Visakhapatnam

News February 18, 2026

దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి: మాధవ్

image

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో రాష్ట్రీయ RSS సభ్యులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్రంగా డిమాండ్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఒక జాతీయవాద సంస్థ అని అన్నారు. అటువంటి సంస్థ సభ్యులపై దాడికి పాల్పడడం అంటే కమ్యూనిస్టులు అరాచకత్వానికి పరాకాష్టగా అని అన్నారు.

News February 17, 2026

విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

image

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు MP శ్రీ భరత్, జాయింట్ కలెక్టర్ విద్యాదరి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నగరంలోకి వెళ్లారు.

News February 17, 2026

72 గంటల పాటు బీచ్ రోడ్డులో డ్రోన్ కెమెరాల నిషేధం

image

విశాఖ IFR, మిలాన్, ఐయాన్స్-కాన్ క్లెవ్ అఫ్ చీఫ్స్ నేపథ్యంలో సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలు ఉన్న వారికి పలు సూచనలు చేశారు.17వ తేదీ సాయంత్రం 6 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ 72 గంటలు INS డేగా నుంచి పార్క్ హోటల్ వరకూ 5 కిలోమీటర్లు టెంపరరీ రెడ్ జోన్‌గా ప్రకటించారు. 5 కిలోమీటర్లు పరిధిలో డ్రోన్ కెమెరాలు ఎట్టి పరిస్థితులలోనూ వినోయోగించరాదన్నారు. వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News February 17, 2026

గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు షాక్: వైసీపీ

image

4 వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని గీతం వర్సిటీని సుప్రీంకోర్టు ఆదేశించిందని వైసీపీ ట్వీట్ చేసింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం రూ.118 కోట్ల బకాయిలు చెల్లించాలని.. లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీ చేసిందని అందులో పేర్కొంది. తమను ఈ బకాయిలు చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం బుకాయించినా.. వీబీసీ, గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదించిందంది.

News February 17, 2026

విశాఖలో పర్యాటక ప్రాంతాల పాక్షిక మూసివేత

image

అంతర్జాతీయ నౌకాదళ (IFR-2026) విన్యాసాల దృష్ట్యా విశాఖలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలపై VMRDA ఆంక్షలు విధించింది. కైలాసగిరి, సబ్‌మెరైన్, సీ-హారియర్ మ్యూజియంలు ఈ నెల 19వ తేదీ వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ఉండవన్నారు. అంతర్జాతీయ ప్రతినిధుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News February 17, 2026

విశాఖ: లక్ష్యాన్ని మించిన కస్టమ్స్ వసూళ్లు

image

2024-25 ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్‌కు రూ.13,207.85 కోట్ల ఆదాయం లభించింది. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం-2026 సందర్భంగా విశాఖపట్నం కస్టమ్స్ కమిషనరేట్ నిర్వహించిన ఆదాయ వసూళ్లపై అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనవరి 2026 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న రూ.11,958.08 కోట్లను మించి ఇప్పటికే రూ.12,891.42 కోట్లు వసూలు చేసిందన్నారు.

News February 17, 2026

ఈనెల 21న విశాఖ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

image

విశాఖ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఈనెల 21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 1 నుండి 7 వరకు గల స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తామని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు సంబంధిత శాఖల అధికారులు ప్రగతి నివేదికలతో ఈ సమావేశాలకు హాజరుకావాలని ఆయన కోరారు.

News February 16, 2026

అంతర్జాతీయ కార్యక్రమాల భద్రతపై సీపీ సమీక్ష

image

విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సీపీ డా.శంఖబ్రత బాగ్చి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. విదేశీ ప్రతినిధులు, VVIPల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై కీలక ఆదేశాలిచ్చారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, డ్రోన్ నిఘా, CCTV మానిటరింగ్‌తో పాటు చిన్నారుల రక్షణకు RFID సాంకేతికతను వినియోగించాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.

News February 16, 2026

విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం

image

విశాఖలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీసు కమిషనర్ సంఖ బ్రత బాగ్జీ, నౌకాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు.

News February 16, 2026

విశాఖలో శాప్ లీగ్ క్రీడా పోటీల పోస్టర్ విడుదల

image

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం ‘శాప్ లీగ్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ లీగ్‌లో భాగంగా ఈనెల 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి చదరంగం (Chess) పోటీలు, 24న మర్రిపాలెంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.