India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ విద్యాధరి ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ బుకింగ్‌నకు రోజువారీ అవసరము 18,184 సిలిండర్‌లు కాగా 37,920 సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్ బుకింగ్ చేసుకోవాలనన్నారు. కేవలం పుకార్ల వల్ల మాత్రమే బుకింగ్స్ పెరిగాయని ఆమె పేర్కొన్నారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విశాఖలోని 15 రైతు బజార్లలో ఆదివారం కాయగూరల ధరలు (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.8, ఉల్లిపాయలు రూ.19, కాలీఫ్లవర్ రూ.12, క్యాబేజీ రూ.12, వంకాయలు రూ.28, బెండకాయలు రూ.30, కాకరకాయలు రూ.26, క్యారెట్ రూ.28, గోరుచిక్కుడు రూ.34, బీన్స్ రూ.40, కర్ర పెండ్లం రూ.16, నిమ్మకాయలు రూ.125, గ్రీన్ పీస్ రూ.34గా ఉన్నాయి.

ఆనందపురం మండలం తర్లువాడలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్‌కు ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన చేయనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం కొమ్మాదిలోని ఒక ప్రైవేట్ కాలేజీ రజతోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ కృషితో విశాఖ ఐటీ హబ్‌గా మారుతోందని, అమెరికా వెలుపల గూగుల్ సంస్థకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంటుందని గంటా పేర్కొన్నారు.

విశాఖలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.170, స్కిన్ లెస్ రూ.310, విత్ స్కిన్ రూ.320, శొంఠ్యాం కోడి రూ.340గా కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మటన్ కేజీ రూ.1000. డజన్ గుడ్లు రూ.60 పలుకుతున్నాయి. చేపలు, రొయ్యల అమ్మకాలు అప్పుఘర్, ఫిషింగ్ హార్బర్, మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక, తదితర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ పదవికి MNVS.ప్రభాకర్ పేరును కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన NMCS స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శనివారం న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సెర్చ్-కమ్-సెలెక్షన్ కమిటీ సమావేశంలో ఐదుగురిని ఇంటర్వ్యూ చేసి ప్రభాకర్‌ను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.

విశాఖలోని అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా పలువురుని వైసీపీ కేంద్రపార్టీ కార్యాలయం నియమించింది.
➤ విశాఖ నార్త్: చింతకాయల సన్యాసి పాత్రుడు
➤ విశాఖ సౌత్: వీసం రామకృష్ణ
➤ విశాఖ వెస్ట్: జాహీర్ అహ్మద్
➤ విశాఖ ఈస్ట్: పేడాడ రమణి కుమారి
➤ గాజువాక: పసుపులేటి బాలరాజు
➤ భీమిలి: తైనాలా విజయ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

భీమిలి పరిధి కాపుల ఉప్పాడలో ఉంటున్న అప్పలరాజు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అప్పలరాజు తీవ్రంగా గాయపడడంతో గీతం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇక్కడి నుంచి కేజీహెచ్‌కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు భీమిలి పోలీసులు తెలిపారు.

శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూలు బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్లో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయనగరం (D) డెంకాడ (M) జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ మరొకరి బైక్‌పై వెళ్తుండగా స్కూలు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ డ్రైవ్ చేసినట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

మధురవాడ ఆర్టీసీ కాలనీ సాయిప్రియ నివాస్ సమీపంలో స్వతంత్రనగర్‌కు చెందిన కారు డ్రైవర్ కుమ్మరపు రవి (41) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. గురువారం ఇంటి నుంచి వెళ్లిన ఆయన, శుక్రవారం ఉదయం పొదల్లో మృతదేహమై కనిపించారు. వాంబే కాలనీ వద్ద కారు నిలిపి, నడుచుకుంటూ వచ్చి అక్కడ పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రవి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.