India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంటర్ ఫలితాలు రేపు ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విశాఖ జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో40,653 మంది, ద్వితీయ సంవత్సరంలో42,693 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అందరికంటే ముందుగా ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

విశాఖపట్నంలో సముద్ర సంపద పెంపునకు కీలక చర్యలు చేపట్టారు. ICAR-CMFRI ఆధ్వర్యంలో 2,000 చేప పిల్లలను సముద్రంలో విడుదల చేశారు. ఇందులో ఇండియన్ పాంపానో, గోల్డెన్ ట్రెవల్లి జాతులు ఉన్నాయి. PMMSY కింద అభివృద్ధి చేసిన ‘ఫిష్ సీడ్ సీ రాంచింగ్ డివైస్’ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా చేపలు పెరిగి, మత్స్యకారులకు ధీర్ఘకాలంలో ఆదాయం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

విశాఖపట్నం-బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలు (58532) మంగళవారం రీషెడ్యూల్ అయింది. లింక్ రైలు ఆలస్యంగా రావడంతో సాయంత్రం 5:45 గంటలకు బదులు 6:45 గంటలకు బయలుదేరుతుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని, వారికి కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

విశాఖలోని ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఒక్కరోజే 2,474 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,209, పిలియన్ రైడర్-226, ట్రిపుల్ రైడింగ్- 112, ఓవర్ స్పీడ్-223, సెల్ఫోన్ డ్రైవింగ్-19, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-06, మైనర్ డ్రైవింగ్ 02, రాంగ్ పార్కింగ్-191, డ్రంకన్ డ్రైవింగ్-47, సీజ్ అయిన వెహికల్స్-58 ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-501 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.

విశాఖలోని రామా టాకీస్ వద్ద స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వెనుక ఉన్న మహిళ బస్సు చక్రల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్‌కు చెందిన రోజా రాణి తన అన్నకు ఆపరేషన్ జరిగిందని తెలుసుకొని విశాఖ వచ్చి పరామర్శించి తమ్ముడితో స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందినట్లు సమాచారం. త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

GVMC పరిధిలో టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ప్రతి సోమవారం PGRSలో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. 2 నెలల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు, నాయకులు వేధింపులు తాళలేక కంచరపాలెంలో ఒక వ్యక్తి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇటీవల టౌన్ ప్లానింగ్ శాఖపై ACB దాడులు కలకలం సృష్టించాయి. గత కలెక్టర్ కూడా ఈ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ విశాఖ ప్రజలు టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై మీ కామెంట్ తెలపండి.

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న గంధం అమావాస్యను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. 16న సాయంత్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రాత్రి కొండదిగువన వరాహ పుష్కరిణి వద్ద, కొండపైన జాగరం చేసి అమావాస్య రోజు దర్శించుకోవడం ఆనవాయితిగా వస్తోంది. కావున ఏప్రిల్ 17న ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఈవో వెంకట్రావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.