Visakhapatnam

News February 22, 2026

టాటా నగర్ – ఎర్నాకులం స్పెషల్ ట్రైన్‌కు దువ్వాడలో హాల్ట్

image

టాటా నగర్-ఎర్నాకులం మధ్య పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ‘ట్రైన్ ఆన్ డిమాండ్’ కింద ప్రత్యేక రైళ్లను (08189/08190) ప్రకటించింది. ఈ రైలు విశాఖ సమీపంలోని దువ్వాడ స్టేషన్‌లో ఆగుతుంది. ఫిబ్రవరి 22న టాటా నగర్‌లో బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 24న ఎర్నాకులంలో బయలుదేరే రైలు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 4.40 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది.

News February 21, 2026

ఈస్ట్ కోస్ట్ రైల్వే సరికొత్త రికార్డు

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 324 రోజుల్లోనే 250 మిలియన్ టన్నుల సరకు రవాణాను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి రైల్వే జోన్‌గా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 31 రోజుల ముందే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు రవాణా ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి.

News February 21, 2026

జాతీయ కబడ్డీ పోటీలకు విశాఖ ఆణిముత్యం

image

విశాఖలో గంగవరం ప్రాంతానికి చెందిన నోళ్లు తేజ 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఎంపికయ్యారు. ఈనెల 24 నుంచి 27 వరకు గుజరాత్‌లోని వడోదరలో జరిగే పోటీల్లో పాల్గొంటారు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన తేజను గాజువాక వాసులు అభినందించారు.

News February 21, 2026

విశాఖలో ఎంఐజీ గృహాల నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ సన్నద్ధం

image

విశాఖలో మధ్య తరగతి వర్గాల కోసం MIG గృహ సముదాయాలను నిర్మించనున్నట్లు వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ ప్రకటించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలో స్టాల్‌ను ప్రారంభించిన ఆయన, భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కోసం రూ.175 కోట్లతో 7 ప్రధాన రహదారులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగం మరింత వృద్ధి చెందుతుందన్నారు.

News February 21, 2026

విశాఖ: ఇన్‌ఛార్జ్‌ల పాలనలోనే కీలక పోస్టులు

image

విశాఖ జిల్లాలో DRO, RDO పోస్టులు 3 నెలలకుపైగా ఖాళీగా ఉండటంతో పరిపాలనపై ప్రభావం పడుతోంది. DRO భవనీశంకర్, RDO శ్రీలేఖ మధ్య వివాదం తలెత్తడంతో ప్రభుత్వం ఇద్దరినీ సరెండర్ చేసింది. అనంతరం RDOగా సుధాసాగర్‌కు, DRO బాధ్యతలను ఇతర అధికారులకు అదనంగా అప్పగించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు తరచుగా జరిగే విశాఖలో ప్రోటోకాల్, ప్రముఖుల పర్యటనల ఏర్పాట్లు కీలకంగా ఉండటంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.

News February 20, 2026

16 ఏళ్ల తర్వాత ‘IONS’ పీఠంపై భారత్

image

విశాఖపట్నంలో జరిగిన 9వ అయాన్స్ సదస్సులో 33 దేశాలు పాల్గొన్నాయి. 16 ఏళ్ల తర్వాత భారత నౌకాదళం ఈ ప్రతిష్ఠాత్మక పీఠాన్ని దక్కించుకుంది. నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి అధ్యక్షతన సముద్ర భద్రత, సమాచార మార్పిడి, విపత్తు నిర్వహణలో సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్‌గ్రేడ్ చేసిన వెబ్‌సైట్, సముద్ర విన్యాసాల ద్వారా అంతర్జాతీయ నౌకాదళాల మధ్య ఐక్యతను చాటారు.

News February 20, 2026

విశాఖ ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలు

image

విశాఖపట్నం ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏపీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు విధించినట్లు ఏసీపీ కె.లక్ష్మణ మూర్తి తెలిపారు. కలెక్టరేట్, జీవీఎంసీ, జగదాంబ వంటి కీలక ప్రాంతాల్లో అనుమతి లేకుండా సభలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 20, 2026

కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్‌లో విధులు నిర్వహించేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న బోయన్న (53) జాతీయ రహదారిపై లారీ కింద పడి దుర్మరణం చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.