళ్ల జాబితా ఇదే..

image

పలాస-విజయనగరం లైన్‌లో వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. 24న పలాస-విశాఖ-పలాస, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైలు 24న విశాఖ-బ్రహ్మపూర్, 25న బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా 24న విశాఖ-భువనేశ్వర్, 25న భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశామన్నారు.

News June 22, 2024

విశాఖ: మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తున్నాం: స్పీకర్ అయ్యన్న

image

గత ప్రభుత్వం మీడియా మీద పెట్టిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ మేరకు ఆంక్షలు ఎత్తివేస్తూ మొదటి సంతకం చేశానన్నారు. జగన్ తనసై చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు.

News June 22, 2024

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: మాజీమంత్రి అమర్నాథ్

image

ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో టీడీపీ దమనకాండను సాగిస్తున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులపై కూడా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన టీడీపీ.. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తోందని దుయ్యబట్టారు.

News June 22, 2024

ఇకపై అయ్యన్న హుందాతనం చూస్తారు: పవన్ కళ్యాణ్

image

అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో <<13488653>>అయ్యన్నపాత్రుడు<<>> ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25వ యేటనే రాజకీయాల్లోకి వచ్చి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తనదైన ముద్రవేశారన్నారు. ఐదేళ్లలో ఆయనపై అనేక కేసులు పెట్టినా నిలబడ్డారన్నారు. అటు ఇన్ని దశాబ్దాల్లో అయ్యన్న వాడివేడి, వాగ్దాటిని చూసిన ప్రజలు ఇక ఆయన హుందాతనం చూస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషకరమన్నారు.

News June 22, 2024

విశాఖ: వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు

image

విశాఖ నగరం ఎండాడ వద్ద గల వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్థల సేకరణ చేశారని ఆ నోటీసులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అడ్డగోలుగా భవన నిర్మాణం చేశారని అధికారులు తెలిపారు. వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

News June 22, 2024

సింహాచలం: వైభవంగా మూడో విడత చందన సమర్పణ

image

జ్యేష్ఠ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్నకు మూడో విడత చందన సమర్పణను అర్చకులు వేద పండితులు వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామికి విశేష పూజలు చేశారు. అక్షయ తృతీయనాడు మొదట విడత, వైశాఖ పౌర్ణమి నాడు రెండో విడత చందన సమర్పణ జరగగా నాలుగవ విడత జూలై 21వ తేదీన జరుగుతుందని ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ తెలిపారు.