India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో రుషికొండకు చేరుకుంటారు. గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలిస్తారు. తర్వాత అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వెళతారు. అక్కడ సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం 4.30 గంటలకు కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్లో ఎయిర్పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్తారు.
అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవాన్ని శుక్రవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. సింహాద్రి అప్పన్న ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా అలంకరించి వాహనంపై అధిష్టింప చేసి మాడవీధుల్లో వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు మధ్య ఊరేగించారు. భక్తులు పలువురు స్వామిని దర్శించుకున్నారు.
ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి క్రైమ్ ఎస్ఐ ఎన్.జగదీశ్‌ను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ సస్పెండ్ చేశారు. ఇదే సంఘటనపై ద్వారక క్రైమ్ సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ డి.బంగారుపాపపై శాఖపరమైన చర్యలకు మేజర్ పీఆర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు 79950 95799 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సీపీ పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఇద్దరు ట్రాఫిక్ ఎస్ఐలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాఖ- విజయవాడ-విశాఖ మధ్య జన్ సాధారణ్ రైళ్లను(అన్ రిజర్వుడు) శుక్రవారం నుంచి నడుపుతున్నారు. విశాఖ -విజయవాడ-విశాఖ మధ్య 1,3,4,6,8,10,11,13 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, స్టేషన్ల మీదుగా నడుస్తాయన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కుదేలైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు జెట్ స్పీడ్‌లో అభివృద్ధి దిశగా తీసుకు వెళుతున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఎంవీపీ కాలనీ తన నివాసంలో మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్‌కు వచ్చే నెలలో శంకుస్థాపన జరగనున్నదని వెల్లడించారు. రూ.75 వేల కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరాన్ని రెండేళ్లలో పూర్తిచేసేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించారన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సదస్సును అల్లూరి విజ్ఞానం కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు మాట్లాడుతూ విద్యార్థి, యువత భగత్ సింగ్ స్ఫూర్తితో ఆందోళనలతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాడుదామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కోసం విద్యార్థి యువజన సంఘాలు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు.
ఈ నెల 2 నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గల శివాలయాల్లో భక్తుల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత తెలిపారు. విశాఖ తన కార్యాలయంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 210 శివాలయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కార్తీక సోమవారాల్లో శివాలయాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ, తాగునీరు మజ్జిగ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.
అనకాపల్లిలో దీపావళి రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. బాలాజీ రావు పేటలోని ఎలక్ట్రికల్ షాప్‌లో జరిగిన ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని దుకాణదారులు వాపోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదంలో ఎలక్ట్రికల్ సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. విశాఖకు చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో అతడి ధర కేవలం రూ.20 లక్షలు మాత్రమే.
నవంబర్ 02న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఇతర అధికారులతో కలిసి సీఎం హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే కోస్టల్ బ్యాటరీ ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. కోస్టల్ బ్యాటరీ వద్దకు శనివారం మధ్యాహ్నం చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కలెక్టరేట్‌కు వస్తారని అన్నారు.
Sorry, no posts matched your criteria.