India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎంగా కుందు రామరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2006 IRSE బ్యాచ్‌కు చెందిన కుందు రామారావు భారత రైల్వేలోని వివిధ జోన్‌లలో కీలక హోదాల్లో సేవలందించారు. నాగ్‌పూర్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్‌గా, రాయ్‌పూర్‌లో సీనియర్ ఏడీఈఎన్‌గా, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని బిలాస్‌పూర్‌లో సీనియర్ డివిజనల్ ఇంజినీర్‌గా, విజయవాడలో సీనియర్ డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేశారు.
పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో ప్రత్యేక అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. మన్యం జిల్లా కురుపాంలో ఇటీవల వసతి గృహంలో బాలికలు అస్వస్థతకు గురైన విషయంపై చర్చించారు. పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు మంచి నీరు విద్యార్థులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఏయూ నిర్వహిస్తున్న వివిధ పీజీ, పీజీ డిప్లమో సెల్ఫ్ సపోర్ట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకులు డి.ఏ.నాయుడు తెలిపారు. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కలవు. దరఖాస్తు, ఫీజుల వివరాలు, ప్రవేశాలు, అర్హత వివరాలు ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
విశాఖలో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో మహిళా భద్రత, సాధికారతపై సదస్సు జరిగింది. మహిళల ఆర్థిక స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యమని హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ‘శక్తి యాప్’ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు, తోటి మహిళల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
విశాఖ తీరప్రాంతానికి సరికొత్త అందాలు అద్దే ‘బీచ్ కారిడార్’ పనులు శరవేగంగా సాగుతున్నాయి. భీమిలి వరకు 6 వరుసల రహదారిగా విస్తరించడంతో పాటు, ప్రపంచస్థాయి పర్యాటక వసతులు, హోటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నగరం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆదర్శ ఉపాధ్యాయులుగా నిలిచేందుకు, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు పోటీపడి పనిచేయాలని ఇటీవల డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయలను ఉద్దేశించి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు మధురువాడలో ఏర్పాటు చేసిన ఇండక్షన్ ట్రైనింగ్ శిబిరాన్ని విశాఖ కలెక్టర్ బుధవారం సందర్శించారు. కలకాలం విద్యార్థులు మిమ్మల్ని గుర్తుంచుకునేలా వినూత్న రీతిలో బోధించాలని సూచించారు.
పెదగంట్యాడలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయసేకరణలో స్థానిక YCP నాయకుల తీరు చర్చనీయాంశమయ్యింది. అధికారులు రాకముందే స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు, 64వవార్డు కార్పొరేటర్ గోవింద్ రెడ్డి(జనసేన), 75వ కార్పొరేటర్ పూలి లక్ష్మీభాయి(TDP) సభా ప్రాంగణానికి చేరుకుని <<17947721>>ఆందోళనలో<<>> పాల్గొన్నారు. అయితే అంతా అయ్యాక గాజువాక వైసీపీ ఇన్‌ఛార్జ్ తిప్పల దేవాన్‌రెడ్డి స్థానిక నాయకులతో ఎంట్రీ ఇచ్చారు.
విశాఖలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని వైకాపా తన ఉత్తరాంధ్ర సమావేశంలో తీర్మానం చేసిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. గతంలో తాము జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు దర్శి, సత్తెనపల్లి వంటి అనేక ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చామని గుర్తుచేశారు. కానీ వైకాపా మాత్రం విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు.
ఎల్ఆర్ఎస్ పథకం కోసం VMRDA గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ పథకం కింద తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చని అన్నారు. దీనివల్ల భవన నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ-కేవైసీ చేస్తున్నామని డ్వామా పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. NMMS యాప్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదుకు దీన్ని చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనికి రాకుండా ముఖ ఆధారిత హాజరు పద్ధతి ప్రారంభం కానుందని అన్నారు. జిల్లాలో 47,725 మందికి ఈ-కేవైసీ జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, జాబ్ కార్డులతో క్షేత్ర సహాయకుడిని సంప్రదించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.