Visakhapatnam

News February 20, 2026

విశాఖ: వైసీపీ MPTC అరెస్ట్

image

గంజాయి తరలిస్తూ చెక్ పోస్ట్‌ను ఢీకొట్టి పరారైన కేసులో భీమిలి మండలం దాకమర్రి వైసీపీ ఎంపీటీసీ కే.నగేశ్ బాబును కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నేతకు ఈయన అనుచరుడని సమాచారం. నిందితుడిపై గతంలోనే జగ్గంపేట పీఎస్‌లో కేసు నమోదైంది. గంజాయి స్మగ్లింగ్‌లో అరెస్టవ్వడం స్థానికంగా పెను సంచలనంగా మారింది.

News February 20, 2026

జనతా వారధిలో వినతులు స్వీకరించిన పీవీఎన్ మాధవ్

image

బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర కార్యాలయం (విశాఖ)లో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రజల వినతులు స్వీకరించారు. ఎస్‌వీఎస్ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News February 20, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 ఫిర్యాదులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకారరావు ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 వినతులు అందాయి. పట్టణ ప్రణాళికా విభాగంపై వచ్చే ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారానికి ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అత్యధికంగా నార్త్ జోన్ నుంచి 6 వినతులు రాగా.. అధికారులు వెంటనే స్పందించి వీటిని పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

News February 20, 2026

సంకల్ప కళా గ్రామంలో విదేశీ ప్రతినిధుల సందడి

image

విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా పెందుర్తి సమీపంలోని సంకల్ప కళా గ్రామంలో సహజ రంగుల అద్దకంపై కార్యశాల నిర్వహించారు. నేవీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 దేశాల ప్రతినిధులు పాల్గొని చేనేతలు, లక్క బొమ్మలను పరిశీలించారు. విసరడం, దంచడం వంటి పురాతన పద్ధతులను స్వయంగా చేసి ఆనందించారు. అనంతరం కోలాటం, జానపద నృత్యాలతో అతిథులు సందడి చేశారు.

News February 20, 2026

ఏయూ గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

image

ఆంధ్రా యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ యూనివర్సిటీ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. వందేమాతరం పాడడం తప్పా.. భారతమాతకు జై అనడం తప్పా.. అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. వీసీకి ఫిర్యాదు చేయాలే గానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడి చేయడం తగదన్నారు. వారిని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించమని పేర్కొన్నారు.

News February 20, 2026

విశాఖలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

విశాఖలో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 85 కేంద్రాల్లో 81,001 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు తాగునీరు, వైద్య శిబిరాలు, అదనపు బస్సుల సౌకర్యం కల్పించాలని ఆమె సూచించారు. పొరపాట్లు జరగకుండా పరీక్షలను విజయవంతం చేయాలని జేసీ స్పష్టం చేశారు.

News February 20, 2026

గ్లోబల్ ఏఐ సెంటర్‌గా వైజాగ్: గూగుల్ సీఈవో

image

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విశాఖతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థిగా చెన్నై నుంచి ఐఐటీ-ఖరగ్‌పూర్ వెళ్లేటప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ మీదుగా ప్రయాణించేవాడినని, అప్పట్లో అది ఎంతో ప్రశాంతమైన నగరమని గుర్తుచేసుకున్నారు. అలాంటి విశాఖ నేడు గ్లోబల్ ఏఐ (AI) హబ్‌గా మారుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు. ఈ మార్పు అద్భుతమని ఆయన కొనియాడారు.

News February 20, 2026

విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు భూసేకరణ పూర్తి

image

విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారే దిశలో మరో భారీ అడుగు పడింది. నగర సమీపంలో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం 308 ఎకరాలకు పైగా భూసేకరణను ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో సాంకేతిక పెట్టుబడులు పెరగడమే కాకుండా, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖను గ్లోబల్ టెక్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.

News February 19, 2026

టెక్నాలజీతో నిఘా.. ‘అస్త్రం’ యాప్‌తో ట్రాఫిక్ నియంత్రణ

image

విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ బందోబస్తును పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ‘అస్త్రం’ & ‘ఈ-పాత్’ యాప్‌ల సాయంతో భద్రతను పగడ్బందీగా నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకను విజయవంతం చేసిన సిబ్బందిని సిపీ అభినందించారు. పోలీసులకు సహకరించిన నగర ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News February 19, 2026

విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

image

విశాఖలో జరుగుతున్న ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం విశాఖ వచ్చారు. ఆయనకు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పలువురు నేవీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలో ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొని సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.