Visakhapatnam

News January 12, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్‌ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 11, 2026

విశాఖ- పార్వతీపురం మధ్య ప్రత్యేక MEMU రైలు

image

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ-పార్వతీపురం మధ్య MEMU స్పెషల్ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (08565/08566) రైలు ఈనెల 14-18 వరకు విశాఖలో ఉ.10కి బయలుదేరి మ.12.20కి పార్వతీపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పార్వతీపురంలో మ.12.45కి బయలుదేరి సా.4 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలుకి సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, తదితర స్టేషన్లలో హాల్ట్ కలదు.

News January 11, 2026

విశాఖ పోలీసులను అభినందించిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా

image

విశాఖలో మహిళపై దాడి కేసులో స్పష్టమైన ఆధారాలు లేకున్నా పోలీసులు కేసు ఛేదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు స్పందించిన తీరు, వేగవంతమైన దర్యాప్తు అభినందనీయమని ఆయన కొనియాడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనమన్నారు. మహిళల రక్షణలో దేశంలోనే విశాఖకు మొదటి స్థానం కూటమి ఘనతే అన్నారు.

News January 11, 2026

విశాఖ జూ పార్క్‌లో ముగిసిన వింటర్ క్యాంప్

image

విశాఖ జూ పార్క్‌లో 4 రోజుల నుంచి జరుగుతున్న వింటర్ క్యాంప్ ఆదివారంతో ముగిసింది. జనవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ క్యాంప్ నిర్వహించిన్నట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. వింటర్ క్యాంప్‌తో వన్యప్రాణుల ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేశారు. ముఖ్యంగా జూ పార్కులో వెటర్నరీ హాస్పిటల్, జంతువుల నివాసాలు, వాటి ఆహారపు అలవాట్లు, వాటి ప్రత్యేక లక్షణాలపై అవగాహన కల్పించారు.

News January 11, 2026

సైబర్ క్రైమ్ ముఠా ఉచ్చు నుంచి బయటపడ్డ ఉత్తరాంధ్ర యువకులు

image

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్‌లో సైబర్ క్రైమ్ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి తిరిగి మన దేశానికి తీసుకొచ్చారు. ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యువకులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

News January 11, 2026

రేపు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) జరగనుంది. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్, ఆర్ముడ్ రిజర్వ్ ఆఫీస్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కి తెలియజేసి, సత్వర పరిష్కారం పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.

News January 11, 2026

విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించిన సీఎం

image

విశాఖలో ఓ మహిళపై జరిగిన దాడిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులను సీఎం చంద్రబాబు అభినందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని సీఎం కొనియాడారు. విశాఖలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదన్నారు.

News January 11, 2026

జీవీఎంసీ బడ్జెట్ రెడీ… రేపు స్థాయి సంఘంలో చర్చ!

image

జీవీఎంసీ బడ్జెట్ తుదిమెరుగులు దిద్దారు. కమిషనర్ కేతన్గర్, మేయర్ శ్రీనివాసరావు కలిసి బడ్జెట్ రూపకల్పన చేయగా 13 పద్దుల కింద రూ.2064.73 కోట్లు ఆదాయం అని అంచనా వేశారు. జీవీఎంసీకి సొంతంగా అన్ని విభాగాల నుంచి 1749.68 కోట్లు సమకూర్తున్నట్లు బడ్జెట్‌లో చూపించారు. బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ అంశాలను సోమవారం జరిగే స్థాయి స్థానం సమావేశంలో సభ్యులతో సలహాలు తీసుకొని తుది మార్పులు చేసి ఆమోదం తెలపనున్నారు.

News January 11, 2026

విశాఖ: 20 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖ జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) మొత్తం 20 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. టైప్-3 విభాగంలో 06, టైప్-4 విభాగంలో 14 నాన్ టీచింగ్ పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూలు.

News January 11, 2026

ఆనందపురంలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే

image

ఆనందపురం మండలంలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కేజీ రూ.950-1000 ఉండగా.. చికెన్ (స్కిన్ లెస్) కేజీ రూ.300గా ఉంది. విత్ స్కిన్ కేజీ రూ.280 చొప్పున విక్రయిస్తున్నారు. శొంఠ్యాం కోడి కేజీ రూ.310గా ఉంది. అలాగే డజన్ గుడ్లు రూ.90కి కొనుగోలు చేస్తున్నారు. గత వారంతో పోల్చుకుంటే దాదాపు అన్ని రేట్లు కాస్త పెరిగాయని వినియోగదారులు తెలిపారు.