India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భీమిలి మండలం చినగదిలి పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసిన విశాఖ డెయిరీకి శనివారం జీవీఎంసీ సహాయ ప్రణాళిక అధికారి శాస్త్రి నోటీసులు జారీ చేశారు. జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. ఆ ప్రాంతంలో వసతి గృహాలు, పశువుల షెడ్లు, ఇతర భవనాలు ఉన్నట్లు గుర్తించామని నోటీసులో పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పత్రాలు వారంలోగా సమర్పించాలని కోరారు.
డయేరియా పట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఆదేశించారు. శనివారం ఆయన సాగర్ నగర్, బాలాజీ నగర్‌లో గల పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి డయేరియా లక్షణాలు కనిపిస్తే సత్వర చికిత్స అందించాలన్నారు. సకాలంలో గర్భిణీలు, బాలింతలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు.
వచ్చే నెల 14న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పేరెంట్-టీచర్స్ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. సమావేశాల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో ఆయన కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ క్రియేట్ చేయాలన్నారు.
ఆంధ్ర-హిమాచల్ ప్రదేశ్ గ్రూప్-బి రంజీ ట్రోఫీ మ్యాచ్ శనివారం విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచి హిమాచల్ ప్రదేశ్ బౌలింగ్ ఎన్నుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు తొలిరోజు ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లకు 295 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఎస్.కె.రషీద్ 132 బంతుల్లో 9 ఫోర్‌లతో 69 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేఎస్ భరత్ 65 పరుగులు చేశాడు.
విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా ముందడుగు వేస్తోంది. సముద్రంలో ఉపయోగించే పరికరాలకు గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి సాంకేతికతను కొరియన్ ప్యూయల్ సెల్ టెక్నాలజీ అసోసియేట్, లోటస్ వైర్ లెస్ ప్రైవేట్ సంస్థతో కలిసి తయారు చేసినట్లు హిందుస్థాన్ షిప్ యార్డ్ తెలిపింది. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ పనిచేస్తుందని తెలియజేసింది.
అరకులోయలో విషాదం నెలకొంది. గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విజయ కుమార్(15) చనిపోయాడు. ఈ నెల 22న విద్యార్థి అనారోగ్యంతో కేజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ముంచంగిపుట్టు మండలం పొల్లిపుట్టు గ్రామానికి చెందిన విద్యార్థిని పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ కొట్టడం వల్ల అనారోగ్యానికి గురై, మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మన విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్‌కు టెస్ట్ టీమ్‌లోకి పిలుపువచ్చింది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో నితీశ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు సెలక్టర్లు జట్టును ప్రకటించారు. ఇటీవల టీ20 అరంగేట్రం చేసిన అతడు త్వరలోనే టెస్ట్ ఎంట్రీ ఇవ్వనున్నారు. టెస్ట్‌లలో రాణించి జాతీయ జట్టులో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలని అభిమానులు, విశాఖ వాసులు కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో చింతపల్లి మాక్స్ సంస్థ ద్వారా రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లు కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్దేశించామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. శుక్రవారం కాఫీ అధికారులు, జీసీసీ అధికారులతో కాఫీ సేకరణపై సమావేశం నిర్వహించారు. ప్రతి మండలానికి నిర్దేశించిన మేరకు, కాఫీ పళ్లను సేకరించాలని కాఫీ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కాఫీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఈనెల 27న విశాఖ బీచ్‌లోని ‘విక్టరీ ఎట్ సీ’ స్థూపంపై లేజర్ షో నిర్వహిస్తున్నట్లు GVMC అధికారులు ప్రకటన విడుదల చేశారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ తరఫున అందరినీ ఆకట్టుకునేలా సౌండ్, లేజర్ షో ఉంటుందని అన్నారు. ఆదివారం సా.7 గంటలకు షో మొదలౌతుందని, 1971లో నౌకాదళం యుద్ధం, విశాఖ పాత్ర, యుద్ధవీరుల సాహసాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ప్రతీ ఆదివారం ఈ లేజర్ షోను వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
విశాఖ పీఎంపాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 26 నుంచి ఆంధ్ర- హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను స్టేడియంలో పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం సెషన్‌లో ఆంధ్రా జట్టు, మధ్యాహ్నం సెషన్‌లో హిమాచల్ ప్రదేశ్ జట్టు నెట్ ప్రాక్టీస్ చేశాయి. రంజీ మ్యాచ్‌లను తిలకించేందుకు క్రికెట్ అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.