Visakhapatnam

News August 1, 2024

విశాఖ: హార్ట్ బ్రేకింగ్ PHOTO

image

పద్మనాభం మండలం పొట్నూరు గ్రామంలో విషాదం నెలకొంది. సొంతపొలంలో ఆకు తీస్తుండగా సబంగి బద్రి (40) అనే వ్యక్తి ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు. పక్కన ఎవరూ లేకపోవడంతో మరణించాడు. అప్పటి వరకు తల్లిదండ్రులు ఉండగా.. ఫిట్స్ రావడానికి కొద్దిసేపటి క్రితమే వారు భోజనానికి వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మరణించిన వ్యక్తికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News August 1, 2024

ఏయూ: ఈనెల 21 నుంచి ఎంబీఏ పరీక్షలు ప్రారంభం

image

ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఏయూ సిబ్) లో ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 21 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆమె తెలిపారు.

News August 1, 2024

సూరత్-బ్రహ్మపూర్ స్పెషల్ ట్రైన్ పొడిగింపు

image

సూరత్-బ్రహ్మపూర్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ ను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిసిఎం కే.సందీప్ తెలిపారు. సూరత్ బ్రహ్మపూర్ స్పెషల్ సూరత్‌లో ప్రతి బుధవారం మధ్యాహ్నం బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు దువ్వాడ చేరుకుని అక్కడనుంచి బ్రహ్మపూర్ వెళుతుందన్నారు. దీనిని ఈనెల 27 వరకు పొడిగించామన్నారు. బ్రహ్మపూర్ సూరత్ స్పెషల్ బ్రహ్మపూర్‌ లో ప్రతి శుక్రవారం బయలుదేరుతుందని అన్నారు.

News August 1, 2024

విశాఖలో ముందుకొస్తున్న సముద్రం

image

వాతావరణ మార్పుల నేపథ్యంలో విశాఖలో సముద్రం ముందుకు వస్తోందని బెంగళూరుకు చెందిన స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ సంస్థ అధ్యయనంలో తెలిపింది. విశాఖలో 1987- 2021 మధ్యకాలంలో 2,381 సెంటీమీటర్ల భూభాగం సముద్రంలో కలిసిపోయిందని తెలిపింది. 2040 నాటికి విశాఖనగరంలో ఐదు శాతం భూభాగం సముద్రంలో కలిసిపోతుందని తమ అధ్యయనంలో పేర్కొంది.

News August 1, 2024

ఆగస్టు 28వ తేదీలోగా ఓపెన్ స్కూల్ ఫీజు చెల్లించాలి: ఎల్.చంద్రకళ

image

2024-25 విద్యాసంవత్సరానికి గాను ఓపెన్ స్కూల్లో పదవ తరగతి, ఇంటర్ కోర్సులకు ఆగస్టు 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్.చంద్రకళ తెలిపారు. www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచామని తెలిపారు. అర్హులైన వారు పరీక్షకు సత్కారం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థుల ఆలస్యం చేయకుండా ఆన్‌లైన్‌లో వెంటనే దరఖాస్తు చేయాలని తెలిపారు.

News August 1, 2024

విశాఖలో రాజకీయ నాయకులు లేకుండా పెన్షన్

image

విశాఖలో రాజకీయ నాయకులు లేకుండానే పెన్షన్‌ల పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ గ్రామస్థాయి నాయకులు సైతం పంపిణీలో పాల్గొంటున్నారు. ఉమ్మడి విశాఖలో మాత్రం కేవలం సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు మాత్రమే పెన్షన్‌లను పంపిణీ చేస్తున్నారు. విశాఖలో ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదలతో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో రాజకీయ నాయకులు పెన్షన్ పంపిణీకి దూరంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

News August 1, 2024

ఆదాయంలో విశాఖ రైల్వే స్టేషన్‌కు మొదటి స్థానం

image

తూర్పు కోస్తా రైల్వే పరిధిలో 2021-22 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో అత్యధిక ఆదాయం పొందిన తొలి 20 స్టేషన్‌ల జాబితాలో విశాఖ రైల్వే స్టేషన్‌కు మొదటి స్థానం దక్కిందని దువ్వాడ రైల్వే వినియోగదారుల సంఘం కార్యదర్శి కె.ఈశ్వర్ చెప్పారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూ.554.31 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. దువ్వాడ రైల్వే స్టేషన్ రూ.27.19 కోట్ల ఆదాయంతో 13వ స్థానంలో నిలిచిందన్నారు.

News August 1, 2024

విశాఖ ఎమ్మెల్సీ సీటు కోసం పోటాపోటీ

image

విశాఖలో స్థానిక సంస్థల MLC స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. గతంలో స్థానిక సంస్థల నుంచి MLCగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారడంతో స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి ఇప్పుడు పోటీ జరుగుతుంది. కాగా కూటమి నుంచి సీతంరాజు సుధాకర్,గండి బాబ్జి, YCP నుంచి గుడివాడ అమర్నాథ్, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి సీటు కోసం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

News August 1, 2024

అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. పరిహారం నిర్ణీత కాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, ఇతర అధికారులతో కలిసి కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం ఉదయం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టుపై డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

News August 1, 2024

‘విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 3ఏళ్ల ట్యాక్స్ హాలిడే ప్రకటించాలి’

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మూడేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని స్టీల్ సీఐటీయూ గౌరవ అధ్యక్షులు అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 1266వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వాలన్నారు. ఐరన్ ఓర్ సరఫరా చేయాలన్నారు. రైల్వే వేగన్స్ కేటాయించాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణంలో విశాఖ స్టీల్‌ను వినియోగించాలన్నారు.