India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జీవీఎంసీకి బకాయి ఉన్న ఆస్తి పన్ను పూర్తిగా చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ పొందవచ్చు అని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. నగరవ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు అవుతున్నప్పటికీ స్థానికేతర గృహ బకాయిలు ఉండిపోతున్నాయని పేర్కొన్నారు. వీటిని వసూలు చేసేందుకు జీవీఎంసీ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన శ్రావణి (26) ఫిబ్రవరి నెలలో అదృశ్యం కాగా, విశాఖ టూటౌన్ పోలీసులు ఆచూకీ కనిపెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆమె డాబాగార్డెన్స్‌లో ఉన్నట్లు గుర్తించి తెలంగాణ పోలీసులకు అప్పగించారు. ప్రేమ వివాహం చేసుకుని ఇక్కడ సెటిల్ అవ్వాలని వచ్చినట్లు సీఐ ఎర్రం నాయుడు కౌన్సెలింగ్‌లో తేలింది. విశాఖ పోలీసుల చాకచక్యాన్ని సీపీ శంఖబ్రత బాగ్చి, ఉన్నతాధికారులు అభినందించారు.

విశాఖలో DROగా పనిచేసి సరెండర్ అయిన భవానీ శంకర్‌కు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. గతేడాది RDO శ్రీలేఖతో విభేదాల కారణంగా ఇద్దరినీ సరెండర్ చేశారు. అప్పటి నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్న ఆయనను కాకినాడ జిల్లా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి వైఎంసీఏ బీచ్ సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 50 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. త్రీటౌన్ సీఐ పైడయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని గుర్తించిన వారు వెంటనే త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత ఎన్నికల్లో పరస్పర విమర్శలతో హోరెత్తించిన గంటా, అవంతి శ్రీనివాసరావు ఈ వేడుకలో చెట్టాపట్టాల్ వేసుకొని కనిపించడం విశేషం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

విశాఖ జిల్లాలో కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న డీఆర్‌వో పోస్టును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. కడప జిల్లా డీఆర్‌వో (స్పెషల్ గ్రెడ్ డిప్యూటీ కలెక్టర్)గా ఉన్న ఎం.విశ్వేశ్వర నాయుడును విశాఖకు బదిలీ చేసింది. గతేడాది అక్టోబర్‌లో ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్‌వో భవాని శంకర్ మధ్య విభేదాల కారణంగా ఇద్దరినీ రిలీవ్ చేశారు. అప్పటి నుంచి పోస్టు ఖాళీగా ఉండగా, తాజా నియామకంతో అనిశ్చితికి ముగింపు పలికింది.

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తనదైన శైలిలో కొరడా ఝలిపిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లు గోపికృష్ణ, అగస్టీన్, శివకృష్ణ, సుధాకర్‌లను నగరంలోని పలు స్టేషన్‌లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాలుగు రోజులు ముందే డీవోలు సిద్ధమైనా.. సంబంధిత స్టేషన్‌కు ఆలస్యంగా అందాయి.

విశాఖపట్నం నుంచి నడిచే రెండు ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే క్రమబద్ధీకరించింది. విశాఖ-SMVT బెంగళూరు (18509/10) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం, విశాఖ-చర్లపల్లి (18527/28) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటాయి. బెంగళూరు రైలు రేణిగుంట మీదుగా, చర్లపల్లి రైలు వరంగల్ మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ శాశ్వత సేవలను వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది.
Sorry, no posts matched your criteria.