India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానించే ప్రధాన రహదారుల పనులను గడువులోగా పూర్తి చేయాలని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్‌లోని 7 రహదారుల పురోగతిని ప్రతి 15 రోజులకు సమీక్షించనున్నట్లు తెలిపారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్, వుడా పార్క్‌లో స్కేట్ బోర్డ్ పనులు కూడా సకాలంలో పూర్తిచేయాలని సూచించారు.

రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు గురువారం రవాణా శాఖ అధికారులు విశాఖలో పలు చోట్ల తనిఖీలు చేశారు. 36 వాహనాలను తనిఖీ చేశారు. రహదారి నియమాలు పాటించకుండ, పర్మిట్ నియమాలను అతిక్రమించి తిరుగుతున్న ఒక బస్సుపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో టాక్స్, పెనాల్టీ రూపేణా 2,45,000 వసులు చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి జగదీశ్ అడహళ్లిని విశాఖపట్నం నగర డీసీపీ-1గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో UPSCలో 440వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అధికారి అయిన ఆయన, మొదట అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఏఎస్పీగా పనిచేసిన జగదీశ్ అడహళ్లి తాజా బదిలీతో విశాఖ డీసీపీ-1 నియమితులయ్యారు.

భవనం నిర్మించుకుంటే డబ్బులు ఇవ్వాలంటూ ముగ్గురు బెదిరిస్తున్నారని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రాంజీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ తన ఇంటిపై అదనపు అంతస్తు నిర్మిస్తుండగా ఇదే ప్రాంతానికి చెందిన నర్సింగరావు, అరుణ్ బాబు, శంకర్రావు బెదిరించడం వల్లే తాను అత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. దీంతో కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖ రైతు బజార్‌లలో కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు గురువారం విడుదల చేశారు. వాటి వివరాలు (రూ.కిలో) టమాటా రూ.30, ఉల్లిపాయలు రూ.20/22, వంకాయలు రూ.40/44/54, బెండకాయ రూ.54, మిర్చి రూ.40, కాకరకాయ రూ.36, అనపకాయ రూ.26, క్యాబేజీ రూ.24, దొండ రూ.42, బీన్స్ రూ.66, పోటల్స్ రూ.62, చిలకడ రూ.30, కంద రూ.52, బద్ద చిక్కుడు రూ.66, తీపిగుమ్మిడి రూ.30, కరివేపాకు రూ.50, బీరకాయ రూ.46గా ఉన్నాయి.

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 83 పునరాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో 1,516 మంది ఆశ్రయం పొందారు. ములగాడ మండలంలో 7 పునరావాస కేంద్రాల్లో 782 మంది ఆశ్రయం పొందారు. మహారాణిపేటలో 7 పునరావాస కేంద్రాల్లో అత్యధికంగా 520 మంది ఆశ్రయం పొందారు. సీతమ్మధార మండలంలోని 7 పునరావస కేంద్రాల్లో 82 మందికి ఆశ్రయం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 22 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆనందపురం మండలంలో 8, పద్మనాభం మండలంలో 6, భీమిలి మండలంలో 3, గోపాలపట్నం మండలంలో 2, పెదగంట్యాడ మహారాణిపేట విశాఖ రూరల్‌లో ఒక్కొక్క ఇల్లు దెబ్బతిన్నట్లు నివేదికలో తెలిపారు. వీటిలో పూర్తిగా దెబ్బతిన్నవి 2 ఉన్నట్లు చెప్పారు.

తుపాన్ కారణంగా విశాఖపట్నం జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుపాను బుధవారం మధ్యాహ్నం తీరం దాటినప్పటికీ, ఈదురు గాలులతో వర్షం భారీగా పడే అవకాశం ఉందని.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మొంథా తుపాన్ నేపథ్యంలో చాలా రైళ్లు రద్దు చేసినప్పటికీ సుమారు 8 రైళ్లు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిలో బెంగళూరు నుంచి బయలుదేరే అగర్తలా హంసఫర్ (12503) సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సుమారు 14 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలు విశాఖకు బుధవారం ఉదయం నాలుగు గంటల 10 నిమిషాలకు రావాల్సి ఉంది. అయితే సుమారు రాత్రి 7 గంటలకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశుద్ధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్లపై గుంతలు పూడ్చడం, ల్యాండ్ స్లయిడింగ్ జరిగిన చోట రోడ్‌ల పునరుద్ధరణపై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.