Visakhapatnam

News March 3, 2026

విశాఖ: బీచ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

image

ఆర్కే‌బీచ్‌లోని సుప్రీం హోటల్ ఎదురుగా అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు జగదాంబ సమీపంలో నివాసం ఉండే ఎం.శ్రీధర్ (36)గా పోలీసులు గుర్తించారు. శ్రీధర్ కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

News March 3, 2026

విశాఖ: బర్త్‌డే.. డెత్‌ డే

image

ఆరిలోవ హెల్త్ సిటీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు <<19282896>>మృతి చెందిన<<>> విషయం తెలిసిందే. మృతుడు విజయనగరం (D) గజపతినగరం (M) రామన్నపేటకు చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. సాయికిరణ్ ఉషోదయ జంక్షన్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం తన పుట్టినరోజు కావడంతో బైక్‌పై సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్సై ధర్మేందర్ తెలిపారు.

News March 3, 2026

విశాఖ: కోస్టల్ కారిడార్‌పై మల్లగుల్లాలు..

image

భోగాపురం విమానాశ్రయానికి ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు VMRDA ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష జరిగింది. ఎయిర్‌పోర్ట్ అనుసంధాన మార్గాలు, విశాఖ పోర్టు నుంచి విమానాశ్రయం వరకు కొస్టల్ కారిడార్ ప్రతిపాదనపై MPలు, MLAలు, విశాఖ, విజయనగరం కలెక్టర్లు చర్చించారు. అమలుపై ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు, సూచనలు చేశారు. భూసేకరణ, మార్గ రూపకల్పన అంశాల్లో స్పష్టత అవసరమని అభిప్రాయపడినట్టు తెలిసింది.

News March 2, 2026

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష

image

జిల్లావ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు శాంతియుతంగా ముగిశాయని DEO ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. మొత్తం 972 మంది అభ్యర్థులకు గాను 884 మంది హాజరు కాగా, 88 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షల కోసం 6 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు

News March 2, 2026

టీడీఆర్‌ల మంజూరులో అవినీతికి తావివ్వొద్దు: ప్రణవ్

image

వీఎంఆర్డీఏ చేపడుతున్న పనుల్లో అధికారులు నిర్లక్ష్యం ఆలసత్వం చూపించవద్దని కమిషనర్ తేజ్ భరత్ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఆయన కార్యాలయంలో సోమవారం అధికారులతో అభివృద్ధి పనులు, లేఅవుట్లు, రహదారి విస్తరణ పనులపై సమీక్ష చేశారు. విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి టీడీఆర్‌ల మంజూరులో అవినీతి ఉండకూడదన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు

News March 2, 2026

కలెక్టర్ పీజీఆర్ఎస్‌కు 252 వినతులు

image

విశాఖలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్‌కు 272 మంది ఫిర్యాదులు చేశారని అధికారులు తెలిపారు. ఫిర్యాదులను స్వయంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి బాధితుల నుంచి స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులను పిలిచి కలెక్టర్ అందజేయగా జీవీఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఇతర ఫిర్యాదులపై క్షుణ్ణంగా పరిశీలించారు.

News March 2, 2026

వర్క్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయండి: విష్ణుకుమార్ రాజు

image

GVMC ఇంజనీరింగ్ విభాగంలో 15 ఏళ్లకు పైగా ఒకే వార్డులో పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లను తక్షణమే బదిలీ చేయాలని మేయర్, కమిషనర్‌ను MLA విష్ణుకుమార్ రాజు కోరారు. 5-15 ఏళ్ల వరకు బదిలీ లేకుండా కొనసాగుతున్న వారిలో కొందరు కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో అభివృద్ధి పనుల్లో అవినీతి చోటుచేసుకుంటోందని అన్నారు. పారదర్శకత కోసం వెంటనే బదిలీలు చేపట్టాలని కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు.

News March 2, 2026

విశాఖ: కాంట్రాక్టర్లుగా వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు..!

image

GVMC ఇంజినీరింగ్ విభాగంలో కొందరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు అనుబంధ కాంట్రాక్టర్ల పేర్లతో టెండర్లు వేసి పనులు దక్కించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల కొలతలు తీసి ఎం-బుక్ నమోదు కోసం ఏఈలకు అందజేస్తున్నారని సమాచారం. ఏటా రూ.500 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు జోన్‌లలో ఇదే తీరుగా వ్యవహారం సాగుతోందని విమర్శలున్నాయి. వీరిపై ఫిర్యాదులు చేరినా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

News March 2, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గతవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.

News March 1, 2026

రేపు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ

image

విశాఖలో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు 8688400499 నంబర్‌కు ఫోన్ చేసి సీఎండీ పృథ్వీతేజ్‌కి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. విద్యుత్ సరఫరా, కొత్త సర్వీసులు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేసేవారు తమ సర్వీస్ నంబరును సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.