Visakhapatnam

News February 27, 2026

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: విశాఖ సీపీ

image

మాదకద్రవ్యాలకు బానిసవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తు, అవకాశాలు కోల్పోతారని సీపీ శంఖబ్రత బాగ్చి యువతను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకునేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.. ప్రతీ విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వారియర్స్‌గా మారాలన్నారు.

News February 27, 2026

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: విశాఖ సీపీ

image

మాదకద్రవ్యాలకు బానిసవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తు, అవకాశాలు కోల్పోతారని సీపీ శంఖబ్రత బాగ్చి యువతను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకునేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.. ప్రతీ విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వారియర్స్‌గా మారాలన్నారు.

News February 27, 2026

రైల్వేస్టేషన్‌లో స్పృహ కోల్పోయిన వ్యక్తి మృతదేహం ఇంకా మార్చురిలోనే

image

విశాఖ రైల్వేస్టేషన్‌లో ఈ నెల23న ప్లాట్ఫారం1 గేట్ నం.3 సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ వ్యక్తిని రైల్వేపోలీసులు గమనించి KGHకి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. ఆ మృతదేహం ఇంకా KGH మార్చూరిలో ఉండగా, మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే GRP పోలీసులను సంప్రదించాలని కోరారు.

News February 26, 2026

FLNAT పరీక్షకు హాజరుకావాలి: కలెక్టర్

image

విశాఖలో ఫిబ్రవరి 28న వయోజన విద్యార్థులకు ప్రీ-ఫైనల్ FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉల్లాస్, అక్షరాంధ్ర పథకాల కింద 15 ఏళ్లు పైబడిన వారికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News February 26, 2026

రుషికొండ: ప్రమాదవశాత్తు సముద్రంలో పడి యువకుడి మృతి

image

రుషికొండ సమీపాన బేపార్క్ వద్ద ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన స్వప్నిల్ చౌహాన్ (25) స్నేహితులతో కలిసి విశాఖ వచ్చాడు. గురువారం మధ్యాహ్నం బీచ్ వద్ద ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయినట్లు స్నేహితులు తెలిపారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 26, 2026

విశాఖ :రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.05 కోట్లు అందజేత

image

రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్&రన్‌లో చనిపోయిన ఎలమంచిలి రాజు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, దువ్వాడకు చెందిన అను, తరిణి లక్ష్మి, మెంటాడకు చెందిన సురేశ్ యాక్సిడెంట్‌లో గాయపడడంతో వారి ఖాతాలో రూ.50వేలు చొప్పున జమ చేశామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో హిట్ & రన్‌‌ కేసుల్లో 129 మంది బాధితులకు మొత్తం రూ.1.05 కోట్లు అందించామన్నారు.

News February 26, 2026

విశాఖ: ‘స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలి’

image

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ప్ర‌జ‌ల‌కు విస్తృత స్థాయిలో స‌మాచారం చేరవేయాల‌నే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక క్యాలెండర్‌ను సంబంధిత అధికారుల‌తో క‌లిసి గురువారం విశాకలోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు పారదర్శకత, సాంకేతిక వినియోగం, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

News February 26, 2026

బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో జీవీఎంసీ విజయం

image

బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్ 2025-26లో ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 630 నగరాలలో విశాఖపట్నం (GVMC) టాప్ 24 విజేతలలో ఒకటిగా నిలిచింది. ఈ ఘనత సాధించినందుకు నగరానికి $1 మిలియన్ నిధులు లభించాయని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ నిధితో ‘ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్’ ద్వారా వరదలు, తుపాన్లు, తీవ్రమైన ఎండల నుంచి నగరాన్ని రక్షించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు.

News February 26, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌పై కలెక్టర్ సీరియస్(2/2)

image

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ అవినీతి జిల్లా కలెక్టర్‌కే చిర్రెత్తు కొచ్చేలా చేస్తోంది. పీజీఆర్ఎస్‌లో ప్రతీవారం పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిచి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పీక్కుతింటే సహించేది లేదని, పనిచేయకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వీళ్లలో కొంత మందికి ఇప్పటికే రెండు సార్లు మెమోలు కూడా అందడం గమనార్హం.

News February 26, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో అవినీతి ఆరోపణలు(1/2)

image

విశాఖ నగరంలో భవన నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో GVMC టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు, ప్లాన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు రూ. లక్షల్లో ముడుపులు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధనం ఉంటే వేగంగా, లేకపోతే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా కొందరికి త్వరితగతిన అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.