Visakhapatnam

News July 2, 2024

ప్రజలు ఛీ కొట్టినా జ్ఞానోదయం కలగలేదు: గంటా

image

వైసీపీ ప్రభుత్వ పాలన వద్దని ప్రజలు ఛీకొట్టినా ఆ పార్టీ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగకపోవడం విచారకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గంటా స్పందించారు. వైసీపీకి చెందిన వారిని వీసీలుగా నియమించుకుని జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే ఆరోపించారు.

News July 2, 2024

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిష్కార వేదికకు 50 ఫిర్యాదులు

image

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిష్కార వేదికకు 50 ఫిర్యాదులు అందినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కమిషనర్ ఫకీరప్ప పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం పోలీస్ కమిషనర్ సంబంధిత సీఐలు, ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు.

News July 1, 2024

విశాఖ: రేప్ కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

image

రేప్ కేసులో గిరీశ్ అనే వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ.9వేల జరిమానా విధిస్తూ విశాఖ కోర్టు తీర్పు చెప్పినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. కొయ్యూరు మండలానికి చెందిన ఓ గిరిజన యువతి అతడిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021లో రేప్ కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జరిగిన వాదోపవాదాల్లో నేరం నిర్ధారణ కావడంతో నిందితుడికి జైలు శిక్ష పడిందని చెప్పారు.

News July 1, 2024

APL: వైజాగ్ వారియర్స్‌దే విజయం

image

విశాఖ నగరం వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన APL-3 రెండో మ్యాచ్‌లో వైజాగ్ వారియర్స్ విజయం సాధించింది. బెజవాడ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ టైగర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. వైజాగ్ వారియర్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. 

News July 1, 2024

కొత్తకోట: సోదరిని వేధించాడని యువకుడిపై కత్తితో దాడి

image

రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన గౌరీనాథ్ (28)పై అదే గ్రామానికి చెందిన పెంటకోట రాము, లక్ష్మణ్‌లు ఆదివారం రాత్రి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కొత్తకోట ఎస్సై లక్ష్మణరావు వివరాల మేరకు.. తమ సోదరిని గౌరీనాథ్ వేధిస్తుండటంపై వారు నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరగ్గా వెంట తెచ్చుకున్న కత్తితో గౌరీనాథ్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News July 1, 2024

విశాఖ: జోరుగా పింఛన్ల పంపిణీ

image

పింఛన్ పంపిణీ కొనసాగుతోంది. సా.5 గంటలకు విశాఖ జిల్లాలో 93.28, పార్వతీపురం-92.74, అనకాపల్లి-88.5, అల్లూరి జిల్లాలో 86.87% పంపిణీ పూర్తైంది. విశాఖ జిల్లాలో 1,64,150 మందికి గానూ 1,53,116 మందికి, అనకాపల్లి జిల్లాలో 2,64,033 మందికి గానూ 2,33,662 మందికి పంపిణీ చేశారు. పార్వతీపురం జిల్లాలో 1,44,518 మందికి గానూ 1,34,019 మందికి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,26,813 మందికి గానూ 1,10,168 మందికి అందజేశారు.

News July 1, 2024

హోంమంత్రి అనిత ఓ.ఎస్.డీ.గా అనిల్ కుమార్

image

హోం మంత్రి వంగలపూడి అనిత ఓ.ఎస్.డీ.గా అడిషనల్ ఎస్పీ అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనిల్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్నారు. ఆయనకు ఇంటిలిజెన్స్‌లో పోస్టింగ్ ఇస్తూ హోంశాఖ మంత్రి ఓ.ఎస్.డీ.గా విధులు అప్పగించారు. గతంలో అనిల్ కుమార్ డీజీపీ గౌతమ్ సవాంగ్ వద్ద ఓ.ఎస్.డీగా పనిచేశారు.

News July 1, 2024

సింహాచలం: 3న వైకుంఠ వాసునికి వరద పాయసం

image

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థిస్తూ ఈ నెల మూడవ తేదీన సింహాచలం వైకుంఠ వాసుని మెట్ట మీద వైకుంఠవాసునికి వరద పాయసం పోయనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ మేరకు వైదిక వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు వారి నిర్ణయం మేరకు 3న ఉదయం 8 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, విరాటపర్వం పారాయణం నిర్వహిస్తామన్నారు. అనంతరం వరుణ మంత్ర జపం చేసి పాయసం నివేదన సమర్పిస్తామన్నారు.

News July 1, 2024

విశాఖ సీపీగా బాధ్యతలు స్వీకరించిన శంకబ్రత బాగ్చీ

image

విశాఖ సీపీగా శంకబ్రత బాగ్చీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్‌లో పని చెయ్యడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తనకు ఇక్కడ పని చెయ్యడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు పెళ్లి అయ్యాక హనీమూన్ ఎక్కడకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నప్పుడు అందరూ స్విట్జర్లాండ్ వెళ్లాలన్నారు కానీ.. అప్పుడు డబ్బులు లేకపోవడంతో విశాఖనే ఎంచుకున్నాని తెలిపారు.

News July 1, 2024

విశాఖ నగరానికి తలమానికంగా క్లాక్ టవర్

image

విశాఖ మహా నగరానికి జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్ తలమానికంగా నిలిచింది. నగరాభివృద్ధిలో భాగంగా అధికారులు సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో నగరంలోని అతి ముఖ్యమైన జగదాంబ సెంటర్‌లో క్లాక్ టవర్‌ను నూతనంగా నిర్మించారు. ఈ టవర్ చుట్టూ విద్యుత్ దీపాలను అందంగా అలంకరించారు. ఈ క్లాక్ టవర్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.