India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో రెవెన్యూ క్లినిక్‌కు వచ్చిన అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై రెవెన్యూ క్లినిక్‌కు 63, సాధారణ పీజీఆర్ఎస్‌కు 109 వినతులు అందాయి. అందులో జీవీఎంసీవి 48, పోలీస్ శాఖవి 7, ఇతర శాఖలకు చెందినవి 54 ఉన్నాయి. కలెక్టర్‌తో పాటు జేసీ విద్యాధరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇంటర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రతీ పరీక్షా కేంద్రానికి ఒక ఛీప్ సూపరింటెండెంట్, సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. 85 కేంద్రాల్లో థియరీ, 138 కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌కు 81 వేల మంది హాజరుకానున్నారు.

పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా జనన రిజిస్టర్‌లో నమోదు చేసుకోలేదా.. మీకోసమే GVMC మరో అవకాశం కల్పించింది. GVMC పరిధిలో ఉన్నవారు ఈనెల 21వ తేదీలోగా జనన రిజిస్టర్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. అన్ని జోనల్ కార్యాలయాల్లోని జనన రిజిస్టర్ అధికారులను సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 22 నుంచి వీరికి రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉండదన్నారు.

విశాఖపట్నం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిళ్ల విద్యాధరి సోమవారం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని ఆమె పరిచయం చేసుకున్నారు. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన మయూర్ అశోక్ బదిలీపై గుంటూరు వెళ్లారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు.

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. అంతకుముందు అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలన్నారు. జీవీఎంసీలో సాధారణ, టౌన్ ప్లానింగ్ వినతులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్‌కి ఆదేశించారు. అలసత్వం వహిస్తే 2 సార్లు మెమోలు ఇవ్వాలని, మూడోసారి ఛార్జి మెమో ఇవ్వాలన్నారు.

ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ 10 గంటలకు ప్రారంభమైనా ఫిర్యాదుదారులు కనిపించలేదు. మరోవైపు అధికారులు కూడా సగానికి పైగా లేకపోవడం విశేషం. అన్ని సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో వచ్చిన వారు విస్తుపోతున్నారు. పండగ ఎఫెక్ట్ కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని పలువురు భావిస్తున్నారు.

గాజువాకలోని దొంగలు పండుగ దెబ్బ చూపించారు. 70వ వార్డు ఎల్బీనగర్‌లో ఒకే వరుసులో ఉన్న మూడు ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాజువాక క్రైమ్ సీఐ, ఇతర బృందం చేరుకుని వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఈ మూడు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ఏం చోరీ జరిగిందనే విషయం తెలియరాలేదు. యజమానులకు పోలీసులు సమాచారం అందించారు. సీసీ పుటేజులు పరిశీలిస్తున్నారు.

జీవీఎంసీ 86వ వార్డు TDPలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. NTR వర్ధంతి సందర్భంగా కూర్మన్నపాలెం కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఒక వర్గంగా, వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ మరో వర్గంగా విడిపోయి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మద్దతుతో వార్డు అధ్యక్షుడు తన పట్టును పెంచుకుంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విశాఖ వ్యాలీ జంక్షన్ దగ్గర సిగ్నల్ పాయింట్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేటి నుంచి తరగతులు పున:ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో దాదాపు నెల రోజులపాటు విద్యార్థులకు సెలవులను ఇచ్చారు. పండుగ సెలవుల అనంతరం ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ఐదు రోజులుగా బోధనేతర సిబ్బందికి సైతం పండగ సెలవులు లభించాయి దీంతో విశ్వవిద్యాలయం బోసిపోయింది. నేటి నుంచి పూర్తిస్థాయిలో వర్సిటీ పనిచేస్తుంది.
Sorry, no posts matched your criteria.