India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్యను గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మర్యాదపూర్వకంగా కలిసారు. మంత్రి అమర్నాథ్ సోమవారం చింతలపూడి ఇంటికి వెళ్లి ఈ ఎన్నికలలో సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై ఇరువురు చర్చించుకున్నారు. తన విజయానికి కృషి చేస్తానని చింతలపూడి హామీ అమర్నాథ్ తెలిపారు.

భారత్, యూఎస్ మధ్య రక్షణ బంధం బలోపేతానికి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలో టైగర్ ట్రయాంఫ్–2024 సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 31 వరకూ రెండు ఫేజ్‌లలో విన్యాసాలు జరగనున్నాయి. యూఎస్‌కు చెందిన యూఎస్‌ఎస్ సోమర్‌సెట్ యుద్ధ నౌకతో పాటు ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు, యూఎస్ మెరైన్ కార్ప్స్, ఎమ్మార్కెడ్ దళాలు విశాఖకు చేరుకున్నాయి.

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రతి అంశంపైనా సంపూర్ణ అవగాహనతో విధులు సక్రమంగా నిర్వర్తించాలని అధికారులను జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున ఆదేశించారు. ఎన్నికల నిర్వాణపై జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన వివిధ మానిటరింగ్ కేంద్రాలను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా నెరవేర్చాలన్నారు.

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ములకలపల్లిలో విద్యుత్ షాక్‌కి గురై మృతి చెందిన సచివాలయ ఉద్యోగి డి.చిరంజీవి కుటుంబానికి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చెక్కుని మృతుడి భార్య హేమలతకు దేవరాపల్లి హెచ్‌డీటీ డీ.ఆనంద్ రావు సోమవారం అందజేశారు. ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా కటౌట్లు తొలగిస్తూ విద్యుత్ షాక్‌తో చిరంజీవి ఆదివారం మృతి చెందాడు.

గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో వాలంటీర్స్ చేస్తున్న ప్రచారంపై ఎంపీడీవో రత్నకుమారి ఆధ్వర్యంలో సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాలంటీర్స్ ప్రచారం చేయడంపై విచారణ చేపట్టామని, నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్, ఈవోపీఆర్డీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖ జిల్లాలో నేటి నుంచి ఓపెన్ స్కూల్ లో 10వ తరగతి ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2: 30 గంటల నుంచి 5: 30 గంటల వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. 10వ తరగతికి 986 మంది, ఇంటర్ కు 1215 మంది విద్యార్థులు హాజరవుతారని డీఈవో చంద్రకళ తెలిపారు. వీరి కోసం 11 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

చోడవరం నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, టీడీపీ అభ్యర్థి కేఎస్ఎంఎస్ రాజు నాలుగవసారి పోటీ పడనున్నారు. 2009,2014లో చోడవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు చేతిలో కరణం ధర్మశ్రీ ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన ధర్మ శ్రీ, టీడీపీ అభ్యర్థి రాజును ఓడించారు. 2024 లో మళ్లీ వీరిద్దరూ తలపడుతున్నారు. ఈసారి గెలుపు ఎవరిదో కామెంట్ చేయగలరు.

పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆదివారం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీపై ఎన్నికల అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. ర్యాలీలో 100 మంది పాల్గొంటారని ఎమ్మెల్యే వర్గీయులు ముందుగా అనుమతి తీసుకున్నారు. కానీ అంతకుమించి కార్యకర్తలు, నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ర్యాలీని చిత్రీకరించారు. నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు జారీ చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని ప్రజలు, ఫిర్యాదుదారులు గమనించాలని అన్నారు.

మన్యం ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించడానికి ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్ళి సింహాచలం నాయుడు, మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగుళ్ళి ఉషారాణి అధ్యక్షతన ఆదివారం అమ్మవారి ఆలయంలో పురోహితులు సుబ్రహ్మణ్యశాస్త్రి ఆయా తేదీలను నిర్ణయించారు. త్వరలో ఉత్సవ కమిటీ వేయనున్నారు.
Sorry, no posts matched your criteria.