India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికి రుషికొండ భవనాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఋషికొండ భవనంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సచివాలయ భవనాలకు ఇచ్చిన రేటు కంటే తక్కువ రేటుకే రుషికొండ భవనాలు నిర్మించామన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణపై చిత్తశుద్ధి ఉంటే శనివారం జరిగే జనసేన సభలో తీర్మానం చేయాలన్నారు.
వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యాంబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండపాల నిర్వాహకులు లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్లతోనే పనులు చేయించాలని సూచించారు. తగిన సామర్థ్యం ఉన్న ఫ్యూజ్ వాడాలని, ఓవర్ లోడ్ అవ్వకుండా చూసుకోవాలని అన్నారు. ఎంసీబీలు, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్లు ఉపయోగించాలని అన్నారు. నాణ్యమైన వైర్లు వాడాలన్నారు.
విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు కుప్పం బయలుదేరారు. విమానాశ్రయంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, హోం మంత్రి, ఎమ్మెల్యేలు ఇతర అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
నక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన కోటిలింగాల వినాయకుని ప్రతిమపై గాజువాకకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సాహితి కోర్టుకెక్కింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో బొమ్మ ఏర్పాటు చేయండంతో పర్యావరణానికి హాని కలుగుతుందని న్యాయ పోరాటానికి దిగింది. విగ్రహం తయారీ సమయంలో POPవాడొద్దని కోరినా వినకపోవడంతో లంబోదర ట్రస్ట్‌కు తండ్రి సహకారంతో కోర్టు నోటీసులు పంపింది. ట్రస్టు వారు కోటి మొక్కలు నాటాలని ఆనోటీసులో డిమాండ్ చేసింది.
సీఎం చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. శుక్రవారం కోస్టల్ బ్యాటరీ వద్దకు హెలిపాడ్‌లో చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం నోవాటెల్‌కు బయలుదేరి వెళ్లారు.
మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాడబలిజ మత్స్యకారులు, ప్రమాద బాధితులు, ఉద్యోగం కోరిన దివ్యాంగులు, ఉత్సవ నిర్వాహకులు, స్థానిక సమస్యలు వివరించిన పౌరుల అభ్యర్థనలను విని మంత్రి స్పందించారు.
విశాఖలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిప్పంటిచుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఆరిలోవలో జరిగింది. ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అందరూ చూస్తుండగానే తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు, 108కి సమాచారం అందిచారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అతడిని 108లో KGHకి తరలించారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగా ఈ అఘాయత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
ఈసారి విశాఖ వస్తే మీ ఇంట్లోనే నిద్ర చేస్తా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కార్యకర్తను ఉద్ధేశించి మాట్లాడారు. వివరాల్లోకి వెళితే.. కార్యకర్తల ఇంటిలో ఒక రోజు నిద్ర చేసి వారి కష్టాలను తెలుసుకోవాలని గాజువాకకు చెందిన జనసేన కార్యకర్త సురేశ్ కుమార్ పవన్‌ను కోరారు. ఈ ఆలోచన నచ్చడంతో ఈసారి విశాఖ వస్తే సురేశ్ ఇంట్లోనే నిద్ర చేస్తానంటూ నిన్న జరిగిన సమావేశం అనంతరం పవన్ అన్నారు.
విశాఖలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ హాజరుకానున్నారు. సిరిపురంలోని వుడా బాలల ప్రాంగణంలో రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గిడుగు రామ్మూర్తి పురస్కార విజేతలను సత్కరిస్తారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అమరావతి నుంచి విశాఖ వైపు రాజకీయ నాయకులు, అధికారుల దృష్టి మళ్లింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖకు మరిన్ని వరాలు ప్రకటిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.