Visakhapatnam

News June 20, 2024

విశాఖలో పెరుగుతున్న టమాటో, ఉల్లి ధరలు

image

టమాట ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు వాటిని కొనలేక ఇబ్బంది పడుతున్నారు. గోపాలపట్నం రైతు బజార్‌లో బుధవారం కిలో టమాట రూ.58కి విక్రయించారు. బయట మార్కెట్లో కిలో ధర రూ.75 వరకు ఉందని వినియోగదారులు తెలిపారు. టమాటోతో పాటు ఉల్లి ధర కూడా కిలో రూ. 50 దాటింది. రోజు కూరల్లో వినియోగించే వీటి ధరలు తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.

News June 20, 2024

అనకాపల్లి: 24 నుంచి ‘మీ కోసం’ కార్యక్రమం

image

ఈ నెల 24 నుంచి ‘మీకోసం’ కార్యక్రమాన్ని అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి బదులుగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News June 19, 2024

విశాఖ: గంజాయి నిర్మూలనకు 100 రోజుల యాక్షన్ ప్లాన్

image

గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలనకు గట్టి చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశించారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కమిషనర్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. గంజాయి మాదకద్రవ్యాల నివారణపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించారు.

News June 19, 2024

పాడేరులో విషాదం

image

అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్త పాడేరు సమీపంలో నూతిలో ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం కొందరు యువకులు కొత్త పాడేరు నుయ్యి వద్ద మద్యం సేవించారు. ఓ స్నేహితుడి సెల్ నూతిలో పడిపోవడంతో తాను దిగి తీస్తానని గంగ పూజారి అశోక్ కుమార్ అనే యువకుడు నూతిలో దిగాడు. తిరిగి పైకి రాలేదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. పాడేరు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 19, 2024

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: పల్లా శ్రీనివాసరావు

image

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు. గాజువాక శ్రీనగర్‌లో ఓ ప్రైవేట్ కళాశాలలో డ్రగ్స్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్థాలను ఆయన వివరించారు. వీటిని పూర్తిగా నిర్మూలించడంపై పోలీసులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మేకా సత్తిబాబు పాల్గొన్నారు.

News June 19, 2024

హోం మంత్రి అనిత హెచ్చరిక

image

గంజాయి, అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపుతామని వంగలపూడి అనిత హెచ్చరించారు. హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్చాల్సి ఉందన్నా ఆమె..పోలీస్ స్టేషన్లలో సదుపాయాలను పెంచుతామన్నారు. ఈ ఐదేళ్లలో పనిచేసిన వారు మాత్రమే ఉంటారని హెచ్చరించారు. చట్ట ప్రకారం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. లా&ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు.

News June 19, 2024

వైసీపీ అక్రమాలపై విచారణ జరిపిస్తాం: సీఎం రమేశ్

image

ఉత్తరాంధ్రలో వైసీపీ చేసిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఎంపీగా గెలిచిన రమేశ్‌ను విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రవీందర్ అధ్యక్షతన నాయకులు మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుషికొండపై 10 ఎకరాల్లో విలాసవంతమైన కట్టడాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎక్కడా లేని విధంగా విశాఖలో భూదందాలు జరిగాయన్నారు.

News June 19, 2024

PHOTO: కేజీహెచ్‌లో గుండెలు పిండేసిన ఘటన

image

విశాఖ కేజీహెచ్‌లో మంగళవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శిరీష గర్భిణి మంగళవారం తన కుటుంబీకులతో కేజీహెచ్‌లో ప్రసూతి విభాగంలో చేరింది. అనంతరం ఆమె నెలలు నిండకుండా బిడ్డకు జన్మనివ్వగా.. ఆ శిశువును పిల్లల వార్డుకు అనుసంధానంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి నర్స్ ముందు వెళ్ళగా సిలిండర్ మోస్తూ తండ్రి వెనుక వెళ్ళారు.

News June 19, 2024

ఈనెల 21న హిందూస్థాన్ షిప్‌యార్డ్ వ్యవస్థాపక వేడుకలు

image

హిందుస్థాన్ షిప్ యార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈనెల 21వ తేదీన నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు మంగళవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం చేశారు. వేడుకల్లో భాగంగా ఉద్యోగులకు అత్యవసర వైద్య సేవలు అందించే యార్డులో ఆసుపత్రిని ఆధునీకరించారు. ఉద్యోగుల నివాస సముదాయంలో 36 క్వార్టర్స్‌ను 3 దశలో మరమ్మతులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

News June 19, 2024

విశాఖ: ఖరీఫ్ సీజన్‌లో రూ.460 కోట్లు పంట రుణాలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 20వేల మంది రైతులకు రూ. 460 కోట్ల పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ డీవీఎస్ వర్మ తెలిపారు. విశాఖ బ్యాంక్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.319.12 కోట్ల షార్ట్ టర్మ్ పంట రుణాలు అందజేసినట్లు వెల్లడించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 30 బ్రాంచ్‌లు ఉన్నట్లు పేర్కొన్నారు.