Visakhapatnam

News April 14, 2025

 యువత అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ

image

నేటితరం యువత అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని విశాఖ సీపీ శంఖబ్రాత బాగ్చి అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీపీ కార్యాలయంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్ర పటానికి సీపీ పూల మాలల వేసి నివాళులు అర్పించారు. దళితుల, గిరిజనులు, బహుజనుల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల రక్షణ కోసం రాజ్యాంగంలో అనేక ప్రతిపాదనలు రూపొందించారన్నారు.

News April 14, 2025

కంచరపాలెం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

నగరంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక ఉమెన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎగ్జామ్స్ రాసింది. జువాలజీ సబ్జెక్టు పోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. తల్లి గమనించి కిందకు దించేసరికే ఆమె మరణించింది. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2025

ఆరిలోవ: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

ఆరిలోవ చిన్నగదిలి జేమ్స్ ఆసుపత్రి సమీపంలో బీఆర్టీఎస్ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. మృతుడు ఒడిశాకు చెందిన బిజయ్‌ముండా(60)గా గుర్తించారు. అతడు కోడలిని తీసుకొని హెల్త్ సిటీలోని ఓ హస్పిటల్‌కు ఆదివారం తీసుకొచ్చారు. ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

News April 14, 2025

‘కేజీహెచ్‌లో అందుబాటులో అన్నిరకాల మందులు’

image

కేజీహెచ్‌లో రోగులకు అందుబాటులో అన్ని రకాల మందులు ఉన్నాయని సూపరింటెండెంట్ శివానంద్ ఆదివారం తెలిపారు. కెజీహెచ్‌లో రూ.1.5 కోట్ల విలువ గల అన్ని రకాల మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి రోగులకు అందుబాటులో తీసుకువచ్చామన్నారు. రోగులకు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ మందులను వారం రోజులకు సరిపడనట్లు ఇస్తున్నామన్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు 90 రోజులకు సరిపడే విధంగా మందులు ఇస్తున్నామన్నారు. 

News April 13, 2025

జలపాతంలో పూర్ణామార్కెట్ యువకులు గల్లంతు

image

అనకాపల్లి జిల్లా సరిహద్దులోని సరియా జలపాతంలో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విశాఖ పూర్ణ మార్కెట్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం చూసేందుకు రాగా, వారిలో ఇద్దరు జలపాతంలో గల్లంతయ్యారు. దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు యువకులు వెళ్ళగా.. ఘటనా ప్రదేశం అనంతగిరి పీఎస్ లిమిట్స్‌లో ఉందని తెలుసుకుని అక్కడ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2025

కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన హోం మంత్రి

image

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఐదుగురు కైలాసపట్నం అగ్ని ప్రమాద బాధ్యతల్ని ఆదివారం హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఘటన జరగడం బాధాకరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్‌ని ఆదేశించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తుందని ఆమె వెంట అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు.

News April 13, 2025

విశాఖ జూలో 27 జింకల జననం

image

విశాఖ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలలో 27 జింకలు పుట్టినట్లు క్యూరేటర్ మంగమ్మ ఆదివారం తెలిపారు. జూ పార్క్‌లో జంతువుల సంతానోత్పత్తి, పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. వీటిలో ఒక మౌస్ డీర్, రెండు బార్కింగ్ డీర్, మూడు నీల్‌ ఘై, ఐదు సాంబార్ డీర్, ఏడు స్పాటెడ్ డీర్, తొమ్మిది బ్లాక్ బక్స్ ఉన్నాయన్నారు. జూ సందర్శకులు ఈ అందమైన జింకలను చూసేందుకు మరికొద్ది రోజుల్లో అవకాశం కల్పిస్తామన్నారు.

News April 13, 2025

విశాఖలో కళారూపాల శంఖారావం

image

అంబేడ్క‌ర్ జయంతి సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం పేరుతో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలో కళాకారులతో కళారూపాల శంఖారావం నిర్వహించారు. విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలోని అంబేడ్క‌ర్ విగ్రహం వద్ద ప్రారంభమైన శంఖారావం ర్యాలీని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. 

News April 13, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: విశాఖ కలెక్టర్

image

ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంబేడ్క‌ర్ జయంతి సందర్భంగా రేపు(ఏప్రిల్14న) రద్దు అయినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వం అంబేడ్క‌ర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించడంతో ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ ఆఫీస్‌తో పాటు, జీవీఎంసీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న పీజీఆర్ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

News April 13, 2025

విశాఖ మీదుగా వెళ్లే రైళ్ల దారి మళ్లింపు

image

ఖుర్దా డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనుల వలన విశాఖ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ ఆదివారం తెలిపారు. ఈనెల16 నుంచి 23వరకు విశాఖ -హిరకుడ్(20807/08), భువనేశ్వర్ – LTT (12879/80), (22865/66), (20471/72), (20823/24), (22827/28), (20861/62) నంబర్ గల రైళ్లు విజయనగరం, తిట్లాఘర్, సంబల్పూర్ మీదుగా ఝార్సుగూడ చేరుకుంటాయన్నారు.