Visakhapatnam

News August 13, 2024

ఉత్తరాంధ్ర వైసీపీలో జోష్..!

image

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్ర వైసీపీ కేడర్ నిరుత్సాహానికి గురైంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. గెలవడానికి బలమున్నా సరే టీడీపీ పోటీలో ఉంటే ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇదే సమయంలో బొత్సను వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. చివరకు పోటీ నుంచి కూటమి తప్పుకోవడంతో ఆయన గెలుపు లాంఛనం కానుంది. బొత్స లాంటి సీనియర్ నేత MLC అయితే YCPకి జోష్ వస్తుందా? మీ కామెంట్.

News August 13, 2024

దువ్వాడ మీదుగా హైదరాబాద్- సంత్రాగచ్చి మధ్య రైలు

image

దువ్వాడ మీదుగా హైదరాబాద్- సంత్రాగచ్చి మధ్య ఒక ట్రిప్పు (రానుపోను) ఏసీ ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు డీసీఎం సందీప్ తెలిపారు. 07069 ప్రత్యేక రైలు ఈనెల 14న ఉ.5.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి రాత్రి 7.30 గంటలకు దువ్వాడ, మర్నాడు మ.12.00 గంటలకు సంత్రాగచ్చి చేరుతుంది. తిరిగి 07070 ప్రత్యేక రైలు ఈనెల 15న మ.3.50కు సంత్రాగచ్చిలో బయలుదేరి మర్నాడు ఉ.5.38 గంటలకు దువ్వాడ, సా.5.30 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.

News August 13, 2024

అరకు ఎంపీ ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో సవాల్

image

అరకు ఎంపీ తనూజా రాణి ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి గీత హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో అవాస్తవాలు చూపారని ఆరోపించారు. ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న తనను ఎన్నికైనట్లు ప్రకటించాలన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తనూజాతో పాటు పదిమంది అభ్యర్థులకు, లోక్ సభ సెక్రటరీ జనరల్, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.

News August 13, 2024

పెరిగిన బొత్స ఆస్తులు

image

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నిన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆయన ఆస్తులు రూ.73.14 లక్షలు, అప్పులు రూ.95 లక్షలు మేర పెరిగాయి. మేలో ఆయన రూ.73.14 లక్షల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారు.

News August 13, 2024

విశాఖ: రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

image

విశాఖ నగరంలో పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. పాత జైలు రోడ్డులోని ఇన్నోసెంట్ బ్యాచిలర్, రాంనగర్ గ్రీన్ వ్యాలీ రెస్టోకేప్‌‌పై డివిజన్-3 ఫుడ్ సేఫ్టీ అధికారి జీవీ అప్పారావు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. నిల్వచేసిన ఆహారాన్ని గుర్తించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. దుర్వాసన వస్తున్న చికెన్ మసాలా పేస్ట్ లాలీపాప్‌లు సీజ్ చేశారు.

News August 13, 2024

విశాఖలో నేవీ మారథాన్.. డేట్ ఫిక్స్

image

వైజాగ్‌ నేవీ మారథాన్ డిసెంబర్ 15న నిర్వహించనున్నామని మారథాన్ రేస్‌ డైరెక్టర్‌ కమాండర్‌ ప్రదీప్‌ పటేల్‌ ప్రకటించారు. సోమవారం వైజాగ్‌ నేవీ మారథాన్ 9వ ఎడిషన్‌ వివరాలు వెల్లడించారు. విశాఖ రన్నింగ్‌, క్రీడా ప్రపంచం దిశగా దూసుకు వెళ్ళాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నామని ఇందులో పాల్గొనాలనుకునేవారు vizagnavymarathon.runలో రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. ఆగస్టు 15 న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని సూచించారు.

News August 13, 2024

విశాఖ డైరీ అక్రమాలపై విచారణ జరిపించాలని వినతి

image

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర ఆఫీసులో రెండో రోజు పెందుర్తి MLA పంచకర్ల రమేశ్ బాబు వినతుల స్వీకరణ జరిగింది. విశాఖ డెయిరీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని పాల ఉత్పత్తిదారులు ఫిర్యాదు చేశారు. సంఘంగా ఏర్పడిన డైరీని కంపెనీగా మార్చేశారని ఆరోపించారు. గత 10 సంవత్సరాల నుంచి రూ. 1500 కోట్లు దోచేశారని వాళ్ల అక్రమాలు కొనసాగితే డైరీపై జీవించే కుటుంబాలు రోడ్డున పడతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News August 13, 2024

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ‌లో ఏయూకు 41వ స్థానం

image

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఏయూకు ఓవరాల్ విభాగంలో జాతీయస్థాయిలో 41వ స్థానం లభించింది. స్టేట్ యూనివర్సిటీ విభాగంలో జాతీయస్థాయిలో 7వ ర్యాంకును, విశ్వవిద్యాలయాల విభాగంలో 25వ స్థానాన్ని సాధించింది. గత ఏడాది కంటే మెరుగైన స్థానాన్ని ఏయూ సాధించడం పట్ల ఏయూ ఇన్ ఛార్జ్ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు సంతోషం వ్యక్తం చేశారు. పలు ఐఐటీలు, ఎన్ఐటీలకంటే ఏయు మెరుగైన ర్యాంకింగ్ తో ముందంజలో నిలిచింది.

News August 12, 2024

విశాఖ MLC ఉపఎన్నిక.. కూటమి అభ్యర్థిపై వీడని ఉత్కంఠ..!

image

విశాఖ స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. YCP అభ్యర్థి బొత్స సత్యనారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయగా.. కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. స్పష్ఠమైన మెజార్టీతో గెలుస్తామని YCP ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే చోడవరం, యలమంచిలి, పాయకరావుపేటలో పలువురు YCP ప్రజాప్రతినిధులు TDPలో చేరారు. నామినేషన్‌కు మంగళవారం ఒక్కరోజే గడువు ఉండడంతో కూటమి అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.

News August 12, 2024

ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖాతాలో మరో మైలురాయి

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే మరో మైలు రాయిని సాధించింది. ప్రజలతో కూడిన మల్టీ మోడల్ లార్జెస్ట్ పార్ట్ అండ్ కంటైనర్‌ను విశాఖ నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ సెంట్రల్ రైల్వేలో విజయవంతంగా లోడ్ చేసింది. పవర్ వ్యాగన్ లతో కూడిన 1,080 టన్నుల రొయ్యలు ఈ కంటైనర్‌లో ఉన్నాయి. ఈ సందర్భంగా సౌరవ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సరుకు రవాణా ద్వారా రైల్వే మరింత ఆదాయ మార్గాలను సమకూర్చుకుంటోందని అన్నారు.